ఇంటర్నెట్‌ను ఊపేసిన గాలి వార్తలు!

|

ఇంటర్నెట్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు ఆకతాయలు ఈ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అమాయక నెటిజనులను కలవరపాటుకు గురి చేస్తూ పలు అసత్య ప్రచారాలతో ఫోటోషాప్ టూల్ ద్వారా ఎడిట్ చేయబడిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ఉచిత ఆన్‌లైన్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించిన మోదీ సర్కార్

రూమర్ 1

రూమర్ 1

కేరళలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని కొండచిలువ మింగేసిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్ చేసింది. ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈ ఫోటోషాప్ టూల్ ద్వారా ఈ ఫోటోను ఎడిట్ చేసి ఉండొచ్చు.

రూమర్ 2

రూమర్ 2

కాంటాక్ట్ లెన్స్‌లు వేడికి కరిగి పోతున్నాయంటూ నిరాధారమైన వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి.

రూమర్ 3

రూమర్ 3

భారత జాతియ గీతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతియ గీతంగా యునెస్కో ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదు.

రూమర్ 4

రూమర్ 4

ఐఫోన్ 6 ఫోన్‌లు ఎబోలా వైరస్‌కు గురయ్యాయంటూ ఇటీవల పలు రూమర్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైద్యుులు కొట్టిపారేసారు.

రూమర్ 5

రూమర్ 5

11/11/11న 11 మంది పిల్లలకు గుజరాత్‌లో ఓ తల్లి జన్మనిచ్చిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదు.

రూమర్ 6

రూమర్ 6

8 తలల పామంటూ సోషల్ మీడియాలో హల్ చేస్తున్న మార్ఫింగ్ ఫోటో. కొంత మంది ఈ ఫోటోను నిజమని భ్రమపడుతున్నారు.

రూమర్ 7

రూమర్ 7

దీపావళి కాంతుల్లో భారత్ వెలిగిపోతుందంటూ ఇటీవల కాలంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్కిలేట్ అవుతోంది. వాస్తవానికి ఈ ఫోటో దీపావళి సంబరాలుది కాదు. 1992-2003 మధ్య భారత జనాభాను విశ్లేషిస్తూ నాసా ఈ ఫోటోను విడుదల చేసింది.

రూమర్ 8

రూమర్ 8

ఇది ఏలియన్ తాలుకా ఆస్తిపంజర మంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి..

Best Mobiles in India

English summary
Mysterious internet hoaxes that went viral on social media. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X