ఏకమైన రష్యా, నార్త్ కొరియా, అమెరికాను చావు దెబ్బ కొట్టేందుకే..!

Written By:

గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ యుద్దం జరగబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మూడవ ప్రపంచ యుద్దానికి గల కారణాలు ఇద్దరే ఇద్దరు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..మరొకరు ఉత్తరకొరియాను ఏలే కిమ్ జాంగ్ ఉన్. రెండు దేశాల నేతలు మిస్సైల్స్ తో కయ్యానికి సై అంటున్నారు.

ఆ భయానక శబ్దాలు గ్రహాంతరవాసులవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జపాన్‌ ఉత్తర భూభాగం మీదుగా

జపాన్‌ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలోకి మధ్య తరహా శ్రేణి క్షిపణి(హస్వాంగ్‌-12)ని పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల నేపథ్యంలో

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల నేపథ్యంలో తాము ఈ పరీక్షను నిర్వహించినట్లు వెల్లడించింది. ప్యాంగ్‌యాంగ్‌ నుంచి ఈ పరీక్షను నిర్వహించాలని అధ్యక్షుడు కిమ్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది.

హస్వాంగ్‌-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను

హస్వాంగ్‌-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను గ్వామ్‌ను సర్వనాశనం చేసేందుకు వినియోగిస్తామని, ఇందుకు వ్యూహం రచించామని గతంలో కిమ్‌.. అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే.

కిమ్‌-ట్రంప్‌ల వాగ్యుద్ధం తర్వాత

కిమ్‌-ట్రంప్‌ల వాగ్యుద్ధం తర్వాత గ్వామ్‌పై దాడిని ఉత్తరకొరియా విరమించుకుంది. కొరియా యుద్ధం అనంతరం పసిఫిక్‌ మహా సముద్రంలో గల గ్వామ్‌ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 1.60 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అమెరికాకు చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లు ఇక్కడున్నాయి.

ఉత్తరకొరియా ఎంత రెచ్చిపోతే అంతలా నాశనం

ఉత్తరకొరియా ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా ఎంత రెచ్చిపోతే అంతలా నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాను ఒంటరి చేస్తాయని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కిమ్‌ దేశాన్ని కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తర కొరియా చర్యను

ఉత్తర కొరియా చర్యను జపాన్ తోపాటు అమెరికా, దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించాయి. అయితే కిమ్ మాత్రం తన చర్యను సమర్థించుకోవడమేగాక.. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

ఓ న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ను

ఇదిలా ఉంటే ఉత్తరకొరియాను దృష్టిలో ఉంచుకుని ఓ న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కిమ్‌ మాటలతో వినే రకం కాదు అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

అమెరికా నేవీ కూడా

ఇప్పటికే అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పసిఫిక్‌ మిస్సైల్‌ రేంజ్‌ ఫెసిలిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, వాయుసేన పరీక్షించిన బీ61-12 బాంబును కిమ్‌ దేశాన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అమెరికా చేసిన ఈ ప్రకటన

అమెరికా చేసిన ఈ ప్రకటన కిమ్‌ ని ఇరుకున పెట్టినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ఉత్తరకొరియాతో చర్చలు ఉండబోవని, ఇక ఆ దేశంపై చర్యలకు సిద్ధమవుతున్నామని సంకేతాలు ఇస్తున్నాయి.

అమెరికా బాంబులు వేసిన విషయం తెలుసుకున్న కిమ్ జాంగ్

అమెరికా బాంబులు వేసిన విషయం తెలుసుకున్న కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా స్పందించారు. తాను ఒక్క క్షిపణి పరీక్షను చేస్తే అమెరికా వెనక్కు పరిగెడుతుందని మండిపడ్డారు. తమ దేశ సరిహద్దుల్లో అమెరికా బాంబర్లు, అమెరికా యుద్ధ విమానాలు ఉండటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని ఐక్య రాజ్య సమితి

కాగా, అంతకుముందు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని ఐక్య రాజ్య సమితి కూడా ఖండించింది. తమ దేశంపై ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడంతో జపాన్, దక్షిణ కొరియాలు ఐరాసను సంప్రదించాయి. తక్షణం భద్రతా మండలిని సమావేశపరిచి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరాయి

ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగితే

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగితే చూస్తూ ఊరుకోమని అమెరికా ఊహించలేని పరిణామాలు ఎదురవుతాయని రష్యా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉత్తర కొరియాకు ఆపన్నహస్తం ఎదురయినట్లు తెలుస్తోంది.

ముందు ముందు పరిణామాలు

మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. రెండు దేశాలు కాంప్రమైజ్ అవుతాయా లేక యుద్ధానికి సై అంటాయా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
North Korea's missile test over Japan was a threatening proof of concept more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot