కచ్చితంగా పంట నష్టం అంచనా, తెలంగాణ సర్కార్ చేతిలో వినూత్న టెక్నాలజీ

|

పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయగలిగే వినూత్న టెక్నాలజీని తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. దేశీయంగా తొలిసారిగా అమల్లోకి రాబోతోన్న ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 15 రోజులు, అంతకంటే తక్కువ సమయంలోపే పంట నష్టాన్ని అంచనా వేసే వీలుంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే భీమా కంపెనీలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌లో రైతులకు పరిహారాన్ని చెల్లించే వీలుంటుంది.

టెక్నాలజీతో రైతులకు మరింత లబ్థి...

టెక్నాలజీతో రైతులకు మరింత లబ్థి...

గతంలో ఈ ప్రాసెస్ జరగాలంటే స్థానిక అధికారులే వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయాల్సి వచ్చేది. ఈ తతంగం మొత్తం పూర్తవటానికి నెలల తరబడి సమయం తీసుకునేది. ఈ మధ్యలో చోటుచేసుకునే జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కార్ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

డ్రోన్ల సహాయంలో పర్యవేక్షణ

డ్రోన్ల సహాయంలో పర్యవేక్షణ

తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ టెక్నాలజీని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించి చూసిింది. ఈ క్షేత్రంలో రబీ సీజన్‌లో చోటు చేసుకన్న పంట నష్టాన్ని డ్రోన్ల సమాయంతో అంచనా వేయగలిగారు. బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ తన సొంత ఖర్చులతో వ్యవసాయ శాఖకు ఈ టెక్నాలజీని పరీక్షించి చూపించింది.

పరిశోధనల నిమిత్తం 66 ఎకరాల సాగు భూమి..

పరిశోధనల నిమిత్తం 66 ఎకరాల సాగు భూమి..

ఈ ప్రయోగానికి కందుకూరు మండలంలోని నిడునురు గ్రామం వేదికగా నిలిచింది. ఈ గ్రామంలో 20 మంది రైతులకు చెందిన 66 ఏకరాల సాగు భూమిని పరిశోధనల నిమిత్తం వినియోగించుకున్నట్లు వ్యవసాయ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కూరగాయలు, పువ్వులుతో పాటు ఇతర ఆహార పంటలు పుష్కలంగా పండేందుకు ఈ నేల మరింత అనువుగా ఉందని ఆయన తెలిపారు.

రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !రెండు రూపాయలకే 1 జిబి డేటా, సంచలనాలే ఇక !

త్వరలో తెలంగాణ అంతటా అమల్లోకి..

త్వరలో తెలంగాణ అంతటా అమల్లోకి..

అత్యాధునిక టెక్నాలజీ, పొలాల్లో సాగవుతోన్న ఉన్న కాకరకాయి, వంకాయి, బీన్స్, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, గులాబీ, మామిడ, పత్తి, వరి, మొక్కజొన్న, గోదుమ, బెంగాల్ గ్రామ్ పంటకు సంబందించిన పంట(స్టాండింగ్ క్రాప్)లను క్యాప్చుర్ చేసింది.

పంట దిగుబడి, ధాన్యం రంగు మారటం, చీడపరుగుల బారినపడి పంట దెబ్బతినటం వంటి వివరాలను ఎప్పటికప్పడు ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఈ నూతన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాంటే గ్రామాల వారి భూముల వివరాలు, వాటి సారం, విస్తీర్ణం, నీటి లభ్యత, రైతుల సమాచారం వంటి వివరాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Telangana Government is planning to take the help of technology, perhaps for the first time in the country, in estimating crop loss for the purpose of settlement of insurance claims in a transparent and swift manner.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X