Home
Miscellaneous

షాకింగ్: ఉత్తర కొరియాలో సోషల్ మీడియా అవుట్

By Hazarath

ఆ దేశాధినేత నోరు విప్పితే అమెరికాను నాశనం చేస్తామనే మాటలు అలాగే దక్షిణ కొరియాను బూడిద చేస్తామనే ప్రకటను..ఇంతకీ ఆ దేశాధినేత ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అతనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇప్పడే ఆ రెండు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ముందుగా ఆ దేశ వెబ్‌సైట్లపై కన్నేశాడు. అమెరికాకు చెందిన వాయిస్ ఆఫ్ అమెరికా అలాగే ఇంకా మరికొన్ని వెబ్‌సైట్లు అక్కడ బ్యాన్ చేశారు. వీటితో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను అలాగే తమ శత్రుదేశమైన దక్షిణ కొరియా వెబ్‌సైట్లను కూడా నిషేధిస్తున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. కొంత కాలం వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సైట్లను నిషేధిస్తున్నామని, అక్రమంగా ఉపయోగించే ప్రయత్నం చేయొద్దని ఉత్తర కొరియా పేర్కొంది. ఒకవేళ అలా ఉయోగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అధ్యక్షుడు కిమ్ జాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే సోషల్ మీడియాపై నియంత్రణ విధించిన దేశాలేంటో ఓ సారి చూద్దాం.

Read more:కలా.. నిజమా : బద్ధ శత్రువులు ఇలా సెల్ఫీలతో..

1

1

ప్రపంచం మొత్తం 5జీ నెట్ వర్క్ వెంట పడుతుంటే ఇక్కడ 3జీ నెట్ వాడుతుంటారు. అదీ ఫారిన్ నుంచి వచ్చే టూరిస్ట్‌లకు లిమిట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ దేశానికి ప్రపంచం గురించి తెలియదు. ఈ దేశ ప్రజలు ఇంటర్నెట్ పెద్దగా వాడరు. అసలు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కేవలం చాలా తక్కువ చోట్ల ఉంటుంది.ఇక ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ ఫేస్‌బుక్ పేజీని అసలు చూడలేము.

 

 

2

2

ఇరాన్ లో ఈ సైట్ ను బంద్ చేయాలని రాజకీయ నాయకులంతా పార్లమెంట్ లో తీర్మానించుకున్నారు. వీటివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందుకే బంద్ చేయాలని 2009లో పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాను అక్కడ బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు హసన్ రోహాని ట్విట్టర్ లో ఉన్నా కాని లేనట్లే ఉంటారు.

3

3

మన పొరుగుదేశం చైనా గురించి ఇక చెప్పనే అవసరం లేదు. ఆ దేశం అన్నీ సోషల్ మీడియాను బంద్ చేసి సొంతంగా సోషల్ మీడియాను రూపొందించుకునే పనిలో బిజీగా ఉంది.

 

 

4

4

ఇక్కడ జనాభాకు వచ్చే దానిలో బతికేదే చాలా కష్టం. అందుకని వీరు ఎటువంటి సోషల్ మీడియా జోలికి వెళ్లరు. ఇక్కడ నెట్ వాడకానికి చట్టపరంగా అనేక సమస్యలు ఉండటంతో వాటి జోలికి వెళ్లే సాహసం చేయరు. అక్కడ గంటకు దాదాపు 6 నుంచి 10 డాలర్లు నెట్ బిల్లు ఉంటుంది. వారికి నెలకి వచ్చేది 20 డాలర్లు.అందుకోసం వారు వాటిజోలికి వెళ్లరు.

 

 

5

5

బంగ్లాదేశ్ 2010లో ఫేస్‌బుక్‌ని బంద్ చేసింది. తమ దేశాధ్యక్షుడికి చెందిన కార్టూన్ ఫేస్‌బుక్‌లో సైటైరికల్ గా వాడటంతో వారంతా ఈ సైట్ ను బంద్ చేయాలని తీర్మానించారు. అయితే బంద్ అయిన వారం రోజులకు ఫేస్‌బుక్ ఆ ఇమేజ్‌ని తొలగించింది. అయినా నిషేధం అలానే కొనసాగుతోంది.

 

 

6

6

2011లో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కొన్ని సోషల్ మీడియా సైట్లను బంద్ చేయాలని నిర్ణయించింది. వాటిల్లో ఈ ఫేస్‌బుక్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యమం జరుగుతన్న సమయంలో ఉద్యమకారులు ఎక్కువగా ఫేస్‌బుక్ వినియోగిస్తుండటంతో ముబారక్ సోషల్ మీడియాను బంద్ చేయాలని తీర్మానించారు.

 

 

7

7

సిరియాలో 2007 నుంచి ఫేస్‌బుక్ బ్లాక్ అయింది. రాజకీయంగా బసద్ ఆలీకి వ్యతిరేకంగా ఉద్యమకారులు చెలరేగిపోవడం..ఆయన్ని గద్దె దింపాలని కొత్త ఉద్యమం లేవదీయడంతో చిర్రెత్తుకొచ్చిన బసద్ అన్ని సోషల్ మీడియా సైట్లకు రాంరాం చెప్పారు. అయినప్పటికీ సిరియన్లు కొన్ని ప్రొక్సీ సర్వర్ల ద్వారా కొన్ని సోషల్ మీడియా సైట్లను వాడుతున్నారు.

 

 

8

8

ఫేస్‌బుక్ సెలబ్రిటీలకు సంబంధించి అనేక ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఈ కోవలోనే ఈ దేశాధ్యక్షుని పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి అనేక సమస్యలకు కారణమ్యారు. దీంతో ఆ దేశంలో ఫేస్‌బుక్ కి రారాం చెప్పారు. అయితే అది కొద్ది రోజుల మాత్రమే కొనసాగింది. ఇప్పుడు మళ్లీ అక్కడ సోషల్ మీడియాని ప్రవేశపెట్టారు.

 

 

9

9

ఆన్లైన్‌లో పాకిస్తాన్‌పై కార్టూన్లతో విమర్శలు గుప్పించడం అలాగే ప్రభుత్వం 2010లో సోషల్ మీడియాను బంద్ చేసింది. ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాను గాలికొదిలేసింది. ఇప్పటికీ అక్కడ కొన్ని సైట్లపై నిషేధం కొనసాగుతోంది.

 

 

10

10

ఈ దేశంలో 2009 నుంచి సోషల్ మీడియా సైట్లకు రాంరాం చెప్పారు. ఆ తరువాత పరిమితులతో కూడిన సోషల్ మీడియా సైట్లను ప్రవేశపెట్టారు.

 

 

Best Mobiles in India

English summary
Here Write North Korea Announces Ban on Facebook, YouTube, and Twitter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X