2000 సంవత్సరాల క్రితం నాటి అద్భుతమైన ఆవిష్కరణలు

Written By:

టెక్నాలజీ ఈ నాటిది కాదు.. అది ఎప్పుడో మొదలైంది. కాగా అది నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎందరో ఆవిష్కర్తలు తమ తమ ప్రతిభతో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వారి ఆవిష్కరణలే సమాజానికి ఇప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నాయి. మొదటి శతాబ్దంలో టెక్నాలజీ ఎంత బాగా వాడారంటే దాన్ని చూసిన వారు అబ్బురపోవాల్సిందే. వారి ఆవిష్కరణలను చూసిన ఇప్పటితరం ముక్కున వేలేసుకోవాల్సిందే. కావాలంటే పురాతన కాలం నాటి ఆవిష్కరణలు మీరే చూడండి తెలుస్తుంది.

Read more: మీ తెలివికి అసలైన పరీక్ష పెట్టే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

1వ శతాబ్దంలో ఈ స్టీమ్ ఇంజిన్ ను హీరో అలెగ్జాండ్రియా కనుగొన్నారు. ఇతను గ్రీకు గణితవేత్త. ఫస్ట్ సీమ్ ఇంజిన్ ఆవిష్కర్త కూడా ఇతనే. దీన్నే ఏయోలైపిల్ అని కూడా పిలుస్తారు. ఇది నిమిషానికి 1500 రౌండ్లు రొటేట్ అవుతుంది కూడా.

2

ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెలిస్కోప్.3000 సంవత్సరాల క్రితం దీన్ని తయారుచేశారు. దీనికి కేవలం మాగ్నిటిక్ గ్లాసును వాడారు. దీని పేరే నిమురుడ్ లెన్స్. ఇదొక రంగులేని పలకం.ఇది మంటలను రప్పించడానికి వాడేవారు. దీన్నే శాస్ర్తవేత్తలు భూతద్దంగా చాలా సంవత్సరాల వరకు వాడారు.

3

ఇది అత్యంత పురాతనమైన స్కాట్లాండ్ క్యాలండర్. 10 వేల సంవత్సరా క్రితం దీన్ని తయారుచేశారు. ఇది అంత చందమామలాగా చుట్టూ నక్షత్రాలతో ఉంటుంది. నిండు చందమామ అలాగే సగం చందమామలను బట్టి కాలాన్ని నిర్ణయించేవారు.

4

దీన్ని 2000 సంవత్సరాల క్రితం మధ్యధార సముద్రంలో కనుగొన్నారు. ఇప్పుడు వస్తున్న కాంక్రీట్ కన్నా చాలా బలంగా గట్టిగా ఉంటుంది.

5

ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి మెటల్ . ఇప్పుడున్న వాటితో పోలిస్తే ఇది చాలా గొప్పది. ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే దీని కెపాసీటీ అర్థం చేసుకోవచ్చు.

6

2000 సంవత్సరాల క్రితం భూకంపాన్ని కనుగొనేందుకు ఆనాటి శాస్ర్తవేత్తలు డిటెక్టర్ ను తయారు చేశారు. వారి తెలివికి నిజంగా జోహర్లు చెప్పవచ్చు.

6

అప్పట్లోనే అత్యధ్భుతమైన రాళ్లను శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఇదొక మ్యాజికల్ రత్నం. దీని ఆధారంగా సూర్యాస్తమయం అలాగే సూర్యోదయం ఎప్పుడు అవుతందో నిర్థారిస్తారు.

8

ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి బ్యాటరీ. దీన్ని ఎలక్ట్రిక్ బ్యాటరీగా ఉపయోగించారని తెలుస్తోంది. బాగ్గాద్ లో దీన్ని 250 బిసి 224 ఏడీ మధ్యలో వాడారని ఆధారాలు చెబుతున్నాయి.

9

దాదాపు 1600 సంవత్సరాల క్రితం రోమన్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించారు. కాఫీ కప్పులపై ఇలా రకరకాల ప్రయోగాలను కూడా చేశారు.

10

గ్రీక్ ఐస్ ల్యాండ్ లో దీన్ని 1900 సంవత్సరంలో కనుగొన్నారు. ఇది గేర్లతో నిండిన ఓ బలమైన లోహ పరికరం. దీనికి దాదాపు 30 గేర్లు అలాగే ఓ హ్యండిల్ సిస్థం ఉంటుంది. ఇది రాశి ఫలాలను చూపించే పరికరం అయి ఉంటుందని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ten amazing inventions from ancient times
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot