రతన్ టాటా లవ్‌లో ఫెయిల్ అయ్యాడని ఎవరికైనా తెలుసా ?

By Gizbot Bureau
|

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. టాటా గ్రూప్‌ చైర్మన్‌గానే కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన పేరు గడించారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటుగా తన వంతుగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కోటీశ్వరుడైనప్పటికీ నిరాడంబరంగా జీవనం సాగించే రతన్‌ టాటా యువతకు రోల్‌ మోడల్‌ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయనకు ఈ గుర్తింపు కేవలం ఒక్కరోజులోనే రాలేదు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన బాల్యమేమీ పూల పాన్పు కాదు. ఇక ఆయన లవ్ కూడా ఫెయిల్యూర్ అయింది. ఆయన లవ్ స్టోరీ విషయానికి వస్తే..

రతన్ టాటా పదేళ్ల వయస్సలో
 

రతన్ టాటా పదేళ్ల వయస్సలో

రతన్ టాటా పదేళ్ల వయస్సలో తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో బామ్మ దగ్గర పెరిగాడు. బామ్మ రతన్ టాటాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి ఆమె చివరి రోజుల్లో చూసుకునేందుకు ఎవరూ లేరని రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. తనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన బామ్మ కోసం రతన్‌ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. చివరిరోజుల్లో ఆమెకు తోడుగా ఉండేందుకు ఇండియాకు రావడం వల్ల ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యారట. అందుకే బ్రహ్మచారిగా మిగిలిపోయారట. ఈ విషయాలను ప్రఖ్యాత హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రతన్‌ టాటానే చెప్పుకొచ్చారు.

విడాకుల వ్యహారంతో ఇబ్బందులు 

విడాకుల వ్యహారంతో ఇబ్బందులు 

మా అమ్మ నాన్నల విడాకుల వ్యవహారం వల్ల తోటి విద్యార్థుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పట్లో విడిపోవడం అంటే ఇప్పటిలా తేలికైన విషయం కాదు. అందుకే స్కూళ్లో మమ్మల్ని ర్యాగింగ్‌ చేసేవాళ్లు. అయితే అలాంటి సమయాల్లో మా బామ్మ మాకు ఎంతో అండగా నిలిచింది. అలా కొన్నాళ్లు గడిచింది. కానీ ఎప్పుడైతే మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అయితే అప్పుడు కూడా బామ్మ తోడుగా నిలిచింది. సంయమనంతో ఉండటం నేర్పించింది. నేటికీ నేను అది కొనసాగిస్తున్నానని అని రతన్ టాటా తెలిపారు.

డిగ్నిటీ

డిగ్నిటీ

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తను నన్ను నా సోదరుడిని వేసవి సెలవుల కోసం లండన్‌కు తీసుకువెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉండాలో ముఖ్యంగా డిగ్నిటీ గురించి నేర్పించింది. ఆ విషయాలన్నీ మా మెదళ్లలో ముద్రపడిపోయాయి. తను ఎల్లప్పుడూ మా కోసమే జీవించింది

బామ్మ స్పూర్తి
 

బామ్మ స్పూర్తి

మా నాన్నతో కూడా నాకు విభేదాలు వచ్చాయి. నేను వయోలిన్‌ వాయించడం నేర్చుకుంటానంటే.. నాన్న పియానో నేర్చుకోవాలని పట్టుబట్టారు. నేను అమెరికాలో చదువుతానంటే ఆయన లండన్‌లోనే చదవాలన్నారు. నేను ఆర్కిటెక్ట్‌ అవుతానంటే.. ఇంజనీర్‌ కావాలని పట్టుబట్టారు. అప్పుడు బామ్మే వల్లే ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాను. అయితే ఈ విషయం నాన్నను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను. బామ్మ చెప్పినట్లుగా మృదువుగా మాట్లాడుతూనే.. నాకు కావాల్సిన వాటిని సాధించుకునేవాడిని. దీనంతంటికీ తనిచ్చిన ధైర్యమే కారణం.

లాస్‌ ఏంజెల్స్‌ ప్రేమ 

లాస్‌ ఏంజెల్స్‌ ప్రేమ 

కాలేజీ అయి పోయిన తర్వాత.. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థలో జాబ్‌ సంపాదించాను. రెండేళ్లపాటు అక్కడే పనిచేశాను. అక్కడ ఉన్నది కొంతకాలమే గానీ.. అక్కడి వాతావరణం ఎంతో అందమైనది. నా సొంత కారు, నేను ఇష్టంగా చేసే జాబ్‌. నేను ప్రేమలో పడింది కూడా అక్కడే. ఓ అమ్మాయిని ప్రేమించాను... దాదాపుగా మా పెళ్లి అయిపోయినట్లే అనే భావన. కానీ అప్పుడే నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. అప్పటికే ఏడేళ్లుగా బామ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను చూడటానికి.. తనతో ఉండటానికి ఇక్కడికి వచ్చేశాను. నాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తుందనుకున్నా. అయితే 1962లో ఇండో- చైనా యుద్ధం జరుగుతున్నందున తను ఇక్కడికి రావడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలా ఆ బంధం బీటలు వారింది'' అని 82 ఏళ్ల రతన్‌ టాటా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

1948లో తల్లిదండ్రులు విడాకులు

1948లో తల్లిదండ్రులు విడాకులు

రతన్‌ టాటా తల్లిదండ్రులు నావల్‌ టాటా- సోనూ టాటా 1948లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇరువురూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఇక నావల్‌ టాటాకు రెండో భార్య వల్ల కలిగిన సంతానం నోయల్‌ టాటా. కాగా పారిశ్రామిక రంగంలో టాటా గ్రూప్‌ను మేటిగా నిలిపిన రతన్‌ టాటాను భారత ప్రభుత్వం.. పద్మ భూషణ్‌(2000), పద్మ విభూషణ్‌(2008) పురస్కారాలతో సత్కరించిన విషయం తెలిసిందే.

Most Read Articles
Best Mobiles in India

English summary
Ratan Tata reveals he fell in love and almost got married, faced ragging

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X