సముద్రంలో అంబాని దాచిన రహస్యం ఖరీదు రూ. 12 వేల కోట్లు,

Written By:

జియో అంటూ ఇండియా అంతా ఒక ఊపు ఊపేసిన అంబానీ దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిన మనిషి ప్రపంచంలోనే ఖరీదైన కార్లు,ప్రైవేట్ జెట్స్,షిప్స్ ఒకత రెండా కొత్తగా ఏదైనా వచ్చింది అంటే అది ఆయన ఇంట్లో ఉండాల్సిందే.ఇక ఆయన భార్య వాడే ఫోన్ ఖరీదు అక్షరాలా పాతిక కోట్లు. ఆయన ఉండే ఇంటి ధర ఏకంగా 12000 కోట్లు. మరి ఇప్పుడు ఏకంగా నీటిపైన తేలియాడే భవనాన్ని కొనుగోలు చేశారు. అదెలాగుందంటే..

జియో ఫోన్ రూ. 1500 డిపాజిట్‌పై అదిరిపోయే న్యూస్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షిప్ లాగ తేలుతూ

ఫ్రాన్స్ కి చెందిన ప్రత్యేక షిప్ బిల్డింగ్ కంపెనీ వారు ఈ షిప్ ని నిర్మించారు. షిప్ లాగ తేలుతూ పైన అన్ని హంగులతో కూడి ఉన్న ఈ భవనం ఉంటుంది. ఈ భవనం ముంబై లోని బీచ్ క్యాండీ లో ఉంది.

58 మీటర్ల పొడువు, 38 మీటర్ల వెడల్పు

ఇది 58 మీటర్ల పొడువు, 38 మీటర్ల వెడల్పు ఉంటుందట. దీని మొత్తం వైశాల్యం 36,000 వేల చేదరపు అడుగులు.. ఇందులో 12 మంది ప్రయాణికులకు 20 మంది సిబ్బంది కి సరిపడా సకల ఏర్పాట్లు, సౌకర్యాలూ ఉంటాయ్..

ఇందనం ఆదా కోసం…

ఇందులో గ్రీన్ ఎనర్జీ వాడుతారట. సగం మాత్రమే కరెంటు వాడతారట. ఇందులో సోలార్ ప్యానల్స్ కూడా అమర్చారు.రోజుకి ఇది కనీసం 5000 కిలో వాట్ల విద్యుత్ ని తయారు చేస్తుంది.

గుర్రపు డెక్క ఆకారం లో

ఈ నౌక గుర్రపు డెక్క ఆకారం లో ఉంటుందట. దీనికి గ్లాస్ తో చేసిన సోలార్ ప్యానల్ అమర్చారు. ఇందులో అన్ని రకాల విలాసాలు ఉంటాయ్.

25 మీటర్ల స్విమ్మింగ్ పూల్,

ఇందులో 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, ఒక మసాజ్ రూమ్, ఒక మ్యూజిక్ రూమ్, ఒక పెద్ద డైనింగ్ రూమ్, ఒక థియేటర్, ఒక టెర్రాస్, ఒక లాంజ్ కూడా ఉంటాయి.

డైనింగ్ రూమ్ నుండి

ఒక లిఫ్ట్ కూడా ఉంటుందట. ఇక కింది భాగం లో లాంచ్ పియానో బార్, ఒక డైనింగ్ ఏరియా ఉంటాయి. డైనింగ్ రూమ్ నుండి సముద్రం అందంగా కనిపిస్తుందట.

అతిథుల కోసం

ఇక అతిథుల కోసం కింది బాగం లో 5 ప్రతేక రూములు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక లాంచ్ రీడింగ్ రూమ్ కూడా ఉందండోయ్. ఈ లాంచ్ దీనికి ఇంకొక ప్రత్యేకత.

పైన హెలిపాడ్

అలాగే పైన హెలిపాడ్ కూడా ఉంది.షిప్ పై భాగం లో అంతా సోలార్ పానల్స్ ఫిక్స్ చేసి ఉండటం వాళ్ళ చాల వరకు ఇంధనాన్ని అవే సరఫరా చేస్తాయి.

2౦ మంది సిబ్బంది ఉండటానికి సరిపోయే ప్లేస్

కిందకు పైకి దిగడానికి లిఫ్ట్,పెద్ద డైనింగ్ రూమ్ అలాగే 12 మంది ప్రయాణీకులు 2౦ మంది సిబ్బంది ఉండటానికి సరిపోయే ప్లేస్ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mukesh Ambani Purchase Water Floating House Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot