ఇది కోలుకోలేని షాక్ : స్మార్ట్‌ఫోన్లే తుఫాకులు
మీరు నిజంగా షాకయ్యే వార్త ఇది. స్మార్ట్ ఫోన్లే తుఫాకులుగా మారబోతున్నాయి. మీరు దీంతో మీరు ఎవర్నైనా షూట్ చేయవచ్చు. మీరు షూట్ చేసిన తరువాత ఆ తుఫాకీని స్మార్ట్ ఫోన్ లాగా మీ జేబులో పెట్టుకోవచ్చు. ఈ పిస్టల్ త్వరలో మార్కెట్లోకి రానుంది..అయితే ఇది వస్తే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
Read more : 2000 సంవత్సరాల క్రితం నాటి అద్భుతమైన ఆవిష్కరణలు

1
ఇది అచ్చం నూటికి నూరుపాళ్లు స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. ఏ ప్యాకెట్లో పెట్టుకున్నా, ఎక్కడికి తీసుకెళ్లినా ఎవరైనా సరే దీన్ని స్మార్ట్‌ఫోనే అంటారు. అచ్చం స్మార్ట్‌ఫోన్ మాదిరిగా కనిపించేలా దీన్ని తయారు చేశారు.

8
దీనికి ఓ డమ్మీ కెమెరా లెన్స్‌ను, ఇయరింగ్ సాకెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి ఇది డబుల్ బారెల్, 380 కాలిబర్ పిస్టల్. దీంతో ఎవరినైనా ఇట్టే షూట్ చేసి చంపొచ్చు.

2
ఇది మూసి ఉన్నప్పుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. సేఫ్టీ లాక్ ఓపెన్ చేస్తే పిస్టల్‌లా తయారై ట్రిగ్గర్ బయటకు వస్తుంది. ఈ అత్యాధునిక పిస్టల్‌ను ‘ఐడియల్ కన్సీల్' అనే కంపెనీ తయారు చేసింది.

9
స్థానిక ఉత్పత్తులతోనే దీన్ని తయారు చేశామని, పేటెంట్ రాగానే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. దాదాపు 27వేల రూపాయలకు అమ్ముతామంటూ ధరను కూడా ప్రకటించేసింది.

3
అంతా బాగానే ఉంది గానీ అసలే తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న అమెరికాలో ,అలాగే టెర్రరిస్టుల చేతుల్లో పడితే జరిగే విధ్వంసానికి అంతు ఉంటుందా? స్మార్ట్‌ఫోన్ లాంటి ఈ పిస్టల్‌ను బహిరంగంగా సెక్యూరిటీ చెకప్ గుండానే విమానాల్లోకి తీసుకుపోవచ్చు. అప్పుడు జరిగే విధ్వంసక పరిణామాలను సులభంగానే ఊహించవచ్చు.

4
ఇలాంటి భయాందోళనలనే వ్యక్తం చేస్తున్నారు ‘కోయలిషన్ టు స్టాప్ గన్ వాయలెన్స్' సంస్థ డిప్యూటి కమ్యూనికేషన్స్ డెరైక్టర్ ఆండ్రూ ప్యాట్రిక్. ఈ పిస్టల్‌కే గనుక పేటెంట్‌ను కల్పించినట్లయితే గన్ సంస్కృతి తీవ్రంగా పెరిగిపోతోందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు.

5
అంతేకాకుండా పిస్టల్ పెట్టుకున్న బ్యాడ్ బాయ్ ఎవరో, స్మార్ట్‌ఫోన్ పెట్టుకున్న గుడ్‌బాయ్ ఎవరో గుర్తుపట్టడం కూడా కష్టమని ఆయన అన్నారు. ఆ పరిస్థితే వస్తే, ఎవరూ జేబులోనుంచి స్మార్ట్‌ఫోన్ తీసినా అది పిస్టల్ అనుకొని భయపడాల్సి వస్తుందని ప్యాట్రిక్ వ్యాఖ్యానించారు.

6
భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి భయాందోళనలే వ్యక్తం చేస్తున్నారు. వారి భయాందోళనలను తాము అర్థం చేసుకున్నామని, శత్రువుల నుంచి ముప్పున్న వారికి కేవలం ఆత్మరక్షణార్థమే వీటిని విక్రయిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

7
అయితే ఈ పిస్టళ్లు వారికి మాత్రమే పరిమితమవుతాయన్న గ్యారెంటీ ఏమీ లేదుకదా! అయినా లెసైన్స్ తుపాకుల పట్ల మోజు చూపించేవారు మాత్రం ఈ పిస్టళ్లు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయా! అని ఎదురుచూస్తున్నారు.

10
మరి ముందు ముందు ఇది ఎటువంటి పరిస్థితులకు దారిీస్తుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








