సామ్‌సంగ్ కొత్త యాప్ ‘SeeColors’

Posted By: BOMMU SIVANJANEYULU

సామ్‌సంగ్ తన క్యూఎల్ఈడి (QLED TV) టీవీ శ్రేణి కోసం సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. సీకలర్స్ (SeeColors) పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ లేదా కలర్ విజన్ డెఫీషియన్సీతో భాదపడే వారిని దృష్టిలో ఉంచుకుని సామ్‌సంగ్ ఈ అప్లికేషన్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా సీవీడీతో ఇబ్బందిపడుతోన్న యూజర్లు తమ విజువల్ డెఫీషియన్సీలను మరింత ఖచ్చితత్వంతో నిర్థారించుకునే వీలుంటుంది.

సామ్‌సంగ్ కొత్త యాప్ ‘SeeColors’

ప్రజల రోజువారి జీవనశైలిని మరింత సుఖమయం చేసే లక్ష్యంతో సామ్‌సంగ్ టెక్నాలజీ ఇంకా ఇన్నోవేషన్ పనిచేస్తోందని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ విజువల్ డిస్‌ప్లే బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ హియోన్‌గ్నామ్ తెలిపారు.

క్యూఎల్ఈడి టీవీల కోసం అభివృద్ది చేయబడిన సీకలర్స్ యాప్, ప్రపంచపు అతిపెద్ద ఆప్టికల్ సవాళ్లను తన లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా విజువల్ డిస్‌ప్లేలతో ఎదుర్కోగలుగుతుందని అన్నారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ కలర్ విజన్ డెఫీషియన్సీ స్థాయిని ఐడెంటిఫై చేయటంతో పాటు వ్యక్తిగతంగా నిర్థారణ చేసుకునే వీలుంటుందని సామ్‌సంగ్ తెలిపింది.

ఇదే క్రమంలో కలర్లైట్ టెస్ట్‌ (Colorlite Test)ను తన టీవీలతో పాటు మొబైల్ డివైస్‌లకు అడాప్ట్ చేసుకునేందుకు గాను ప్రముఖ ప్రొఫసర్ క్లారా వెంజెల్‌తో సామ్‌సంగ్ ఒప్పందం కుదర్చుకుంది. ఈమె టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్ బుడాపెస్ట్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకాట్రానిక్స్, ఆప్టిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇన్ఫర్మాటిక్స్ శాఖలకు నాయకత్వం వహిస్తున్నారు.

Redmi 5, 5 Plus లాంచ్ డేట్ షురూ !

టీవీ యూజర్లు సీకలర్స్ యాప్‌ను స్మార్ట్ టీవీ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుకోవచ్చు. గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్, ఎస్6 ఎడ్జ్+, ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఇంకా ఎస్8 స్మార్ట్ ఫోన్‌లను వినియోగించుకుంటోన్న యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను పొందే వీలుంటుంది.

ఈ యాప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ లేదా క్యూఎల్ఈడి టీవీకి కనెక్ట్ అయిన వెంటనే యూజర్ కలర్ విజన్ డెఫీషియన్సీ స్థాయిని బట్టి కలర్ సెట్టింగ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. హంగేరియన్ కంపెనీ అయిన కలర్లైట్ భాగస్వామ్యంతో సామ్‌సంగ్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

English summary
The company has also partnered with Professor Klara Wenzel who heads up the Department of Mechatronics.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot