సైన్స్‌కు, టెక్నాలజీకి సవాల్ విసురుతున్న మిస్టరీలు

Written By:

ప్రపంచంలోని చాలా విషయాలు అలాగే వాటి వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు లాగానే ఉన్నాయి. వీటి లాజిక్ ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలా మారి శాస్ర్తవేత్తలను ముప్ప తిప్పలు పెడుతోంది. వీటి వెనుక లాజిక్ ను ఇప్పటిదాకా సైన్స్ కూడా చేధించలేకపోయిందంటే వాటి రహస్యం ఎంత మిస్టరీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మిస్టరీ ప్రదేశాలను మీకు అందిస్తున్నాం మీరైనా కనిపెట్టండి సాధ్యమువుతుందేమో..

Read more : జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూఢ పర్వతాలు (Superstition Mountains)

1

ఈ పర్వతాల్లో భారీ సంపద దాగి ఉందని నమ్ముతారు. అందుకే దీన్ని గోల్డ్ మైన్ గా కూడా పిలుస్తుంటారు. 1800 సంవత్సరంలో జాకబ్ వాల్ట్జ్ అనే వ్యక్తి ఈ పర్వతాల్లో భారీ సంపద దాగి ఉందని రహస్యాన్ని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు కాని దాని కోసం చాలామంది తమ ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇప్పటకీ ఇది ఓ పెద్ద మిస్టరీ..

అసాధారణం ఈ ప్లేస్ (South Atlantic Anomaly)

2

ఇది బ్రెజిల్ లోకి కోస్టల్ ఏరియా ప్రాంతం. ఇక్కడ వాతావరణానికి సంబంధించిన నంబర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. శాటిలైట్లకు. స్పేస్ క్రాప్ట్ లకు అంతుచిక్కని మిస్టరీలా ఈ నంబర్స్ ఉన్నాయి. ఒక్కో సారి శాటిలైట్లు ఈ నంబర్ల దెబ్బకి షట్ డౌన్ కూడా అయిపోతూ ఉంటాయి. ఏలియన్స్ అక్కడ ఉన్నాయని చాలామంది చెబుతుంటారు.

అంజికుని సరస్సు (Lake Anjikuni)

3

ఇక్కడ రాత్రికి రాత్రే విలేజ్ లు మాయమవుతుంటాయి. 1930 నుంచి జరుగుతూ వస్తోంది. జో లాబెల్లీ అనే అతను రాత్రి బస కోసం విలేజ్ లో ఉంటే తెల్లారేసరికి అది మాయమైపోయింది. రాత్రి కనువిందుచేసిన జనాబా తెల్లారేసరికి మాయమ్యారు. అక్కడ అంతా ఎడారిలా మారింది. ఇప్పటికీ అది అంతుచిక్కడం లేదు.

డెవిల్స్‌ ట్రయాంగిల్‌'( The Devil’s Sea)

4

వాయువ్య అట్లాటింక్‌ మహాసముద్రప్రాంతంలో గల ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ ప్రదేశం ఒక మిస్టరీ. దీన్ని 'డెవిల్స్‌ ట్రయాంగిల్‌' అని పిలుస్తారు. గాలిలో ప్రయాణించే విమానాలు, ఆ ప్రదేశంలో ప్రయాణించే నౌకలు అదృశ్యమైపోతున్నాయి. ఈ ప్రదేశం వెనుక ఎన్నో కధలు ఉన్నాయని చెపుతున్నా, దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం చేధించలేకపోయారు. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వలన ఇలా సంభవిస్తున్నాయని కొందరు చెబుతున్నారు.

బిజీలో రాంచ్ (Bigelow Ranch)

5

నార్త్ వెస్ట్ లోని ఉఠాలో ఇది దాదాపు 480 ఎకరాల్ల విస్తరించిం ఉంది. ఇక్కడ ఉన్న ఆస్తులు ప్రదేశాలు వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఒకచోట ఉన్న ప్రదేశం మళ్లీ చూసేసరికి అక్కడ ఉండదు..చాలామంది ఈ ప్రదేశాలను చూసి షాక్ కూడా అయ్యారు. ఇక్కడ యుఎఫ్ఓలు ఉన్నారని చాలామంది విశ్వసిస్తారు. నిజమో కాదో తెలియదు.

పాయింట్ ప్లీజెంట్ ( Point Pleasant)

6

ఇక్కడ ఓ జీవి అత్యంత భయకంరంగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు. దీన్ని 1966- 67 మధ్య ప్రాంతంలో చాలామంది చూశామని చెబుతారు.అది 10 అడుగుల పొడవుతో ఎర్రని కళ్లతో , పెద్ద పెద్ద రెక్కలతో చూస్తేనే హడలెత్తిపోయే విధంగా ఉందని చూసినవారు చెబుతున్నారు. అది ఏమిటనేది ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇక దాని గురించి సెర్చ్ చేసిన వారు అక్కడికెళితే పైకెళ్లిపోవాల్సిందేనట.

మిచిగాన్ ట్రయాగింల్ ( Michigan Triangle)

7

మిచిగాన్ లో ఉన్న ఈ ట్రయాగింల్ కూడా పెద్ద మిస్టరీనే. ఇది ఒక సరస్సు..ఈ సరస్సుపైన పోయిన విమానాలు మిస్టరీగా మారిపోతాయి. ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. నార్త్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ప్లైట్ 2501 ఇప్పటికీ కూడా ఆచూకి చిక్కలేదు. అది ఎమైపోయిందో కూడా తెలియదు.

శాన్ లూస్ వాల్లీ ( San Luis Valley)

8

కొలరాడోలో ఉన్న ప్రాంతం. ఇక్కడ యుఎప్ ఓలు గాల్లో చక్కర్లు కొట్టినట్లుగా కనిపిస్తాయి. వందల యుఎఫ్ఓలు ఇక్కడ గాల్లో ఎగురుతూ ఉన్నట్లు ఉంటాయి. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే మిస్టరీని ఇప్పటికీ ఎవరూ చేధించలేకపోయారు.

బెన్నిగాటన్ ట్రియాంగిల్ (Bennington Triangle)

9

ఈ ప్రదేశానికి విహారయాత్రకు పోయిన వారు ఇప్పటివరకు తిరిగివచ్చిన వారే లేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి జాడ కనడపలేదు. ఎంతో మంది దీన్ని చేధించాలని వెళ్లి మాయమైపోయారు.

బ్రిడ్జివాటర్ ట్రియాంగిల్ ( Bridgewater Triangle)

10

సౌత్ బోస్టన్ లో మసాచుసెట్స్ దగ్గర 200 స్క్వాయిర్ల మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ జంతువులు అతి భయకంరంగా పోట్లాడుకుంటూ ఉంటాయి. వాటి పోట్లాట అరుపులు ఇప్పటికీ భయంకరంగా కనిపిస్తాయి అందరికీ. జంతువులు చిత్ర విచిత్రమైన ఆకారాలతో ఎర్రని నిప్పు కణికలతో అక్కడ కనిపిస్తాయట. మరి అలా ఎందుకు ఉన్నాయనేది ఇప్పటికీ మిస్టరీనే..

బ్లడ్ ఫాల్స్ ( Blood Falls, Antarctica)

10

ఇక్కడ ఓ ప్రాంతం నుంచే ఎర్రగా రక్తం వస్తోందట. మిగతా చోట్ల అంత తెల్లగా ఉన్న ఓ చోట నుంచి మాత్రం ఇలా ఎర్రగా వస్తూ ఉంటుంది. అదేమిటనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.

కుతుబ్ మినార్ పిల్లర్ ( iron pillar)

11

కుతుబ్‌ మినార్‌ సమీపంలో ఈ ఐరన్‌ పిల్లర్‌ ఉంటుంది. చాలా కాలం నుండి ఇది తుప్పు పట్టకుండా ఉంది. సుమారు 1600 సంవత్సరాల నుండి తుప్పు పట్టలేదు. దాంతో ఈ ఐరన్‌ పిల్లర్‌కి అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవారు. గంధకం ఎక్కువగా ఉన్న ఇనుముమీద ఏర్పడిన ఐరన్‌ హైడ్రోన్‌ ఫాస్పేట్‌ కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అందువల్లే ఈ పిల్లర్‌ తుప్పుపట్టలేదట.

ది బ్లప్‌ ( The Bloop)

12

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 5000 కిలో మీటర్ల దూరం పరిధిలో పెద్ద శబ్దాలు వినపడడంతో అదేదో పెద్ద జంతువు అని అనుకున్నారు. అక్కడ రెండు వేర్వేరు చోట్ల తక్కువ పౌనఃపున్యంతో ధ్వని చేస్తూ, మళ్ళీ పెద్దగా శబ్ధం వస్తూ ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే ఒక పెద్ద మంచు భూకంపం చోటుచేసుకోవడం వల్ల మంచు విరిగిపోయి ముక్కలు, ముక్కలుగా పడిపోవడం వల్ల ఆధ్వనులు వస్తున్నట్లు రహస్యాన్ని చేధించారు. రెండు వైపుల నుండి ఇలాంటివి ఒకేసారి చోటు చేసుకోవడం వల్ల 5000 కిలో మీటర్ల పరిధి వరకు ఆధ్వనులు వినిపిస్తున్నాయనమాట.

హోమర్స్‌ ఒడెస్సీ ( homer odyssey)

14

ఈ ఎడిషన్‌ మార్జిన్‌ లో నోట్స్‌ చాలా కాలం పాటు ఉండడంతో ప్రజలు దీని వెనుక ఏదో కారణం ఉందని నమ్మేవారు. దానిలో ఏదో మెసేజ్ ఇంకా ఏదో క్లూ ఉందని అందరూ భావించేవారు. అసలు విషయం ఏమిటంటే ప్రాచీన ప్రెంచ్‌ సంక్లిప్త పుస్తకంలో ఆ నోట్స్‌ రాతలు ఉన్నాయని దానికి ప్రత్యేకకారణం ఏమీలేదని చెప్తున్నారు పరిశోదకులు.

రహస్యాల చోటు ( secret place )

15

అయస్కాంత క్షేత్రాలలోకి వెళ్లినట్లయితే మానవులు, వస్తువులు పడిపోతుంటాయి. దాంతో అందరూ ఏదో కారణాలు చెప్పుకుంటుండేవారు. అసలు రహస్య మేమిటంటే మీరు ఉన్న చోటులో తిరుగుతూ ఉండడం వలన ఇరవై డిగ్రీలకు వంగి ఉంటారు. అదే విధంగా ఇక్కడ హారిజన్‌ పాయింట్‌ ఎక్కడ అనే విషయం మీరు తెలియజేయలేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mysterious places Like Bermuda Triangle where Technology also failed
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot