అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికి చస్తున్న పాకిస్తాన్ (వీడియో)

Written By:

విభజన నేపథ్యంలో అసలే రాజధాని లేక అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు హైడ్రోజన్ బాంబుల యవ్వారం ఆసక్తికర అంశంగా మారి పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. రాజధాని పెట్టుబడుల కోసం దేశదేశాలు చక్కర్లు కొట్టిన ఏపీ సీఏం చంద్రబాబు ప్రపంచాన్ని వణుకుపుట్టించే హైడ్రోజన్ బాంబు తయారీ కోసమే అన్ని దేశాలు చక్కర్లు కొట్టారని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. సంచలనంతో పాటు నవ్వులు పూయిస్తున్న ఆసక్తికర కధనం మీకోసం.

Read more: అమెరికా వెళ్లేందుకు వీసాలివే : మోసగాళ్లతో జాగ్రత్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏపీలో హైడ్రోజన్ బాంబు సీక్రెట్ గా తయారు

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

రాజధాని నిర్మాణ పనులు పాకిస్తాన్ వారికి హైడ్రోజన్ బాంబు తయారుచేసే ప్లాంట్లుగా కనిపించాయి. అందుకే మొన్న వరుస కథనాలను ప్రచురించారు. ఇండియా ఎవ్వరికీ తెలియకుండా ఏపీలో హైడ్రోజన్ బాంబు  సీక్రెట్ గా తయారుచేస్తుందని వార్తలు వడ్డించారు.

పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్లో

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

ఈ నెల 3న పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి.. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి నిర్మాణానికి అమెరికా

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని సదరు వ్యక్తి తేల్చాడు. అంతేకాదు, అమరావతి నిర్మాణానికి అమెరికా సహకరిస్తుందని చెప్పాడు.

అమరావతి డిజైన్‌లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

అమరావతి డిజైన్‌లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెలలోనూ ఆ దేశ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. ఇక మీడియాకు వంత పాడిన పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా అమరావతిలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది.

తొలి టీవీ ఫుటేజీ ఆదారంగా

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

తొలి టీవీ ఫుటేజీ ఆదారంగా మీడియాలో పెద్ద ఎత్తున పాక్‌లో అమరావతిపై కల్పిత వార్తలు వస్తున్నాయి. ఓ తెలుగు టీవీ ఛానల్ అమరావతి పనుల ప్రారంభం గురించి టెలికాస్ట్ చేయగా దానిని తీసుకొని వారు వింత కథనాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఓ భారీ నగరాన్ని

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

ఆంధ్రప్రదేశ్ ఓ భారీ నగరాన్ని నిర్మిస్తోందని, అది ఒక న్యూక్లియర్‌ సిటీ అని, అక్కడ హైడ్రోజన్ బాంబ్‌ తయారు చేస్తున్నారని, పాక్‌పై అణుబాంబు వేసేందుకు ఇండియా కుట్ర చేస్తోందని అక్కడ వాదించారు.

పాక్‌పై గురిపెట్టి, చైనాపై కక్షగట్టి

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

పాక్‌పై గురిపెట్టి, చైనాపై కక్షగట్టి ఇండియా ఇలాంటి కుతంత్రాలు పన్నుతోందంటూ పాక్‌ మీడియా ఈ స్థాయిలో తెలివితేటలు వలకబోసుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ను ఇన్వాల్వ్‌ చేసి హైడ్రోజన్ బాంబ్‌ చుట్టూ పిట్ట కథ అల్లేసింది.

దీనికి సంబంధించిన వీడియో

అమరావతిలో హైడ్రోజన్ బాంబు : వణికిచస్తున్న పాకిస్తాన్

దీనికి సంబంధించిన వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

source: Indian Fortune

English summary
Here Write pakistan media sees nuclear designs andhra pradesh video goes viral
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting