ఐఫోన్‌లలో నిలిచిపోనున్న Pokemon Go

Posted By: BOMMU SIVANJANEYULU

ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆన్‌లైన్ గేమ్ Pokemon Go పలు ఐఫోన్‌ల‌లో ఆగిపోనుంది. ఐఫోన్ 5 ఇంకా ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లలో Pokemon Go ఆటకు సంబంధించిన సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు Pokemon Go డెవలపపర్ Niantic వెల్లడించింది. iOS 11కు అప్‌గ్రేడ్ కాలేని ఐఫోన్‌లలో ఈ గేమ్‌ను అందుబాటులో ఉంచటం కష్టమని సదరు సంస్థ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫిబ్రవరి 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి..

Pokemon Go గేమ్‌కు సంబంధించి త్వరలో లాంచ్ చేయబోతోన్న ఓ కీలక అప్‌డేట్ iOS 11 ఆధారిత డివైసుల్లో మాత్రమే పూర్తిస్థాయిలో వర్క్ అయ్యే వీలుండటంతో, అప్‌డేట్‌కు నోచుకోని ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ వంటి మోడల్స్‌లో గేమ్‌కు సంబంధించిన సపోర్ట్ నిలిచిపోనున్నట్లు పోక్‌మ్యాన్ గో వెబ్‌సైట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని నియాంటిక్ ఇంక్ తెలిపింది. ఫిబ్రవరి 28 తరువాత నుంచి ఐఓఎస్ 11 సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్ కాలేని యాపిల్ డివైస్‌లలో పోక్‌మ్యాన్ గో అకౌంట్లను యాక్సెస్ చేసుకునే వీలుండదని సదురు సంస్థ పేర్కొంది.

యాపిల్ ఏఆర్‌కిట్ ఫ్రేమ్‌వర్క్‌తో మరింత రియలిస్టిక్‌గా...

నియాంటిక్ ఇంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5, ఐప్యాడ్ (4వ తరం), ఐప్యాడ్ (3వ తరం), ఐప్యాడ్ మినీ (మొదటి తరం), ఐప్యాడ్ 2 డివైసుల్లో ఫిబ్రవరి 28 తరువాత నుంచి పోక్‌మ్యాన్ గో సపోర్ట్ నిలిచిపోనుంది. సరిగ్గా నెలరోజల క్రితమే ఐఫోన్ 6ఎస్ ఆపై వర్షన్ ఐఫోన్‌లకు సంబంధించి AR+ మోడ్‌ను నియాంటిక్ అనౌన్స్ చేసింది. ఈ మోడ్ యాపిల్ ఏఆర్‌కిట్ ఫ్రేమ్‌వర్క్ సహాయంతో Pokemon Go గేమ్‌ను మరింత రియలిస్టిక్‌గా అందించే ప్రయత్నం చేస్తుంది.

టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది..

ఇప్పటికి వరకు మార్కెట్లో లాంచ్ అయిన అన్ని ఆండ్రాయిడ్ గేమ్స్‌తో పోలిస్తే Pokemon Go టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ గేమ్‌కు అలవాటుపడుతోన్న జనం వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. ఈ గేమ్ కారణంగా ప్రపంచదేశాల్లో అనేక ప్రమాదాల కూడా చోటుచేసుకున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా హానర్ 9 లైట్, ధర రూ. 11,700 మాత్రమే !

నగర వీధుల్లో పోక్‌మాన్...

ఈ గేమింగ్ యాప్‌లో Pokemon పేరుతో ఓ బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మను మనం పట్టుకోవాలి. ఈ గేమ్ ఆడే ముందు ఫోన్ జీపీఎస్‌ను ఆన్ చేయవల్సి ఉంటుంది. జీపీఎస్ ఆన్ చేయటం వల్ల, మనం ఉన్న వీధుల్లో పోక్‌మాన్ బొమ్మ పరిగెడుతున్న యూజర్ ఇంటర్ పేస్ ఫోన్ స్ర్కీన్ ప్రత్యక్షమువుతుంది. ఈ బొమ్మను పట్టుకునేందుకు, అది వెళ్లిన వీధుల్లో మనం తిరగాల్సి ఉంటుంది.

గేమ్‌లో మునిగితేలుతున్నారు..

ఈ గేమ్ ఆడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేయటం విశేషం. అచ్చం సెల్ఫీల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో అలాంటివే ఈ గేమ్ ఆడే సమయంలో జరుగుతున్నాయట. ఆ మధ్య ఒకమ్మాయి ఈ గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటి వెళుతుండగా ఆమె ఢీకొట్టడం నుంచి తప్పించి వరుసగా కార్లు ఢీకొని గాల్లో లేస్తున్న కనీసం తన చుట్టు ఏం జరుగుతుందనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
If you’re playing Pokemon Go on an iPhone 5 or iPhone 5c, you won’t be able to for long. Pokemon Go developer Niantic has announced it will be dropping support for Apple devices that cannot be upgraded to iOS 11.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot