సోషల్ మీడియాకే షాక్ పుట్టిస్తున్న కబాలి

Written By:

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే దుమ్ము రేపుతోంది. టీజర్‌తోనే సంచలనాలకు తెరలేపిన ఈ సినిమా ఇప్పుడు సాంగ్ విడుదలతో సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్ ని కొల్లగొడుతోంది. ఎలాంటి అట్టహాసం లేకుండా ఆడియో విడుదల చేసినప్పటికీ ఈ చిత్రంలోని పాటలు మాత్రం యూ ట్యూబ్ నే వణికిస్తున్నాయి. ఈ సినిమాలోని పాట నిరుప్పుదా ఒక్కరోజులోనే 3 కోట్ల వ్యూస్ ని దాటి మిగతా చిత్రాలకు షాక్ పుట్టిస్తోంది.

Read more: గ్రాఫిక్స్ మాయతో జనాల్ని బురిడీ కొట్టించిన సినిమా సీన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

ఇప్పటికే కబాలి టీజర్ 22 మిలియన్లు దాటి యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది. రజనీ చెప్పిన డైలాగ్ అభిమానులనే కాకుండా విమర్శకులను సైతం కట్టిపడేస్తోంది.

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

తమిళంలో 'నిరుప్పుడా' పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్‌ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి.

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో సాంగ్ ఇదే

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

ఎవడ్రా ఆ కబాలి.. రమ్మని చెప్పురా'' అంటే....''కబాలి అంటే తమిళ సినిమాల్లోలాగా బొట్టు పెట్టుకుని.. లుంగీ కట్టుకుని.. కబాలి అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైపనుకున్నావారా..'' అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఓ ట్రెండ్ నే సెట్ చేస్తోంది

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

ఇక మీరెందుకు డాన్ అయ్యారనే దానికి రజినీ తన చిరునవ్వుతో చెప్పిన సమాధానానమే టీజర్ కు హైలెట్ గా నిలిచి యూ ట్యూబ్ లో సంచలనం రేపుతోంది.

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

కబాలి చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. రజనీకాంత్, రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు.

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

సినిమా మొత్తం డాన్ చుట్టూ తిరుగుతుందని సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాణంగా నిలుస్తాయని దర్శకుడితో పాటు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సోషల్ మీడియాకు షాక్ పుట్టిస్తున్న కబాలి

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టీజర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Kabali’ trailer of Rajinikanth received over 22 million views on YouTube
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot