పాత కాలం టీవీలు మరియు రేడియో లలో లక్షలు విలువచేసే ఎర్ర పాదరసం? నిజమెంత ?

By Maheswara
|

పాత కాలం చెక్క టీవీ లు ,చెక్క రేడియో ల లో ఎర్ర పాదరసం ఉంటుంది అని,ఎర్ర పాదరసం సీసాల కోసం మేము లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని కొన్ని ముఠాలు పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించింది.

సినిమాలలో లో చూపించినట్టు
 

సినిమాలలో లో చూపించినట్టు

సినిమాలలో లో చూపించినట్టు ఒక మట్టి పాము అమ్మడం ,అలాగే రేడియం అమ్మడం ద్వారా మోసం చేస్తున్న దృశ్యాలు సినిమాలలో మీరు చూసే ఉంటారు. అదేవిధంగా, ఎరుపు పాదరసం కూడా ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఇంతకీ నిజంగా ఎర్ర పాదరసం ఉందా?

ఇంతకీ నిజంగా ఎర్ర పాదరసం ఉందా?

నిజంగా ఎర్ర పాదరసం ఉందా అనేది ప్రశ్నార్థకం. తెలుపు పాదరసం మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనకు, ఎర్ర పాదరసం అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఎర్ర పాదరసం అణ్వాయుధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తుందని మరియు ఇది అనేక వ్యాధులను నయం చేయగలదని పుకారు పుట్టించారు.

Also read:తక్కువ ధరకే టాబ్లెట్ లు,ప్రింటర్లు,హోమ్ థియేటర్లు.ఇంకా ఎన్నో...! Also read:తక్కువ ధరకే టాబ్లెట్ లు,ప్రింటర్లు,హోమ్ థియేటర్లు.ఇంకా ఎన్నో...!

ఎర్ర పాదరసం ఇంట్లో ఉంటే

ఎర్ర పాదరసం ఇంట్లో ఉంటే

మీరు ఎర్ర పాదరసం దగ్గర వెల్లుల్లిని ఉంచితే, పాదరసం పారిపోతుంది అని మరియు మీరు బంగారాన్నిఉంచితే అది ఇనుము మరియు అయస్కాంతం లాగా అతుక్కుంటాయని. ఎర్ర పాదరసం ఇంట్లో ఉంటే సంపద కూడా మన ఇంట్లోకి బంగారం లాగా ఆకర్షించబడుతుందని అపోహలు ఉండటం వల్ల దాని ధర లక్షల్లో ఉంటుందని అపోహలు ఉన్నాయి.

Also Read:రంగులతో మెరిసిపోతున్న భూమి!! అద్భుతమైన ఫోటోను విడుదల చేసిన నాసా...Also Read:రంగులతో మెరిసిపోతున్న భూమి!! అద్భుతమైన ఫోటోను విడుదల చేసిన నాసా...

పాత మోడల్ టీవీలను కొనడానికి
 

పాత మోడల్ టీవీలను కొనడానికి

ఈ కారణంగా, మోసపూరిత ముఠాలు గ్రామీణ ప్రాంతాల్లోని పాత రేడియో మరియు టీవీ మరమ్మతు దుకాణాలపై నేరుగా దాడి చేస్తున్నాయి. ఆ టీవీలో ఎర్ర పాదరసం ఉండవచ్చు ఏమో అనే అనుమానం తో ఈ పనికిపూనుకుంటున్నారు. ఎర్ర పాదరసం సీసాలు కోటి రూపాయలు విలువ చేస్తాయని నమ్మడం ద్వారా, ఎక్కువ మంది ప్రజలు దాని కోసం వెతుకుతున్నారు మరియు పాత మోడల్ టీవీలను కొనడానికి ఇంటింటికి వెళ్తున్నారు.

తమిళనాడు లోని మదురై సమీపంలో

తమిళనాడు లోని మదురై సమీపంలో

తమిళనాడు లోని మదురై సమీపంలో వెలుగు చూసిన ఈ ముఠా కార్యకలాపాలు,స్థానిక ప్రజల ఫిర్యాదులతో ప్రాంతీయ అభివృద్ధి అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని దీనికి కారణమైన వ్యక్తులపై దర్యాప్తు జరుగుతుందనివారు తేల్చి చెప్పారు.

'ఎర్ర పాదరసం' అనే పదాన్ని నమ్ముతూ ఎవరూ మోసపోవద్దు

'ఎర్ర పాదరసం' అనే పదాన్ని నమ్ముతూ ఎవరూ మోసపోవద్దు

ఎర్ర పాదరసం కోట్ల రూపాయల విలువైనదని పేర్కొంటూ తమిళనాడు ఉత్తర జిల్లాల్లో మోసాలకు పాల్పడిన ఒక మోసపూరిత ముఠా ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చు అని తెలిసింది.'ఎర్ర పాదరసం' అనే పదాన్ని నమ్ముతూ ఎవరూ మోసపోవద్దని, అలాంటి మోసాలు ను పోలిసుల దృష్టికి తీసుకు వెళ్లాలని,పిర్యాదులు చేస్తే తక్షణం ఇటువంటి మోసగాళ్లపై చర్యలు తీసుకుంటామని పోలీస్ లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Red Mercury In Old Tvs And Radios Worth Lakhs Of Rupees.How Much Truth In It?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X