బాహుబలి..రోజుకు 40 గుడ్లు..ఒకసీన్ కోసం 109రోజులు ..

By Hazarath
|

ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న సినిమా పేరు ఏదైనా ఉందంటే అది బాహుబలిమాత్రమే..జాతీయ అవార్డును కొల్లగొట్టి తెలుగు సినిమా చరిత్రను ఆకాశానికి తీసుకెళ్లింది. బాలీవుడ్ డైరక్టర్లు సైతం బిత్తరపోయే విధంగా సినిమాను తెరకెక్కించిన రాజమౌళి దర్శకుడిగా తన సత్తాను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ సినిమా తరువాత మరే సినిమా ఆ స్థాయిని అందుకోలేదంటే అతిశయోక్తి కాదు.. అంతటి ప్రఖ్యాత చిత్రం గురించిన కొన్ని నిజాలు వింటే అందరూ షాకవ్వాల్సిందే...

Read more: విజువల్ మాయ : కనికట్టు చేసి కోట్లు కొల్లగొట్టారు

1

1

ఈ సినిమాలో రానా అలాగే ప్రభాస్ పిట్ గా కనిపించడానికి రోజుకు 40 గుడ్లు అలాగే పాలు తినడమే పనిగా పెట్టుకున్నారట.

2

2

ఈ సినిమాలో ప్రభాస్ అలా అదిరే లుక్ తో కనిపించడానికి జిమ్ కు అయిన ఖర్చు రూ. 1.5 కోట్లు. ప్రైవేట్ వ్యాయామశాల నుండి ఈ పరికరాలను తీసుకొచ్చారు.

1

1

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఏదైనా ఉందంటే అది బాహుబలి మాత్రమే. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో సినిమా బయటకొచ్చింది. ఆయుధాలకే సగం డబ్బు ఖర్చయిందంటే నమ్మగలరా..

4

4

ఈ సినిమా కోసం 17 VFX కంపెనీలు, అలాగే 800కు పైగా టెక్నీషియన్లు పనిచేశారు. VFX effects ఖర్చే 86 కోట్లు దాటింది. దీనికి పనిచేసిన VFX సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ మూడు సార్లు నేషనల్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. శంకర్ సినిమాలు ఐ, రోబోలకు కూడా పనిచేశారు.విదేశాల్లోని VFX కంపెనీలు కూడా ఇందులో పనిచేశాయి.

5

5

స్టోరీ సమయంలో ఎన్నో ప్రశ్నలు మరెన్నో చిక్కులు వచ్చాయి. మహాభారతంకు నివాళిగా సినిమాను తెరకెక్కించాలని అనుకుంటే కొంతమంది దీని మీద అనేక ప్రశ్నలు లేవదీశారు. కాబట్టి ఇది రాజులు సినిమా అలాగే పూర్తిగా కల్పితమంటూ ముందుకు నడింపిచారని తెలుస్తోంది. ఇందులో కనిపించే గన్ పౌడర్ అలాగే పైర్ పవర్ చైనాలో 9వ శతాబ్దంలోనే కనుగొన్నట్లు తెలుస్తోంది.

6

6

ఇందులో కాలకేయ మాట్లాడిన భాష ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా బాహుబలికి మాత్రమే కనుగొనడం జరిగిందిఈ భాషను లార్డ్ ఆప్ రింగ్స్ నుండి తీసుకోబడింది. దీన్ని మాటల రచయిత మదన్ కెర్కీ కనిపెట్టారుజ 40 వ్యాకరణ నియమాలతో 750 పదాల వరకు ఆయన రాశారు. కాలకేయుని కోసమే ఈ భాష కనిపెట్టబడింది.

6

6

50 వేల అడుగుల్లో వెలిసిన ఈ పోస్టర్ అత్యంత పెద్దపోస్టర్ గా గిన్నీస్ లో చోటు సంపాదించింది.

8

8

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఒక సంవత్సరం అలాగే షూట్ 2 సంవత్సరాల పాటు జరిగింది. ఇండియాలోనే ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమా కూడా ఇదే.

9

9

ఈ సినిమాలో వాటర్ ఫాల్ సీన్లు బాగా రావడానికి చాలా కష్టపడ్డారు. వాటికోసం వాటర్ ఫాల్ దగ్గరే దాదాపు 109 రోజులు షూట్ చేశారు. సీన్లు బాగా రావడం కోసం అన్ని రోజులు అక్కడే గడిపారు.

10

10

ఈ సినిమా కోసం ప్రభాస్ తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నారు.

11

11

సినిమా ట్రయిలర్ వదిలిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో 4 మిలియన్ల వ్యూస్ వస్తే.. ఫేస్ బుక్ లో 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

12

12

బిబిసి డాక్యుమెంటరీలో 100 ఇయర్స్ ఆఫ్ సినిమా ఫీచర్స్ మీద ఇండియా నుంచి ప్రదర్శితమైన ఒకే ఒక్క సినిమా బాహుబలి మాత్రమే.

13

13

అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో ప్రభాస్ ముందుకు చేరాడు. ఈ సినిమా కోసం 20 కోట్లు తీసుకున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, ముమ్మట్టిలకన్నా ఇదిఎక్కువ.

14

14

ఇండియన్ మూవీ చరిత్రలో 25 కోట్లకు శాటిలైట్స్ దక్కించుకున్న ఏకైక మూవీ బాహుబలి మాత్రమే.

15

15

IMDB లో 9.4 ర్యాంకు దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ మూవీ బాహుబలి.. ఇంతకుముందు 300 7.4 ర్యాంకును దక్కించుకుంది.

16

16

ఈ సినిమాకు తీసుకొచ్చిన ఆయుధాలతో అది ఓ మ్యూజియంలాగా మారింది. సినిమాకి వాడిన కాస్ట్యూమ్స్ అలాగే ఆయుధాలు అన్నీ కలిపితే ఓ పెద్ద మ్యూజియం అవుతుందట.

17

17

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పేరు మార్మోగిపోయింది. సౌత్ ఇండియాలో తెలుగు సినిమా తన ప్రస్థానాన్ని మరోసారి ఘనంగా చాటిచెప్పింది. బాలీవుడ్ డైరక్టర్లు సైతం జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారు,

Best Mobiles in India

English summary
Here Write Indian Most high tech VFX movie bahubali Mind blowing facts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X