ఈ సారి దక్షిణ కొరియా నేలమట్టమయింది

Written By:

ఈ మధ్య అమెరికాను ఒకే ఒక్క బటన్ తో బూడిద చేస్తామంటూ వీడియోని రిలీజ్ చేసిన నార్త్ కొరియా కన్ను ఇప్పుడు పక్కనే ఉన్న దక్షిణ కొరియాపై పడింది. తాము తలుచుకుంటే దక్షిణ కొరియాను ఏకకాలంలో భస్మం చేస్తామంటూ బెదిరిస్తున్న వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఎంత భయకంరంగా ఉందంటే ఒకే సారి వందల సంఖ్యలో క్షిపణులు దక్షిణ కొరియాలోని భవనాలన్నింటినీ నామరూపాల్లేకుండా నేలమట్టం చేస్తున్నట్లుగా ఉంది. షాక్ కొడుతున్న ఈ వీడియో ఆంతర్యం ఏమిటో మీరే చూడండి.

Read more: మంటల్లో కాలిపోతున్న అమెరికా: సంచలనం రేపుతున్న వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

జనవరి 6 న అణుపరీక్ష నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి దక్షిణ కొరియా, మరోపక్క వాషింగ్టన్ పరోక్షంగా ఉత్తర కొరియాను హెచ్చరిస్తూనే ఉన్నాయి.

2

ఎవరేమి చెబితే నాకేంటని ఆ దేశాల హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ముందుకు వెళుతోంది. తాజాగా వాటిని రెచ్చగొట్టేలాగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ఎక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ వీడియో ఎంతో భయాన్ని గొలిపే విధంగా ఉంది.

3

ఉత్తర కొరియా సైనికులంతా కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతానికి వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా చేరగా .. క్షిపణులన్నింటిని దక్షిణ కొరియావైపు లక్ష్యంగా పెట్టారు. ముఖ్యంగా సియోల్‌ను టార్గెట్ చేశారు.

4

అంతా సిద్ధమై ఉండగానే సైనిక ప్రధాన అధికారి ఫైర్ అంటూ సిగ్నల్ ఇవ్వగానే ఏక కాలంలో వందల ఫిరంగులు గాల్లోకి లేచాయి. ఒక్కసారిగా నిప్పులు చిమ్ముకుంటూ ముందుకు సాగాయి.

5

ఇలా వాయు వేగంతో దూసుకెళ్లిన క్షిపణులు నేరుగా సియోల్‌ లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ముఖ్య కార్యాలయాలను ధ్వంసం చేశాయి.

6

ఒకే ఒక్క క్షణంలో సియోల్ మొత్తం బూడిదయిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు అంత ఎత్తున ఉన్న భవనాలు నేలకొరిగాయి.

7

అంతటి ఘోరాన్ని కళ్లముందు చూపిస్తున్న ఈ వీడియోలో తాము తలుచుకుంటే సర్వం బూడిదే అంటూ చివరిగా వాక్యాలను కూడా చేర్చారు.

8

ఈ భయంకరమైన వీడియోను రెండు రోజుల కిందట డీపీఆర్ కె వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీనికంటే 10 రోజుల ముందు అమెరికాలోని వాషింగ్టన్ ను పేలుస్తున్నట్లుగా వీడియోను రిలీజ్ చేసిన విషయం విదితమే.

9

సౌత్ కొరియా బూడిదవుతున్నట్లుగా నార్త్ కొరియా రిలీజ్ చేసిన వీడియో ఇదే.

10

ఈ వీడియోలతో అమెరికా, సౌత్ కొరియా ఇప్పుడు పునరాలతోచనలో పడేటట్లు ఉన్నాయి. మరి ముందు ముందు జగడాల నార్త్ కొరియా ఇంకెన్ని వీడియోలను రిలీజ్ చేస్తుందో చూడాలి.

11

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write North Korea's Graphical video goes viral showing rocket attack on South Korea
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot