Home
Miscellaneous

LeEco నుంచి సరికొత్త స్మార్ట్ టీవీలు

By Bommu Sivanjaneyulu

గతకొంత కాలంగా ఎటువంటి కొత్త ఆవిష్కరణలు లేకుండా నిశబ్ధంగా ఉన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లీఇకో (LeEco) తన లీన్ అండ్ న్యూ లైనప్ నుంచి ఏకంగా 10 సరికొత్త స్మార్ట్ టీవీ మోడల్స్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉండే ఈ టీవీలు 40 అంగుళాల నుంచి 65 అంగుళాల మధ్య వివిధ సైజుల్లో అందుబాటులో ఉంటాయి.

LeEco launches 10 new Smart TVs in the market

ప్రారంభ మోడల్ ధర 289 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.18550). హై-ఎండ్ మోడల్ ధర రూ.56708 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఈ టీవీలు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో వీటి లాంచింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు వివరాలు వెల్లడి కావల్సి ఉంది.
LeEco launches 10 new Smart TVs in the market

ఈ స్మార్ట్‌టీవీల్లో 1.5GHz క్లాక్ వేగంతో స్పందించే క్వా-కోర్ సిలికాన్ చిప్‌సెట్‌లను లీఇకో పొందుపరిచింది. 16జీబి ఇంటర్నల్ ఫ్లాష్ స్టోరేజ్ ఈ టీవీల్లో ఉంటుంది.

లీఇకో సొంత సాఫ్ట్‌వేర్ అయిన EUI 6.5 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఈ టీవీలు బూట్ అవుతాయి. 4కే సపోర్ట్ ఈ టీవీలకు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. X40L, X43L, X50L, X55L, X65L, X40N, X43N, X50N, X55N, X65N మోడల్స్‌లో ఈ టీవీలు అందుబాటులో ఉంటాయి.

లీ 1ఎస్, లీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన LeEco ఆ తరువాత వెనక్కితిరిగి చూసుకోలేదు. ఈ ఫోన్‌లు ఊహించని సంఖ్యలో అమ్ముడుపోవటంతో లీ1ఎస్ ఇకో, లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌లను లీఇకో మార్కెట్లో లాంచ్ చేసింది.

అంతేకాకుండా, సూపర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో కూడిన ప్రత్యకమైన కంటెంట్ ఇకో సిస్టంను కూడా లీఇకో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ నుంచి పలు స్మార్ట్ టీవీలు కూడా ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

Source

More from GizBot

Best Mobiles in India

English summary
LeEco has announced TV's ranging from 40 - 65 inches and the company claims that the new range has been designed for family use.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X