భూమి పుట్టుకపై మీకు తెలియని రహస్యాలు..

By Hazarath
|

భూమి ఎప్పుడు పుట్టింది.. ఎలా పుట్టింది. అసలు భూమి వయస్సెంత ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలని చాలామందికి ఎంతో ఆత్రుత ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం చాలావరకు ఎవరికీ తెలియదు.. కొంతమంది కొన్ని రకాల సమాధానాలు ఇచ్చినా అవి అందర్నీ సంతృప్తి పరచకపోగా మరిన్ని సమాధానాల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ప్రకారం ఎర్త్ డే సంధర్భంగా భూమి పుట్టుక గురించి కొన్ని వివరాలు ఇస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Read more: వచ్చే 68 రోజుల్లో భూమికి పెను ఉత్పాతాలు : కారణం ఏంటంటే..

1

1

ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త, తన ''Age of the Earth'' అనే గ్రంధంలో భూమి వయసుకు సంబంధించి ఇప్పటి సైన్సు చెప్పే లెక్కలు ఏనాడో హిందూదేశ పండితులు చెప్పిన లెక్కలు సరిపోతున్నాయి అంటూ రాశారు.

2

2

ఇక మన పంచాంగంలో భూమి వయసు 1972949079 సంవత్సరాలని రాస్తారు. అంటే 197 కోట్ల 29 లక్షలకు పైగా సంవత్సరాలన్నమాట. సైన్సు ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఎక్కువ. అంటే 200 కోట్ల సంవత్సరాలు.

3
 

3

కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు ఏ సాంకేతిక సౌలభ్యము, పరికరాల అవసరం లేకుండానే ఖచ్చితమైన లెక్కలు వేశారు. భూమి వయసు, గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల తీరుతెన్నులు మొదలైన విషయాలను వివరించారు. 

4

4

ఇక భూమి పుట్టి లక్షల సంవత్సరాలయింది. యుగాలు ఒక దాని తరువాత మరొకటి వచ్చాయి. సుమారు 6000 సంవత్సరములు భూమి వయస్సుంటుందని స్పష్టముగా బైబిలు భోధిస్తున్నది, కలిపిన లేక తీసివేసిన కొన్ని వందల సంవత్సరములు మాత్రమే తేడా ఉంటుంది.

5

5

మరికొందరు భూమి పుట్టలేదు. ఏర్పడింది. ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం (big bang) ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం (universe)గా మారింది. అని చెబుతారు.

6

6

విశ్వం క్రమేపీ విస్తరిస్తున్న క్రమంలో నెబులార్‌ వాయువు మేఘాలుగా పదార్థం క్రోడీకరించుకుంది. ఆ నెబులార్‌లే నక్షత్ర రాశులుగా మారాయి. ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్లెంలాగా ఏర్పడింది. అలాంటిదే సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్లెం (solar disc) రూపుదిద్దుకుంది.

7

7

నెబులా అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయనీ, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదనీ అది క్రమక్రమంగా ద్రవంగానూ, ఘనపదార్థంగానూ మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని చదువుతాం.

8

8

అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమేనని చెబుతారు.

9

9

వారి అభిప్రాయం ప్రకారం భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminescent). కానీ కేంద్రక సంలీన(nuclear fusion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్‌) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుందని వాదిస్తారు.

10

10

ఉపనిషత్తుల్లో వేరే విధంగా ఉంది. విశ్వమంతా చైతన్యమేనని చెబుతోంది. మరి ఈ చైతన్యమంటే ఒక వ్యక్తి కాదు. దీనికి భిన్నంగా మరో పదార్థం లేదు. ఈ చైతన్యంతోనే ప్రకృతి అని మనం పిలిచే అనిర్వచనీయమైన శక్తి ఏర్పడిందనీ అందులో మొట్టమొదట మనం చూసే అనంతమైన ఆకాశం ఏర్పడిందనీ చెప్పారు.

11

11

తర్వాత ఆకాశాద్‌ వాయు..అంటే ఆ స్పేస్‌లో వాయువులు ఏర్పడ్డాయట. తర్వాత వాయో: అగ్ని: - అంటే ఆ వాయువులు అగ్ని రూపంగా మారాయి. అగ్నే: ఆప:- అంటే ఆ అగ్నులే ద్రవీభవించి నీరుగా ఏర్పడింది. ఆ ద్రవపదార్థమే క్రమక్రమంగా భూమిగా మారింది. పృథివ్యా ఓషదయ:- ఈ భూమి ప్రకృతిలోని వృక్షప్రపంచానికి ఆధారమైందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

12

12

జీవుల పుట్టుక గురించి 19వ శతాబ్దంలో డార్విన్‌ అనే శాస్త్రవేత్త  ప్రకృతి నుంచి క్రమక్రమంగా అనేక జీవులు ఏర్పడ్డాయని చెప్పాడు. ఉపనిషత్తుల్లో వివిధ జంతువులు ఏర్పడిన విధానాన్ని డార్విన్‌ చెప్పినట్లుగా చింపాంజి లాంటి జంతువుల నుండి మనిషి వచ్చాడని చెప్పకపోయినా వృక్షప్రపంచం నుంచే జంతుప్రపంచం వచ్చినట్లు చెప్పారు.

13

13

మరి కొందరు అభిప్రాయం ప్రకారం విశ్వంలోని భూమి మరియు ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళి మరియు ఇతర వాయువుల సమూహము) నుండి ఆవిర్భవించినవి. ఈ ధూళి యొక్క సమూహము నుండి భూమి అవతరించడానికి 10-20 మిలియన్ సంవత్సరాలు పట్టిందని చెబుతారు.

14

14

భూమి యొక్క బాహ్య పొర మొదట్లో వేడికి కరిగి ఉండేది. తరువాత అది చల్లబడిన తరువాత గట్టిపడి భూమి మీద వాతావరణంలో నీరు కూడుకున్నది. దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడని వాదిస్తారు.

15

15

భూమిలో 10% బరువుండి, బుధ గ్రహం అంత పెద్దగా ఉండే 'తియా' అనే ఒక ఉల్క భూమిని ఢీకొనడం వలన అందులో కొంత భాగం భూమిలో కలిసి మిగతాది విశ్వంలోకి ఎగిరి పోయినది. అప్పుడు వెలువడిన పదార్ధముల నుండి చంద్రుడు ఆవిర్భవించాడని చెబుతారు.

16

16

ఇక భూభ్రమణం గురించి అంటే.. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది అనే అంశాన్ని మొట్టమొదట వెల్లడి చేసింది ఆర్యభట్టు. అంతేకాదు, చంద్రమండలం గురించి కూడా ఆర్యభట్టు ఎన్నో విషయాలను తెలియజేశాడు.

17

17

చంద్రుడికి స్వయం ప్రకాశశక్తి లేదని, సూర్యకాంతి చంద్రునిమీద పడటంవల్లనే చంద్రునికి వెలుగు వస్తుందని వివరించాడు. అలాగే భూమి, చంద్రుడి నీడల వల్లనే గ్రహణాలు వస్తాయని చెప్పాడు.

18

18

ఏది ఏమైనా భూమి పుట్టుక అనేది దాదాపు బిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగిందని తెలుస్తోంది. ఈ భూమి మనుషులతో సహా లక్షలాది జీవరాశులకు నిలయం. ఇక మొత్తం విశ్వంలో జీవానికి అనువైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే భూమి మాత్రమే.

19

19

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write The Origin and Evolution of Earth

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X