కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
ఫోన్ మనందరి జీవితాల్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. కమ్యూనికేషన్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన సాధనంలో అవతరించిన స్మార్ట్‌ఫోన్ ఆధునిక బుతుకుల్లో ఆనందాలతో పాటు కల్లోలాలను కూడా రేపుతోంది. అవసరమైన సందర్భంలో చేతిలోని ఫోన్ స్పందించకపోయినట్లయితే దానిని విసిరిగొట్టేయలన్నంత కోపం మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లను అసహ్యించుకునేలా చేసే చికాకు సందర్భాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం..
Read More : గూగుల్ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
జీరో నెట్‌వర్క్ జోన్‌లలో ఫోన్ సిగ్నల్ చాలా వీక్ గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంట్ కాల్ లేదా మెయిల్‌ను పంపటానికి నానా ఇబ్బందులు పడతుంటాం. ఫోన్ పై మునుపెన్నడు చూపని చికాకును వ్యక్తపరుస్తుంటాం.

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
మీకో అర్జెంట్ కాల్ వచ్చింది. ఆ కాల్‌ను ఖచ్చితంగా రిసీవ్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో హోమ్ స్ర్కీన్ స్లైడర్ పనిచేయకపోతే ఏం చేస్తారు..? ఇలాంటి సిట్యుయేషన్ చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదురయ్యే ఉండొచ్చు.

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
కాల్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు కొన్నికొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా అవతలి వ్యక్తి నుంచి వచ్చే వాయిస్ క్లియర్‌గా వినిపించదు. ఒకరకమైన గందరగోళంతో కూడిన సౌండ్ మనల్ని కోపోద్రిక్తులను చేస్తుంది.

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
ఎక్కువ నిడివితో ఉన్న వీడియో లేదా మ్యూజిక్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు..? డౌన్‌లోడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. సడెన్‌గా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. కారణమేంటని ఆరాతిస్తే ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్ అయిపోయిందని తేలింది. ఇలాంటపుడు మీ రియాక్షన్ ఏంటి..?

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
ఒక ముఖ్యమైన గ్రూప్ చాట్ లేదా ప్రయివేట్ వ్యవహారంలో ఉన్నప్పుడు సడెన్‌గా ఫోన్ హ్యాంగ్ అయితే..? ఫోన్‌ను విసిరిగొట్టేయలన్నంత కోపం మనల్ని ఆవహిస్తుంది.

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
ఫోన్‌లోని ముఖ్యమైన డేటా సడెన్‌గా డిలీట్ అయిపోతే..?, ఈ ఫీలింగ్ ఊహించుకుంటేనే భయకరంగా ఉంది కదండి.

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
ఒక ముఖ్యమైన గ్రూప్ చాట్ లేదా ప్రయివేట్ వ్యవహారంలో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోవటం కారణంగా ఫోన్ ఆగిపోతే ఏం చేస్తారు..? ఇలాంటి సిట్యుయేషన్‌లో మీ రియాక్షన్ ఏంటి..?

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
స్మార్ట్‌ఫోన్‌లో ఓ హర్రర్ సినిమా చూస్తున్నారు.. ఓ భయంకరమైన విజువల్ స్ర్కీన్ పై ప్లే అవుతోంది.. మీలో ఉత్కంఠ మరింత పెరిగింది. సడెన్‌గా మీ ఫోన్ రింగ్‌టోన్ పెద్ద శబ్థంతో మోగింది. ఈ సిట్యుయేషన్‌లో ఏలా ఫీలవుతారు..?

కోపంతో ఫోన్‌లను విసిరిగొట్టే క్షణాలు..!
సడెన్‌గా ఫోటో తీసుకోవల్సి వచ్చింది. అదే సమయంలో ఫోన్ కెమెరా యాంప్ లాంచ్ అవ్వకపోతే..? ఏంటీ మీ రియాక్షన్.


Click it and Unblock the Notifications