మీ మెదడుకు డేంజర్ బెల్స్..?

Written By:

మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి రాకముందు మానవ సంబంధాలు ఉన్నత విలువలను సంతరించుకుని ఉండేవి. మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాకా మనషి మనిషితో నేరుగా మాట్లాడటమే మానేసాడు. ఏదో కొత్త ట్రెండును అనుసరిస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆప్యాయత అనురాగాలు పూర్తిగా కొరవడుతున్నాయనే చెప్పాలి.

మీ మెదడుకు డేంజర్ బెల్స్..?

ఇదిలా ఉంటే కమ్యూనికేషన్ విభాగంలో కొత్త సంస్కరణలకు నాంది పలుకుతూ అవతరించిన స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జ్ఞాపకశక్తిని హరించివేస్తున్నాయని ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మత్తులో జోగుతున్న మనిషి తన మెదడును ఆశ్రద్ధ చేస్తున్నాడనన్నది ఈ అధ్యయనాలు సారాంశం. స్మార్ట్‌ఫోన్ మనిషి జ్ఞాపకశక్తి పై ఏ విధమైన ప్రభావం చూపుతందనే దాని పలు ఆసక్తికర విషయాలు..

Read More: ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ జ్ఞాపకశక్తిని మింగేస్తోందా..?

స్మార్ట్‌ఫోన్‌లు మనిషిని తెలియని ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఉదాహరణకు.. ‘సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్' స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న యువతలో అత్యధిక శాతం మంది సోషల్ నెట్‌వర్కింగ్‌లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిద్రకు దూరమవుతున్నారు. ఆహారం వేళ కాని వేళల్లో తీసుకుంటున్నారు. పర్యావసానంగా అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ జ్ఞాపకశక్తిని మింగేస్తోందా..?

ఫోన్ నెంబర్‌లను మొదలుకుని వ్యక్తిగత విషయాల వరకు స్మార్ట్‌ఫోన్‌లలోనే స్టోర్ చేసుకుంటున్నాం. తద్వార మెదడుకు పనిలేకుండా పోతుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల వైపు చూడకుండా పది మంది మొబైల్ నెంబర్లు చెప్పగలిగితే గొప్పే.

స్మార్ట్‌ఫోన్ జ్ఞాపకశక్తిని మింగేస్తోందా..?

స్మార్ట్‌ఫోన్‌లను చిన్నారులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నతనం నుంచే వారికి స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయటం ద్వారా ప్రాక్టికల్‌గా అవగాహన చేసుకోవల్సిన అంశాలను వారు ఆదమరుస్తారు. తద్వారా వారు మానసికంగా వెనుకబడిపోయే అవకాశముంది.

స్మార్ట్‌ఫోన్ జ్ఞాపకశక్తిని మింగేస్తోందా..?

స్మార్ట్‌ఫోన్‌లు మానవ మేధస్సును సోమరిగా మార్చేసే అవకాశం లేకపోలేదు. సార్ట్‌ఫోన్ అన్ని సౌకర్యాలను చేరువ చేసేస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌‍ఫోన్ ద్వారా టన్నుల కొద్ది సమచారాన్ని ఏ మాత్రం శ్రమించుకుండా తెలుసుకోగలుగుతున్నాం.

స్మార్ట్‌ఫోన్ జ్ఞాపకశక్తిని మింగేస్తోందా..?

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజెన్‌లు అందుబాటులోకి రావటంతో మనుషులు ఆలోచించటమే మనేసారు. మనకూ ఓ మెదడుందన్న విషయాన్ని ఆదమరుస్తున్న ఆధునిక మనుషులు ప్రతి చిన్న విషయానికి గూగుల వంటి సెర్చ్ ఇంజన్‌లను ఆశ్రయిస్తున్నారు.

పూర్తిగా మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు

కమ్యూనికేషన్ వ్యవస్థను స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా మారిపోయాని చెప్పటానికి ఈ ఫోటో చక్కటి ఉదాహరణ.

పూర్తిగా మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు

చాటింగ్, మెసేజింగ్, మైక్రోబ్లాగింగ్ వంటి సరికొత్త కమ్యూనికేషన్ సాధనాలకు మనిషి ఆకర్షితుడవుతున్నాడు.

పూర్తిగా మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పక్క పక్కనే ఉన్నప్పటికి స్మార్ట్‌ఫోన్‌లలోనే సంభాషించుకునేందుకే ఇష్టపడుతున్నారు.

పూర్తిగా మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆత్మీయ పలకరింపులు పూర్తిగా కొరవడ్డాయనే చెప్పాలి

పూర్తిగా మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు

ఏదేమైనప్పటికి నేటి కమ్యూనికేషన్ టెక్నాలజీకి యువత దాసోహమంటోంది.

మరిన్ని లేటెస్ట్ వార్తలు

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is Your Smartphone Destroying your memory..?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot