Just In
- 7 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 1 day ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 1 day ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- Sports
పిచ్ అంత దారుణంగా ఏం లేదు.. కివీస్ బ్యాటర్లకు చేతకాలేదు: హార్దిక్ పాండ్యా
- News
target: హిందువులు టార్గెట్, ప్రవీణ్ హత్య శాంపిల్ మాత్రమే, దేశంలో ఇస్లామిక్ పాలనే పీఎఫ్ఐ లక్షం, ఎన్ఐఏ !
- Lifestyle
చలికాలంలో బరువు పెరగడానికి అసలు కారణం ఇదే... దీనికి దూరంగా ఉండాలి!
- Movies
Thunivu Collection: సక్సెస్ కానున్న అజిత్ బ్యాంక్ రాబరీ.. ఇంకొన్ని లక్షలు వస్తే హిట్టు, తెలుగులో మాత్రం!
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్‌లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ప్రభుత్వాన్ని నడపాలంటే అంబాని సంపద చాలు ! మీ కోసం ఆసక్తికర విషయాలు !
రాబిన్ హుడ్ ఇండెక్స్ 2018లో కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముఖేష్ అంబాని సంపదపై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ప్రపంచంలోని ఆయా దేశాల్లో అత్యంత సంపన్నులు తమ సొమ్ముతో ప్రభుత్వాలను ఎన్ని రోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే ఈ ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బ్లూమ్‌బర్గ్ రాబిన్‌హుడ్ ఇండెక్స్ 2018 ప్రకారం సంపన్నుల నికర ఆస్తులు, ఆయా దేశాల ప్రభుత్వాల రోజువారీ వ్యయంతో లెక్కగట్టి ఈ విశ్లేషణ చేపట్టారు.

20 రోజుల పాటు ప్రభుత్వాన్ని..
భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదతో 20 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలరని వెల్లడైంది.

జాన్ ఫ్రెడ్రిక్సన్ ఏకంగా 441 రోజుల పాటు..
సైప్రస్‌లో అత్యంత సంపన్నుడైన జాన్ ఫ్రెడ్రిక్సన్ ఏకంగా 441 రోజుల పాటు తమ ప్రభుత్వ ఖర్చులను గట్టెక్కించగలరని తేలింది. కాగా సైప్రస్‌లో తక్కువ జనాభా, పరిమిత వ్యయం ఉండటంతో సర్కార్ నిర్వహణ ఖర్చులు అక్కడ తక్కువగా ఉండటం గమనార్హం.

అలీబాబా అధినేత..
ఇక జపాన్, పోలాండ్, అమెరికా, చైనాలో దిగ్గజ సంపన్నులకూ తమ ప్రభుత్వాలను ఈదడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమే. చైనాలో అలీబాబా అధినేత ప్రపంచంలోనే 16వ అత్యంత సంపన్నుడు జాక్‌మా తన సంపదతో డ్రాగన్ సర్కార్‌ను కేవలం నాలుగు రోజుల పాటే నడిపించగలరు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమెరికా ప్రభుత్వాన్ని కేవలం అయిదు రోజులే ఆదుకోగలరని రాబిన్‌హుడ్ ఇండెక్స్ విశ్లేషిస్తే వెల్లడైంది.

బ్రిటన్ సంపన్నుడు..
బ్రిటన్ సంపన్నుడు హ్యూ గ్రొస్‌వెనార్, జర్మనీలో డైటర్ స్కార్జ్‌లూ అపార సంపదతోనూ కొద్ది గంటలు మాత్రమే తమ ప్రభుత్వాలను ఆదుకోగలరనే విషయాన్ని బ్లూమ్‌బర్గ్ రాబిన్‌హుడ్ ఇండెక్స్ తెలిపింది.

ఆసియాలోనే రెండో అత్యధిక ధనవంతుడిగా..
ఆసియాలోనే రెండో అత్యధిక ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. పాత సంపదకు ఈ ఏడాది మరో 12.1 బిలియన్ డాలర్లు అంటే సమారు రూ.77,000 కోట్లు కలిసినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ రిపోర్టు చేసింది.

ఆయిల్ నుంచి టెలికాం వరకు
ఆయిల్ నుంచి టెలికాం వరకు ముఖేష్ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తుడటంతో ఆయన సంపద ఈ మేర ఎగిసినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అంబానీ ఇటీవలే మొబైల్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించడానికి జీరోకే జియో ఫోన్‌ను లాంచ్ చేశారు. దీంతో ఆయన మార్కెట్‌ను మరింత విస్తరించనున్నారని తెలిసింది.

టెలికాం బిజినెస్‌ల నుంచి ..
గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌చేసిన టెలికాం బిజినెస్‌ల నుంచి అలాగే షేర్ హోల్డర్స్ లాభాలను ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టిస్తున్నారు. 2012 మార్చి నుంచి గ్రూప్ రుణాలు మూడింతలు అయినట్టు కూడా తెలిసింది.

పెరుగుతున్న రుణాలపై మాత్రం..
అయితే ఆయన 90 శాతం రెవెన్యూలు రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లు, రిటైల్, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్ అధినేత ముఖేష్ తన సంపదను భారీగానే పెంచుకుంటున్నారు. పెరుగుతున్న రుణాలపై మాత్రం స్పందించడానికి రిలయన్స్ అధికార ప్రతినిధి నిరాకరించారు.

2016లో..
2016లో బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19 స్థానానికి చేరుకున్నారు.

2019 మార్చి వరకు..
రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ లో పెడుతున్న పెట్టుబడులతో ప్రస్తుత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి భారీగానే లాభాలు రానున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అనాలిస్ట్ విశాల్ కుల్‌కర్ణి చెప్పారు. 2019 మార్చి వరకు ఈ వ్యాపారాల నుంచి ఆపరేటింగ్ లాభాలు 50 శాతం పెరుగనున్నట్టు చెప్పారు.

జియో నుంచి..
జియో నుంచి 1 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ లాభాలు ఆర్జించి, ఈ ఏడాది వీటిని మూడింతలు చేసుకోనున్నట్టు అంచనా వేస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470