కలా.. నిజమా : బద్ధ శత్రువులు ఇలా సెల్ఫీలతో..

By Hazarath
|

ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరూ ఉప్పు నిప్పులాగా అణుక్షణం చిటపటలాడుతూనే ఉంటారు. ఒకరంటే ఒకరికి చంపేంత కోపం...మరి అలాంటి నేతలు ఓ చోట కలిసి సెల్ఫీలు దిగుతూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది..అందరూ షాక్తో దిమ్మ తిరిగి కింద పడాల్సిందే కదా.. మరి అలా షాక్ ఇవ్వాలనుకున్నారో ఏమో కాని ఇద్దరు హాలీవుడ్ హీరోలు వారిద్దరి వేషంలో గతేడాది ఆస్కార్ వేడుకలకు వచ్చి అందరికీ పిచ్చెక్కిచ్చినంత పనిచేశారు. వారి ముచ్చట వింటే ఇక చెప్పనే అవసరం లేదు.

Read more: ప్రపంచాన్ని వణికిస్తున్న నార్త్ కొరియా లోపలి నిజాలు

1

1

గతేడాది ఆస్కార్ వేడుకలు జరుగుతున్న ప్రదేశం బయట హాలీవుడ్ కమెడియన్ హీరో రెగ్గీ బౌన్ ఒబామా వేషంలోనూ..అలాగే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వేషంలో అమెరికన్ రేడియో యాక్టర్ హోవార్డ్ వచ్చి అందర్నీ షాక్‌లో ముంచి పడేశారు.

2

2

వారిద్దరూ వేసుకున్న వేషాలు అచ్చం ఒబామా, కిమ్ జాంగ్ లా ఉండటంతో ఆస్కార్ కు వేడుకకు వెళ్తున్న ప్రతినిధులు ఆ వేడుకలు వదిలేసి వారితో సెల్ఫీలు దిగేందుకు తెగ పోటీ పడ్డారు..వీరిద్దరూ కలవడమేందని షాక్ తిన్నంత పనిచేశారు కూడా.

3

3

ఇక ఇద్దరు శత్రువులు మిత్రులయినట్లు కిమ్ జాంగ్ వేషంలో ఉన్న హోవార్డ్ అలాగే ఒబామా వేషంలో ఉన్న రెగ్గి టూరిస్టుల కెమెరాలకు ఫోజులిస్తూ ఒకరినొకరు చేయిపట్టుకుని నడుస్తుంటే అందరి దృష్టి వారిమీదనే ఉంది. అందరూ అది నటనని తెలియక నోరెళ్లబెట్టారు మరి.

4

4

ఇక కిమ్ జాంగ్ రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి రాగానే హల్లో స్టుపిడ్ అమెరికన్స్ అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా చచ్చిపోయిందంటూ ఇంకా పదునైన మాటలు వాడారు కూడా. అయితే అక్కడి ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకోకుండా తెగ ఎంజాయ్ చేశారు.

5

5

ఇక ఒబామా రూపంలో ఉన్న వ్యక్తి కిమ్ జాంగ్‌ను ఉద్దేశించి మీ రాక మాకెంతో శుభదాయకం. మా దేశ ప్రజలు నీ రాకను స్వాగతిస్తున్నారు. మీతో కలిసి ఫోటోలు దిగాలనుకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు వదలడంతో అక్కడ నవ్వుల వరద పారింది.

6

6

ఇంతలో ఓ బ్రెజిల్ కి చెందిన స్త్రీ అక్కడికి వచ్చి ఒబామా ఐ లవ్ యూ అంటూ చెప్పడం అలాగే కిమ్ జాంగ్ నుద్దేశించి నీకు ఇక్కడేం పని వెంటనే నార్త్ కొరియా వెళ్లు అనడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వారిద్దరూ ఆ స్త్రీ దెబ్బకు షాక్ తిన్నంత పనిచేశారు.

7

7

ఆ బ్రెజిల్ వనితకు వీరిద్దరూ మేము నిజమైన ఒబామా ,కిమ్ జాంగ్‌లం కాదని సర్ది చెప్పలేక నానా అవస్థలు పడ్డారట. చివరకు ఎలాగోలా తంటాలు పడి ఆమెను అక్కడినుంచి పంపించి వేశారు.

8

8

ఇదిలా ఉంటే అక్కడ చాలామంది అమెరికన్లు ఒబామా వేషంలో ఉన్న రిగ్గితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా చైనా టూరిస్టులు మాత్రం కిమ్ జాంగ్‌తో ఫోటోలు దిగేందుకు తెగ ఆసక్తి చూపారు. ఎంతైనా శత్రువు శత్రువే.. మిత్రుడు మిత్రుడే అన్నట్లుగా వారితో ఫోటోలు దిగారు టూరిస్టులు

9

9

ఇక ఒబామా వేషంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి కిమ్ జాంగ్ వేషంలో ఉన్న వ్యక్తి నీకు నార్త్ అమెరికాలో ఫాలోయింగ్ బాగా ఉంటే మాకు ఆసియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉందని చెప్పడంతో అక్కడ ఆసక్తికర వాతావరణం ఏర్పడింది.

10

10

ఇక ఫైనల్‌గా కిమ్ జాంగ్ రూపంలో ఉన్న హోవార్డ్ నార్త్ కొరియా వెళ్లడానికి 1500 డాలర్లు ఫండ్స్ కావాలని ప్రచారం చేస్తూ అక్కడ అందర్నీ చందాలు ఇవ్వమని అడగం కూడా చాలా నవ్వు తెప్పించింది కూడా. ఆ సన్నివేశాన్ని చూసి అందరూ తెగ ఎంజాయ్ చేశారు.

11

11

కిమ్ జాంగ్ వేషంలో ఉన్న వ్యక్తి అమెరికన్ సింగర్ కాట్ ఫెర్రీతో గత నెలలో ఫోటోలు దిగారు..ఆ ఫోటోలను చూస్తూ ఒబామా వేషంలో ఉన్న వ్యక్తితో నేను ఆమె నడకను చూశాను. ఆమె నా బెస్ట్ వాయిస్ అంటూ ఒబామాకు చెప్పడంతో ఒబామా ఖంగు తిన్నంత పనిచేశారు.

12

12

కాట్ ఫెర్రీని నేనెవరో నీకు తెలుసా అని కిమ్ జాంగ్ వేషంలో ఉన్న వ్యక్తి అడిగితే ఆమె సీరియస్‌గానూ ఆశ్చర్యంగానూ చూసిందట కిమ్ జాంగ్ వైపు. నేను నిజమైన కిమ్ జాంగ్‌నా లేక అతని వేషంలో ఉన్న వ్యక్తినా అనేది ఆమెకు తెలిసి ఉండకపోవచ్చని చెప్పడంతో ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.

13

13

అయితే ఆస్కార్ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఇవ్వడంతో వారిద్దరికి బయట తిప్పలు తప్పలేదు. ఇది కేవలం నవ్వుకోడానికి మాత్రమేనని మేము ఆస్కార్ కి వెళ్లడం లేదని వారు సెలవివ్వడంతో అక్కడ పోలీసులు శాంతించారట.

14

14

ఇది బయట జరుగుతుండగా లోపల ఆస్కార్ వేడుకలు జరుగుతున్న ఆరు బ్లాకులు మూసివేశారు. చివరిగా కిమ్ జాంగ్ అత్యంత ఉత్సాహంతో అమెరికా చనిపోయిందంటూ ఎకె 47 గన్ వారి మెడ మీద పెట్టడంతో అక్కడి కామెడీకి తెరపడింది.

15

15

ఇది గతేడాది ఆస్కార్ వేడుకలు జరుగుతున్న సమయంలో బయట నడిచిన డ్రామా.. లోపల ఆస్కార్ వేడుకల కన్నా వీరిద్దరి నటననే అక్కడి జనాలు బాగా ఎంజాయ్ చేశారు. కాని వారు మాత్రం అగ్రదేశాధి నేతల్లా నటించడానికి మాత్రం నానా పాట్లు పడాల్సి వచ్చింది.

16

16

ఈ సెల్ఫీలు గతేడాది ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి కూడా. ప్రతి ఒక్కరూ ఈ సెల్పీల గురించే గతేడాది చర్చలు జరిపారు. ఈ అగ్రదేశాధినేతల డమ్మీ సెల్పీలతో దాదాపు ఇంటర్నెట్ బ్రోక్ అయినంత పని అయింది.

17

ఈ డ్రామాకు సంబంధించిన వీడియో 

18

18

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

SOURCE: Barcroft TV

Best Mobiles in India

English summary
Here Write An Oscar winning selfie: 'Barack Obama and Kim Jong-un' banned from Hollywood bash

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X