ఇన్ఫోసిస్ కొత్త బాస్ వేతనమెంతో తెలుసా..?

|

ఇన్ఫోసిస్ కంపెనీ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సలిల్ పారేక్ ఫిక్సుడ్ వేతనం క్రింద రూ.6.5కోట్లు అందుకోనున్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సర ముగింపు నాటికి రూ.9.75 కోట్ల మొత్తాన్ని ఇన్సెంటివ్ లేదా బోనస్ క్రింద పొందడానికి సలిల్ పారేక్ అర్హులవుతారని ఇన్ఫోసిస్ స్వతంత్ర బోర్డు సభ్యుడు కిరణ్ మజుందార్ షా పీటీఐకు తెలిపారు.

ఇన్ఫోసిస్ కొత్త బాస్ వేతనమెంతో తెలుసా..?

 

ఇన్ఫోసిస్ ఎండీ ఇంకా సీఈఓ బాధ్యతల నుంచి విశాల్ సిక్కా తప్పుకున్న తరువాత కంపెనీ తాత్కాలిక సీఈఓగా యూబీ ప్రవీణ్ రావు నియమితులయ్యారు. తాజాగా ఆయన స్థానాన్ని సలిల్ పారేక్ భర్తీ చేసారు. 5 సంవత్సరాల పాటు ఈయన ఆ పదవీలో కొనసాగే వీలుంటుంది. ఈ కాలంలో రూ.3.25 కోట్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లతో పాటు రూ.13 కోట్ల వార్షిక పనతీరు ఆధారిత గ్రాంట్లు కూడా ఆయనకు లభిస్తాయని మజుందార్ షా తెలిపారు.

2017 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధకి వేతనాన్ని అందుకున్న సీీఈఓగా ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా రికార్డ్ సృష్టించారు. ఈయన వేతనం క్రింద రూ.42 కోట్లు, స్టాక్ ఆప్షన్స్ క్రింద 2 మిలయన్ డాలర్లను కంపెనీ చెల్లించింది.

TSCOPతో అరచేతిలో స్మార్ట్ పోలీసింగ్!

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఫిక్స్‌డ్‌ సాలరీ, ఇతర ప్రయోజనాలతోపాటు ప్రారంభ వేరియేబుల్‌ పే కింద 2.37 కోట్ల రూపాయలు ఆయన అందుకోనున్నారు. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా జనవరి 2 నుంచి విధుల్లో జాయిన్ అయిన సలిల్ పారేక్‌కు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఫిక్సడ్ వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ క్రింద రూ.2.37 కోట్లు అందనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

ఇన్ఫోసిస్ గురించి ఆసక్తికర విషయాలు

వాస్తవానికి ఇన్ఫోసిస్‌ను స్ధాపించిన వ్యవస్థాపకుల సంఖ్య 7. అయితే ఈ సంఖ్య చాలామందికి 6గా తెలుసు. ఇన్ఫోసిస్ స్థాపనకు కృషిచేసిన 7గురు వ్యవస్థాపకుల పేర్లను క్రంది చూడొచ్చు. ఎన్ఆర్ నారాయణ మూర్తి, నందన్ నిల్కనీ, ఎస్ గోపాల్ క్రిష్ణన్, కె దినేష్, ఎన్ఎస్ రాఘవన్, ఎస్‌డి షిబులాల్, అశోక్ అరోరా. ఈ ఏడుగురిలో ఒకరైన అశోక్ అరోరా 1988 వరకు ఇన్ఫోసిస్‌కు సేవలందించారు. తరువాతి క్రమంలో కంపెనీలోని తన మొత్తం షేర్లను ఇతర ప్రమోటర్లకు విక్రయించి అమెరికాకు వెళ్లిపోయారు.

దేశంలో రెండువ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ మొదటి రెండు సంవత్సరాల వరకు కంప్యూటర్ లేకుండానే సేల్స్ కార్యకలాపాలను నిర్వర్తించగలిగింది. ఇన్ఫోసిస్ 1992లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. 1993లో ఇన్ఫోసిస్ ఐపీఓ విలువ రూ.96. 1999లో ఇన్ఫోసిస్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్‌లో తొలి రిజిస్టర్ కాబడిన ఇండియన్ సంస్థగా గుర్తింపుపొందింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Infosys Ltd’s new chief executive officer (CEO) Salil Parekh has been given a Rs9.75 crore joining bonus and could earn up to Rs17.3 crore in the first year. His earnings could possibly double to Rs35.25 crore in the year ended March 2021, provided the former Capgemini executive steers the company well.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X