జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

Written By:

మొబైల్ అత్యంత ప్రమాదకరం అని మనం చాలాసార్లు విన్నాం. అవి పేలిపోయి ఎంతోమంది గాయాలపాలయ్యారు కూడా..కొంతమందైతే ఈ ఫోన్ దెబ్బకు లోకాన్నే వదిలేశారు..అంతలా ఆ ఫోన్ మనల్ని చంపేస్తోంది. అయితే అవి సర్వసాధారణం కావచ్చు..మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటే పేలిపోవడం అనేది సహజం..కాని జేబులో ఫోన్ పెట్టుకుంటే దాన్నుంచి మంటలు వచ్చి అతన్ని కాలిపోయేలా చేయడమనేది చాలా చిత్రమైన విషయం..

Read more: ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

ఇదే ఘటన ఇప్పుడు పాకిస్తాన్‌లో జరిగింది. జేబులో ఫోన్ పెట్టుకుని నడుస్తుండగా ఫోన్ నుంచి మంటలు వచ్చి అతన్ని ఆ మంటలు చుట్టేశాయి. వివరాల్లోకెళ్లితే పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు రోడ్డుపై పరిగెడుతోంటే.. అది చూసిన వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే అక్కడి స్థానిక మార్కెట్‌లోని ఓ వ్యక్తి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

Read more: మాట్లాడుతుండగా ముఖం మీద పేలిన ఫోన్

జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి ఎవరో దీనిని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇలా ఫోన్ వల్ల పెద్ద ప్రమాదాలే ఉన్నాయి..ఓ సారి వాటి గురించి తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

అమెరికా అబ్బాయి ఎరిక్ తన జేబులోని ఫోన్ దెబ్బకు థర్డ్ డిగ్రీ గాయాలతో బయట పడి న్యూయార్కర్ 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

 

 

2

రోజులో గంటపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడే పురుషులు తండ్రులుగా మారాలంటే ఇబ్బందులు తప్పవని పరిశోధకులు చెప్తున్నారు. సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు వీర్యకణాల్ని ఉడికిపోయేలా చేస్తాయని హైఫా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్తా డర్న్‌ఫెల్డ్‌ వివరించారు.

3

మీరు స్మార్ట్ పోన్ ను పక్కలో పెట్టుకోవడం వల్ల అందులోనుంచి వచ్చే వెలుతురు మీకంటిని కాటేసే ప్రమాదం ఉంది.మీకు తెలియకుండానే అది కంటిని కాటేస్తుంది.

 

 

4

స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతే అది నీ నిద్ర చెడగొడుతుంది. మాములుగా 8 గంటలు మనిషి నిద్రపోవాలి. అయితే ఫోన్ పక్కనే ఉంటే నిద్ర అనేది కరవవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వచ్చేఅవకాశం ఉంది.

 

 

5

మీరు ఫోన్ పక్కనే పెట్టుకోవడంలో వల్ల అందులో వీడియోలు చూస్తూ గడిపేస్తారు. టైమ్ గురించి మరచిపోతారు. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

 

 

6

మీరుఏ పనిమీద ఎక్కువగా కాన్సట్రేట్ చేయలేరు. ఒత్తిడి అనుక్షణం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది.

 

 

7

మాటలు రాని వారు అనుకునే ప్రమాదం ఫోన్లు నిరంతరం చూస్తూ ఉండటం వల్ల మీకు మాటలు రావనుకునే ప్రమాదముందని వారంటున్నారు.

 

 

8

మంటల్లో కాలిపోతున్న వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pakistan: Man engulfed in flames after mobile phone battery catches fire in his pocket
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot