ప్రపంచాన్ని వణికిస్తున్న నార్త్ కొరియా లోపలి నిజాలు

Written By:

నార్త్ కొరియా..ఈ పేరు ఇప్పుడు ప్రపంచానికి ఓ వణుకు.. అను నిత్యం అత్యంత భయంకరమైన ప్రయోగాలను చేస్తూ ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇటీవలే అమెరికాను , సౌత్ కొరియాను ఒకేఒక్క బటన్ తో బూడిద చేస్తామని సవాల్ కూడా విసిరారు. ఇది బయటి ప్రపంచానికి తెలిసిన నిజాలు..కాని నార్త్ కొరియా లోపలికి వెళితే అక్కడి జనాల బాధలు. సైనికుల ఆవేదనను గమనిస్తే ఒళ్లు ఒక్కసారిగా జలదరిస్తుంది. అత్యంత విషాదకర ఈ చిత్రాలను ఫోటోగ్రాపర్ ఎలిక్ లాఫరోజ్ బయటి ప్రపంచానికి తీసుకొచ్చారు.

Read more at: సైన్స్‌కు, టెక్నాలజీకి సవాల్ విసురుతున్న మిస్టరీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

నార్త్ కొరియన్ ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పవర్ పుల్ ఆర్మీగా చెప్పుకుంటారు కాని. అక్కడికి వెళ్లి చూస్తే సైనికులు ఇలా లేబర్ల కన్నా దారుణంగా పనిచేస్తుంటారు.

2

పేదరికం చాలాచోట్లనే ఉంటుంది .కాని నార్త్ కొరియాలో ఎంత దారుణంగా ఉంటుందో ఈఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

3

అక్కడ చిన్న పిల్లలే కూలీలు..వారే తోట పనులు చేస్తారు. ఇది ఎంత దయనీయమంటే అంటే దయనీయం

4

అక్కడ అను నిత్యం ఎంతో మంది పిల్లలు పోషకాహార లోపంతో భాదపడుతూ ఉంటారు. దీనికి నిలువెత్తు సాక్యం ఈ ఫోటో.

5

వీరు కనీసం వేసుకోడానికి బట్టలు కూడా సరిగా ఉండవు..నిరంతరం నిరుపేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాని బయట మాత్రం చాలా పవర్ పుల్ దేశమంటూ గొప్పలు చెబుతారు. 

6

పాల బుగ్గల చిన్నారులను చిత్రహింసలు పెట్టీ మరి పనిచేయించుకుంటారు...అక్కడి పిల్లలు ఎంత నిర్జీవంగా ఉన్నారో ఈ ఫోటోలను చూస్తే తెలుస్తుంది.

7

సైనికుల మధ్యలో ఓ మహిళ నిలబడి ఉంది గమనించారా..ఆర్మీలోకి మహిళలను అంగీకరించరు అక్కడ..ఆమె అలా ఎందుకు నిలబడిందో ఎవరికీ తెలియదు.

8

నార్త్ కొరియా మిలిటరీకి సంబంధించిన ఫోటో ఇది. బస్సు ఇలా ఆగిపోతూ ఉంటే సైనికులు ఎప్పుడూ నెడుతూ ఉంటారు.అక్కడ అనునిత్యం ఇది జరుగుతూ ఉంటుంది. 

9

సైనికులు లేని ప్రాంతంలో ఫోటోలు తీస్తున్నా వారు వద్దని హెచ్చరిస్తారు. మా అవస్థలు ప్రపంచానికి తెలియనివ్వకండి అని చెబుతారు.

10

సైనికులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఫోటో. అక్కడ సిగిరెట్లు కాల్చడం నిషేధం. కాని సైనికులు మాత్రం యధేచ్ఛగా కాలుస్తారు.

11

ప్యాంగ్ యాంగ్ లోని ఈ డాల్ఫినేరియమ్ ని ఎవరైనా సందర్శిస్తే అక్కడ ఉన్న వారిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ 99 శాతం మంది సైనికులే ఉంటారు.

12

సైనికులు విశ్రాంతి తీసుకునేది ఎక్కడో వారికే తెలియదు. ఇటువంటి ఫోటోలు తీస్తున్నారనే అక్కడ ఫోటోలు తీయడం బ్యాన్ చేశారు. కాని ఫోటోగ్రాపర్ చాకచక్యంగా ఫోటోలను తీసారు.

13

అక్కడ జనాలకు కనీస సౌకర్యాలు ఉండవు. ఆరుబయటే స్నానం చేస్తారు. వారు ప్యాంగ్ యాంగ్ దగ్గర ఉన్న నదిలోనే స్నానాలు చేస్తారు. ఇల్లు వాకిలి అంతా బయటే వారికి. ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా ఫోటో గ్రాపర్ ఇలా క్లిక్ మనిపించారు. 

14

ఇది ఒక్కటే వీరికి రేర్ గా దొరికే పుడ్. చిన్న చిన్న సరస్సుల్లో ఇలా చేపలను పట్టుకుని వాటితో తమ పొట్టను నింపుకుంటుంటారు.

15

ఇలా రోడ్డు మీద తమ బతుకుబండిని లాగిస్తున్న వారు చాలామందే ఉంటారు..ఇలా నడిరోడ్డు మీద ఏదైనా ఈడ్చుకుని పోవాల్సిందే.

16

నార్త్ కొరియాలో ఓ మనిషి చిబో సముద్రం దగ్గర సేత తీరుతున్న దృశ్యం. ఈ ఫోటోను చూసిన చాలామంది చనిపోయారని అనుకున్నారు పాపం.

17

నార్త్ కొరియాలో సైనికులు లేని ప్రాంతం ఇది .ఇక్కడ అనుక్షణం పేదరికం తాండవిస్తూ ఉంటుంది. అక్కడి హోటళ్లు పాత ఇల్లులాగా మూసివేయబడి ఉంటాయి. పిల్లలు తిండికోసం ఇలా రోడ్ల మీదకు పరుగులు పెడుతుంటారు.

18

కార్లు రోడ్డు మీద ఇలా అత్యంత వేగంతో పరుగులు పెడుతుంటే చిన్న పిల్లలు వాటిని పట్టించుకోకుండా రోడ్ల మీద ఆటలు ఆడుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో అక్కడి వారికి తెలియదు.

19

నార్త్ కొరియాలో నిరంతరం కరువు తాండవిస్తూ ఉంటుంది. పనికోసం అక్కడి ప్రజలు నిరంతరం ఇలా క్యూ కడతారు.. తమ వంతు వచ్చేదాకా ఎదురుచూస్తుంటారు.

20

టెక్నాలజీ గురించి అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో సహకారం: Eric Lafforgue

English summary
Here Writeing Socially viral Haunting photographs inside North Korea
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot