మరో చరిత్రను లిఖించే దిశగా ఇస్రో అడుగులు

By Hazarath
|

ఎన్నో రికార్డులను తన కిరీటంలో నింపుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు చరిత్రలో మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం ఏకకాలంలో చిన్నా పెద్ద అన్నీ కలిపి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు చకచకా అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగం మేలో జరగనుందని తెలుస్తోంది. పీఎస్ఎల్వీసీ -34 ద్వారా భారత్ కార్టోశాట్2సీని ప్రయోగించబోతున్న ఇస్రో .. అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీ తదితర దేశాలకు చెందిన 21 ఉపగ్రహాలనూ అదే ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపబోతున్నట్లు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ కె.శివన్ వెల్లడించారు.

Read more : మాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యం

Isro

2008 లో 10 ఉపగ్రహాలను ఒకేసారి పంపామని, ఇప్పుడు దానికి రెట్టింపు ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఆ ప్రయోగానికి వేదిక కాబోతోందన్నారు. ఇక ఇండోనేషియాకు చెందిన లపాన్ఏ 3, జర్మనీకి చెందిన బిరోస్, ఎంవీవీ, అమెరికాకు చెందిన స్కైశాట్ జెన్2-1తో పాటు ఇతర ఉపగ్రహాలను పంపుతున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. కాగా, 2013 లో ఒకేసారి 29 ఉపగ్రహాలను పంపిన నాసా ప్రపంచ రికార్డును సృష్టించింది. దేశానికే తలమానికంగా నిలిచిన ఇస్రో గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం.

Read more : మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

1

1

1969లో సరిగ్గా ఇండిపెండెన్స్ డే రోజున ఇస్రో పురుడుపోసుకుంది. దీనికి పురుడుపోసిన వారు విక్రం సారాభాయి.

 

 

2

2

SLV-3 మొట్టమొదటి ఇండియా స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. దీన్ని దివంగత మాజీ రాష్ర్టపతి ఎపిజె అబ్దుల్ కలాం సారధ్యంలో ప్రయోగించారు. కలాం ప్రాజెక్ట్ డైరక్టర్ గా ఉన్నారు.

 

 

3

3

గత నలభై సంవత్సరాల్లో ఇస్రో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.. అది కేవలం నాసా ఒక్క సంవత్సరంలో ఖర్చుపెట్టిన దాంట్లో సగానికి సమానం.

 

 

4

4

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఇస్రో బడ్జెట్ కేవలం 0.34 శాతం మాత్రమే. ఇది స్థూల జాతీయోత్పత్తి లో (జిడిపి) శాతం 0.08 ఉంది.

5

5

భువన్ ను ఇస్రో డెవలప్ చేస్తోంది. ఇది వెబ్ బేస్ డ్ 3డీ శాటిలైట్ పరికరం. ఇది ఇండియా ఇన్ కార్నియేషన్ ను గూగుల్ ఎర్త్ లో చూపిస్తుంది.

 

 

6

6

ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి. ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి.

 

 

7

7

ఇస్రో అత్యంత తక్కుబ బడ్జెట్ తో ప్రయోగాలను నిర్వహిస్తోంది. గతేడాది ఇస్రో టర్నోవర్ 14 బిలియన్ల రూపాయలు

 

 

8

8

ఇస్రో నుంచి మీరు శాటిలైట్ డాటాను కొనుక్కోవచ్చు

 

 

9

9

శాటిలైట్ లాంచ్ టైంలో శాస్ర్తవేత్తలు ఇలా ఆసీనులవుతారు

 

 

10

10

ఆంట్రిక్స్ తో కమర్షియల్ పరంగా ఇస్రో డీల్ కుదుర్చుకుంది. ఇది యూరప్ మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ ఆసియా వరకు విస్తరించి ఉంది.

 

 

11

11

ఆంట్రిక్స్ బోర్డ్ డెరక్టర్ ఎవరో తెలుసా..రతన్ టాటా అలాగే జంషెడ్ గోద్రేజ్.

 

 

12

12

ఇస్రో మార్ష్ మిషన్ అత్యంత తక్కువ ఖర్చుతో నింగిలోకి దూసుకెళ్లింది. దీనికయిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు. అంటే ప్రతి కిలోమీటరకు 12 రూపాయలు

13

13

తొలి ప్రయత్నంలోనే మార్స్ మీదకు విజయవంతంగా చేరగలిగిన దేశాల్లో ఇండియానే ప్రధమస్థానం ఆక్రమించింది.

 

 

14

14

అత్యధిక మంది బ్యాచ్‌లర్స్ ఉన్న సైంటిస్ట్ కేంద్రాలలో ఇస్రోనే ముందుంది.

 

 

15

15

ఇస్రో ఎటువంటి విషయాన్ని కొనదు.. తనకు తానుగా తయారుచేస్తుంది.

 

 

16

16

ప్రపంచవ్యాప్తంగా సిక్స్ స్పేస్ ఏజెన్సీలతో కూడి శాటిలైట్లను సొంతంగా తయారుచేసి నింగిలోకి పంపే వాటిలో ఇస్రోనే ముందుంది.

 

 

17

17

ఇప్పటివరకు 23 శాటిలైట్లను సక్సెస్ పుల్ గా నింగిలోకి ప్రవేశపెట్టింది.

 

 

18

18

ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్లలో 65 శాటిలైట్లు ఇండియావి.అలాగే 29 శాటిలైట్లు విదేశాలవి.

 

 

19

19

ఫన్ పాక్ట్ : ఇది ఇస్రోకి పాత బంధువు. ఇది పాకిస్తాన్ కు చెందిన రీసెర్చ్ సెంటర్

 

 

20

20

1981లో ఆపిల్ శాటిలైట్ ట్రాన్స్ పోర్ట్ ఇలా జరిగింది. ఎడ్ల బండి మీద శాటిలైట్ ను తీసుకువెళ్లారు.

 

 

21

21

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

Best Mobiles in India

English summary
Here Write ISRO to launch record 22 satellites in single mission

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X