Home
Miscellaneous

2,50,000 ప్రభుత్వ ఉద్యోగులకు రోబోట్లు ఎసరు

ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో రోబోలతో కోట్ల ఉద్యోగాలు గల్లంతు కానున్నాయని లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ రిపోర్ట్ చెబుతోంది.

By Sivanjaneyulu Bommu

బ్రిటన్ పబ్లిక్ సెక్టార్ పరిధిలోని 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలను రానున్న రోజుల్లో రోబోట్స్ అలానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు భర్తీ చేయనున్నాయని కొత్త అధ్యయనం చెబుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో రోబోలతో కోట్ల ఉద్యోగాలు గల్లంతు కానున్నాయని లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ రిపోర్ట్ చెబుతోంది.

2,50,000 ప్రభుత్వ ఉద్యోగులకు రోబోట్లు ఎసరు

రోబోట్ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుండడంతో బ్రిటన్ పబ్లిక్ సెక్టార్ పరిధిలోని వివిధ శాఖల్లో 2,50,000 ఉద్యోగాలను మెచీన్లు భర్తీ చేయనున్నాయి. రోబోట్లు కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారిలో 1,30,000 ప్రభుత్వ కార్య నిర్వాహణాధికారులు, నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ సర్వీసుకు సంబంధించి 90,000 మంది, జనరల్ ప్రాక్టీషనర్ రిసెప్షన్‌ కు సంబంధించి 24,000 మంది ఉన్నట్లు థింక్ ట్యాంక్ సర్వే చెబుతోంది.

2,50,000 ప్రభుత్వ ఉద్యోగులకు రోబోట్లు ఎసరు

ఉద్యోగుల స్ధానంలో ఆటోమేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం వల్ల బ్రిటన్ ప్రభుత్వానికి ఏటా $4.98 బిలియన్ ఆదా అవుతుందని ఈ సర్వే అంచనావేస్తోంది. రోబోటికి పరిజ్ఞానం మరింతగా అభివృద్ధి చెందినట్లయితే డాక్టర్ల ఉపాధికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదముందని సర్వే చెబుతోంది. ఇప్పటికే కొన్ని రకాల సర్జరీలకు రోబోట్లను ఉపయోగిస్తున్నారు.

భారత రాజకీయాల్లోకి రోబోటిక్స్ ఎంట్రీ ఇస్తే..?

భారత రాజకీయాల్లోకి రోబోటిక్స్ ఎంట్రీ ఇస్తే..?

ఇవన్ని చూస్తుంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం కాబోతుందన్న విషయం సుస్పష్టమవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, భారత రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఒకసారి ఊహించుకోండి. ఇండియన్ పాలిటిక్స్‌లోకి రోబోటిక్స్ ఎంట్రీ ఇస్తే చోటుచేసుకుబోయే విప్లవాత్మక మార్పలు గురించి పలు ఆసక్తికర విషయాలు..

కావల్సిన విధంగా రోబోట్లను ప్రోగ్రామ్ చేసుకుని

కావల్సిన విధంగా రోబోట్లను ప్రోగ్రామ్ చేసుకుని

ప్రజలు తమకు కావల్సిన విధంగా రోబోట్లను ప్రోగ్రామ్ చేసుకుని నవ సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చు. ప్రభుత్వంతో రియల్ టైమ్‌లో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒక రోబోట్‌ను ఎంఎల్ఏగా ఎంచుకున్నట్లయితే నియోజికవర్గ అభివృద్థిలో నిస్పక్షపాతంగా వ్యవహిరంచే అవకాశముంటుంది.

 ప్రాంతీయ బేధాలు లేకుండా పనిచేయగలవు

ప్రాంతీయ బేధాలు లేకుండా పనిచేయగలవు

రోబోట్లు రాజకీయాల్లోకి అడుగుపెడితే ప్రాంతీయ బేధాలు లేకుండా పనిచేయగలవు. పాలిటిక్స్‌లోకి రోబోట్లు అడుగుపెడితే, కులమతాలకు అతీతంగా రాజకీయ వ్యవస్థను మందుకు నడిపించే ప్రయత్నం చేస్తాయి.

సపూరిత వాగ్థానాలు ఉండవు

సపూరిత వాగ్థానాలు ఉండవు

ప్రజలను మభ్య పెట్టే మోసపూరిత వాగ్థానాలు ఉండవు. నిర్ణీత గడువులోపల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అవినీతికి ఏ మాత్రం తావుండదు.

సమస్యల పట్ల నిరంతర పర్యవేక్షణ...

సమస్యల పట్ల నిరంతర పర్యవేక్షణ...

సమస్యల పట్ల నిరంతర పర్యవేక్షణను రోబోట్ల కనబర్చటంతో పాటు పరిష్కార మార్గాలను రియల్ టైమ్‌లో సూచించే అవకాశం. ఉభయ సభలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రజలకు ఉపయోగపడే కొత్త చట్టాలు, పాలసీలు, విదివిధానాలు త్వరతిగతిన ఆమోదం పొందే అవకాశం.

 ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదు..

ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదు..

రోబోట్ల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉండవు కాబట్టి, ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదు. పాలన సజావుగా సాగే అవకాశం. భారత రాజకీయాల్లోకి రోబో పాలిటిక్స్ ఎంట్రీ, ఒక నూతన అధ్యయనమనే చెప్పుకోవాలి. భవిష్యత్ లో ఇలాంటి ప్రయోగాలు జరగాలిని కోరుకుందాం.

More from GizBot

Best Mobiles in India

English summary
Robots Will Replace 250000 Govt Jobs And That’s Just The Beginning. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X