మంటల్లో కాలిపోతున్న అమెరికా: సంచలనం రేపుతున్న వీడియో

Written By:

అమెరికా ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అమెరికా పేరెత్తితే ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది..అయితే ఇప్పుడు ఏకంగా అమెరికా కాచుకో నీ వాషింగ్టన్ నేలమట్టమవుతోంది ఓ సారి చూడంటూ ఉత్తర కొరియా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అది ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చి సంచలనం రేపుతోంది.. మరి నిజంగానే అమెరికాపై ఉత్తరకొరియా యుధ్దానికి దిగనుందా.. అసలు ఆ వీడియోలో ఏముంది. ఓస్మార్ట్ లుక్కేద్దాం.

Read more:ఆ ఫోన్ మిస్టరీ వెనుక రహస్యం ఏమిటీ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై అణుబాంబుతో దాడిచేసినట్లు ఉత్తరకొరియా విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. దక్షిణకొరియా-అమెరికా భారీ సైనిక విన్యాసాలతో రగిలిపోతున్న ఉత్తరకొరియా ... తమపై చిన్నపాటి దాడి జరిగినా వినాశనమే అంటూ మళ్లీ వీడియోతో హెచ్చరించింది.

2

సబ్మెరైన్ నుంచి ప్రయోగించిన అణుబాంబు క్షిపణి మేఘాల గుండా ప్రయాణిస్తూ వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్ ముందు పడుతుంది. భవనం అగ్నికి ఆహుతవుతుండగా తెరపై ఒక హెచ్చరిక ప్రత్యక్షమవుతుంది.

3

ఉత్తరకొరియా వైపు అంగుళం ముందుకొచ్చినా అణుబాంబులతో విరుచుకుపడతామంటూ కొరియా భాషలో కిమ్ జోంగ్ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. జలాంతర్గామి నుంచి ఆ అణు మిసైల్ను వదిలింది. లింకన్ మెమోరియల్ ముందు జారిపడ్డ క్షిపణి వల్ల ఆ నగరమంతా బూడిదైంది.

4

ఆ మంటల్లో అగ్రరాజ్యం అమెరికా జాతీయ జెండా మాడిమసైంది. ఉత్తర కొరియా తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో ఇది క్లెమాక్స్ సీన్. లాస్ట్ ఛాన్స్ 'టైటిల్తో ఉత్తర కొరియా తన అధికారిక సైట్లో ఇవాళ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో అమెరికాను ఈసారి ఉత్తర కొరియా వెరైటీగా హెచ్చరించింది.

5

అమెరికా సామ్రాజ్యవాదులు మాతో పెట్టుకుంటే .. మేం వెంటనే అణు బాంబులతో దాడి చేస్తామంటూ ఆ వీడియో చివర్లో ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అంతేకాదు అగ్రరాజ్యంతో గత కొన్ని దశాబ్ధాలుగా ఉన్న వైరాన్ని ఓ సిరీస్ గా ఆ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఇది మొత్తం నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది.

6

అణు దాడులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో తాజా వీడియో మరో సంచలనంగా మారింది.

16

అమెరికా మంటల్లో కాలిపోతున్న వీడియో ఇదే.. 

7

ఇక దక్షిణ కొరియాపై కూడా అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. తమపై దాడికి దక్షిణ కొరియా కుట్రపన్నుతోందని, క్షమాపణ చెప్పకపోతే ఆ దేశ అధ్యక్ష భవనాన్ని పేల్చివేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

2

దక్షిణ కొరియా అధ్యక్షుడు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆఖరి అవకాశం పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఒక్క మీట నొక్కితే దక్షిణ కొరియా రాజధాని సియోల్ ధ్వంసమవుతోందని హెచ్చరించింది.

9

అయితే ఉత్తర కొరియా ముందు జాగ్రత్తగా బహుళ అణు రాకెట్లను ప్రయోగించగల వ్యవస్థను తయారు చేసుకుంది. దీనిని పరీక్షించడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆదేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది.

10

కొత్తగా లార్జ్ మల్టీ రాకెట్ లాంచర్ ను తయారు చేసిన శాస్ర్తవేత్తలు, అధికారులను ఉన్ పోగడ్తలతో ముంచెత్తారని ప్రకటించింది. దీనిని వెంటనే పరిక్షించి చూడాలని కూడ ఉన్ శాస్ర్తవేత్తలకు సూచించారని వెల్లడించింది.

11

కొరియా సైన్యం, ప్రజలు వ్యూహాత్మక బలాన్నికలిగి శత్రువులను ఎప్పుడంటే అప్పుడు డీకొనే స్థాయిలో ఉండేందుకు రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆర్మీ అధికారులు తెలిపారని కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియాతో పాటు అమెరికా సీరియస్ గా తీసుకున్నాయి.

12

అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన కఠిన ఆంక్షలను సైతం లెక్క చేయని ఉత్తర కొరియా.. కొన్ని రోజుల క్రితం బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన‌ట్లు కూడా తెలిపింది.

13

800 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంగల బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించిన‌ట్లు, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు ఉత్తర దిశలో ఈ ప్రయోగం జరిగినట్టు, మిసైల్ లక్ష్యాన్ని ఛేదించినట్టు ఆ దేశం పేర్కొన్న‌ విష‌యం తెలిసిందే.

14

మరి ముందు ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది. నార్త్ కొరియా దుస్సాహసానికి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో అన్నది అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోంది.

15

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write North Korea depicts nuclear attack on Washington, new video revealed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot