షేక్‌స్పియర్ అతడు కాదు..గర్భాన్ని దాల్చిన అమ్మాయి: షేకయ్యే నిజాలు

By Hazarath
|

షేక్‌స్పియర్.. ఈ పేరు ప్రపంచానికి సుపరిచితమైన పేరు. శృంగార ,హాస్య నాటకాలతో, అలాగే సమకాళీన కవిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న గొప్ప రచయిత. ఆ రచయిత చనిపోయి దాదాపు నాలుగు వందల సంవత్సరాలయింది. ఇప్పటికీ ఆయనపై ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఆయన అతడు కాదు ఆమె అంటూ షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. అలాగే ఆయన సమాధి నుంచి ఆయన పుర్రెను ఎవరో తీసుకెళ్లడం ఇంకా షాకింగ్ కలిగిస్తోంది. ఇంకా ఆశ్చరక్యకరమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయేనాటికి గర్భాన్ని దాల్చడం..

Read more : ఇండియాలో పుట్టి ప్రపంచానికి వెలుగునిస్తున్న ఆవిష్కరణలు

1

1

షేక్‌స్పియర్ అసలు పేరు అమేలియా బస్సానో అని, ఆమె నల్లటి కురులు కలిగిన యూదు జాతి మహిళని, అమె వంశస్థులు క్వీన్ ఎలిజబెత్ -1 కాలంలో సంగీత విద్వాంసులుగా పనిచేశారని జాన్ హడ్సన్ షేక్‌స్పియర్ డార్క్ లేడీ' పేరుతో రాసిన తాజా పుస్తకంలో వెల్లడించారు.

2

2

ఆమె లార్డ్ చాంబెర్లేన్ హెన్రీ కేరీని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. నాటి ఇంగ్లీష్ థియేటర్‌కు హెన్రీ కేరి ఇంచార్జిగా పనిచేశారని, అందుకనే ఆమె నాటకాలను అనేకం ఆ థియేటర్లో ప్రదర్శించారని చెప్పారు.

3

3

షేక్‌స్పియర్ నాటకాల్లో ప్రతిబింబించే ఇటలీ సంస్కృతి గురించి ఇంగ్లండ్లో పుట్టిపెరిగి ఇక్కడే అసువులు బాసిన బస్సానోకు ఎలా తెలుసుననే అనుమానానికి జాన్ హడ్సన్ వివరణ ఇస్తూ అమేలి కుటుంబం ఇటలీ నుంచి వలస వచ్చిందని, అందుకనే ఆమెకు ఇటలీ సంస్కృతి గురించి తెలుసని చెప్పారు.

4

4

ఒథెల్లో నాటకంలో ఎమెలీ అనే, మర్చంట్ ఆఫ్ వెనీస్లో బస్సానో అనే క్యారెక్టర్లు ఆమె పేరును ప్రతిబింబిస్తున్నాయని కూడా హడ్సన్ తెలిపారు.

5

5

క్రిస్టఫర్ మార్లో అనే ప్రసిద్ధ నాటక రచయితతో బస్సానోకు ఎఫైర్ కొనసాగించారని, ఆమె 1645 లో చనిపోవడానికి ముందు గర్భవతి అని కూడా హడ్సన్ పేర్కొన్నారు.

6

6

దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం మరణించిన షేక్‌స్పియర్ ఎవరనే విషయంలో ఇప్పటికే ఎన్నో థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవాలను తెలుసుకునేందుకు స్టార్ట్ రోడ్ లోని ట్రినిటీ చర్చిలోవున్న షేక్‌స్పియర్ సమాధిపై కూడా చాలా పరిశోధనలు జరిగాయి.

7

7

ఇక్కడ కూడా ఆయన సంచలనంగా మారారు. ఆయన సమాధి నుండి పుర్రె మాయమయ్యింది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా పురావస్తు తత్వవేత్తలు పరిశోధించగా 1794 లోనే ఆయన పుర్రె మాయం అయిందనే విషయం వెలుగుచూసింది.

8

8

ఆయన సమాధిని అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పుర్రెను దొంగలించినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అత్యాధునిక స్కానర్లతో షేక్ స్పియర్ సమాధిని పరీక్షించినప్పుడు సమాధిలోని ఆయన పెర్రె స్థానం ఖాళీగా కనిపించిందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన కెవిన్ కలిస్ చెబుతున్నారు.

9

9

అయితే .. ఈ వార్తల్ని షేక్ స్పియర్ సమాధి ఉన్న లండన్ లోని హోలీ ట్రినిటీ చర్చ్ ప్రతినిధులు మాత్రం తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. నిరాధార వార్తల్ని ప్రచారం చేయటం సరికాదన్న మాట వినిపిస్తున్నా .. షేక్ స్పియర్ సమాధి మీద అధ్యయనం చేస్తున్న పరిశోధక బృందం మాత్రం తాము కనుగొన్న అంశం నిజమని చెబుతున్నారు.

10

10

ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసలు ఆమె స్త్రీయా? పురుషుడా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. వాస్తవాస్తవాలు తేలాలంటే మరెన్నేళ్లు పరిశోధనలు జరగాలో! అలాగే మరెన్ని నిజాలు బయటకు రావాలో ముందు ముందు కాని తెలియదు.

11

11

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Shakespeare’s missing skull – the tech behind the investigation

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X