మనిషి మరణాన్ని ఈ టెక్నాలజీ ముందుగానే పసిగట్టేస్తుంది!

Posted By: BOMMU SIVANJANEYULU

ఈ భూప్రపంచం పై మనుగడ సాగించే ప్రతి జీవికి మరణం అనేది అనివార్యం. మనుషులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేనప్పటికి ఇది నగ్న సత్యం. మృత్యవు అనేది ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో సంభవిస్తుందనేదాన్ని ఎవ్వరం ఊహించలేం. చనిపోయిన మనిషిని తిరికి బతికించుకునే మార్గాల పై ఇప్పటికే తమ ప్రమత్నాలను ముమ్మరం చేసిన శాస్తవ్రేత్తలు ఆదిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మరో సంచలనం..

మనిషి ఆరోగ్యస్థితిగతులను బట్టి వాటి మరణాన్ని అంచనావేసే క్రమంలో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలాయానికి చెందిన రిసెర్చర్ల బృందం ఓ ప్రత్యేైకమైన ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించగలిగే ఈ టెక్నాలజీ, ప్రస్తుత ఆరోగ్య స్థితిని బట్టి ఎంత కాలం జీవిస్తారన్నదాని పై ఖచ్చితమైన సమాచారాన్ని వెల్లడించగలుగుతుంది. చివరిదశకు చేరుకుని తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతోన్న వారిని ట్రీట్ చేసేందుకు ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

1,60,000 పేషెంట్ల పై విస్తృత పరివోధనలు..

త్వరలోనే ప్రముఖ ఆస్పత్రులలో ఈ టెక్నాలజీని లాంచ్ చేయబోతున్నారు. 90 శాతం ఖచ్చితమైన రిజల్ట్స్‌ను ఈ ప్రోగ్రామ్ ఇవ్వగలగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏఐ ఆధారిత ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితమైన రీడింగ్‌ను రాబట్టే క్రమంలో స్టాన్ఫోర్డ్ అలానే లూసిలే ప్యాకర్డ్ చిల్డ్రన్స్ హాస్పటల్స్‌కు చెందిన 1,60,000 పేషెంట్లకు సంబంధించిన హెల్త్ రికార్డులను రిసెర్చర్ల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది.

90 శాతం ఖచ్చితమైన రిజల్ట్స్...

ఈ రోగులకు సంబంధించి గతంలో జరిగిన రోగ నిర్థారణలు, ప్రాసీజర్స్ అలానే చికిత్సా విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత రిసెర్చర్ల బృందం ఓ అంచనా వచ్చి, తాము అభివృద్ధి చేసిన అల్గారిథమ్‌ను ఈ డేటాతో అటాచ్ చేయటం జరిగింది. తొలత ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెడల్‌ను 40,000 మంది యాక్టివ్ పేషంట్లలో ఇంప్లిమెంట్ చేసి చూడగా, వారిలో 3 నుంచి 12 నెలలలోపు చనిపోయేవారి వివరాలను ప్రోగ్రామ్ ముందగానే సూచించింది.

ప్రోగ్రామ్ సూచించినట్లగానే 90శాతం కేసుల్లో అది రుజువవటంతో రిసెర్చర్లు సైతం షాక్ అయ్యారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ ను అన్ని ప్రముఖ ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయలయానికి చెందిన ప్రముఖ రిసెర్చర్ ఆనంద్ అవతి తెలిపారు.

చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ వస్తోందా..?

మనిషి చనిపోయాక అతని శరీరంలో ఏం జరుగుతుంది? చనిపోయిన మనిషిని బతికించటం సాధ్యమేనా? ఆ దిశగా పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా అంటే అవుననే సమధానం చెప్పాలి. మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలో జన్యువులు రెండు నుంచి నాలుగురోజుల పాటు బతికే ఉంటాయని వీటి ద్వారా ఆయువుపోసే మార్గాలను వెతకొచ్చని నిపుణలు భావిస్తన్నారు.

ఆ ఫోన్లను సవాల్ చేస్తూ నోకియా 9 వచ్చేస్తోంది..

మనిషి చనిపోయినా జన్యువులు మాత్రం బతికే ఉంటాయి?

మనిషి చనిపోయాక కూడా అతని శరీరంలోని కొన్ని జన్యువులు బతికే ఉంటాయని, మనిషి చనిపోయిన తర్వాతనే అవి క్రియాశీలకంగా మారుతాయని నేటి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఎలుకలు, జీబ్రా చేప, మరికొన్ని జంతువులపై జరిపిన పరిశోధనలే కారణం.

వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రెండు ల్యాబుల్లో ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ అద్భుత విషయాలను కనుగొన్నారు. రకరకాల జంతువుల్లో 1063 జన్యువులు శరీరానికి ప్రాణం ఉన్నంతకాలం స్తబ్దుగా ఉంటాయని, చనిపోయిన తర్వాత అవి క్రియాశీలకంగా మారుతాయని వారి పరిశోధనల్లో తేల్చారు.

మనుషుల్లోనూ ఇదే ప్రక్రియ కనసాగే అవకాశం..?

జంతువుల్లో ఇలా ఉందంటే మానవుల్లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇలా జన్యువులు క్రియాశీలంగా మారడం వల్లన చనిపోయిన మనిషిని బతికించలేకపోయినా, పాడై పోయిన అవయవాన్ని మార్పిడి చేసేందుకు కావాల్సినంత సమయం దొరుకుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A new artificial intelligence can tell when you are going to die and it has come out to be accurate with a very high rate.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot