రూ.700కే కంప్యూటర్ వచ్చేస్తే..?

రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ' (Raspberry Pi Zero W) పేరుతో సరికొత్త బోర్డ్ ఆధారిత మినీ కంప్యూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రాస్ప్‌బెర్రీ పీఐ ఫౌండేషన్ ( Raspberry Pi Foundation) ప్రకటించింది. ఈ మినీ కంప్యూటర్ ధర 10 డాలర్లలోపే ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.700 కంటే తక్కువే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Raspberry Pi

కంప్యూటర్ హార్డ్‌వేర్ విభాగంలో విప్లవాత్మక మార్పులు కంప్యూటర్ హార్డ్‌వేర్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రాస్ప్‌బెర్రీ పీఐ (Raspberry Pi) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సింగిల్ బోర్డ్ కంప్యూటర్

క్రెడిట్ కార్డు సైజుల ఉండే ఈ సింగిల్ బోర్డ్ కంప్యూటర్ అనేక DIY ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 

వై-ఫై, బ్లుటూత్ సౌకర్యాలతో..

2015లో లాంచ్ అయిన రాస్ప్‌బెర్రీ పీఐ జీరో బోర్డుతో పోలిస్తే రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0 ఇన్‌బిల్ట్ కనెక్టువిటీ ఫీచర్లు అదనంగా ఈ మినీ కంప్యూటర్‌లో జతయ్యాయి.

రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్

BCM2835 అప్లికేషన్ ప్రాసెసర్ (1GHz ARM11 కోర్), 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ స్లాట్, మినీ HDMI పోర్ట్, మైక్రో యూఎస్బీ ఆన్ ద గో పోర్ట్, మైక్రో యూఎస్బీ పవర్ పోర్ట్, HAT-compatible 40 పిన్ రీడర్, కాంపోజిట్ వీడియో, రీసెడ్ హెడర్స్, సీఎస్ఐ కెమెరా కనెక్టర్, వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0.

జీరోఫోన్ (ZeroPhone) పేరుతో మరో ఆసక్తికర ప్రాజెక్ట్

జీరోఫోన్ (ZeroPhone) పేరుతో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ Hackadayలో లిస్ట్ అయ్యింది. Raspberry Pi కంప్యూర్ బోర్డ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ ఖర్చుతో మీరే ఒక స్మార్ట్‌ఫోన్‌ను చేసుకునే వీలుంటుంది.

విడిభాగాలతో ఈ జీరోఫోన్‌ను తయారు చేసుకోవచ్చు..

eBay, Amazon వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లలో దొరికే విడిభాగాలతో ఈ జీరోఫోన్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విడిభాగాల విలువ కూడా రూ.3,000లోపే ఉంటుంది. ఈ జీరోఫోన్‌లో పొందుపరిచిన యూజర్ ఇంటర్‌ఫేస్ Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఈ సులువైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను యాప్ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించటం జరుగుతోంది.

కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అవుతుంది...

ఈ జీరోఫోన్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి DebianJessie అనే యునిక్స్ తరహా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ను బేస్ చేసుకుని Raspbian Linuxను రూపొందించారు. ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి Raspberry Pi కోసం ఆప్టిమైజ్ చేయటం జరిగింది.

కాల్స్, మెసేజింగ్, అలారమ్ క్లాక్

ఈ జీరోఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అలారమ్ క్లాక్, క్యాలెండర్, ఫోన్‌బుక్, ఫైల్ మేనేజర్, వెబ్ బ్రౌజర్, మ్యూజిక్ ప్లేయర్ వంటి అవసరమైన సదుపాయాలు కూడా ఉంటాయి. లైనక్స్ కంప్యూటర్ ఆధారంగా రూపుదిద్దుకునే ఈ జీరోఫోన్‌లో ARM కంపాటబుల్ యాప్స్‌ను కూడా రన్ చేసుకోవచ్చు.

జీరోఫోన్ నిర్మాణానికి అవసరమైన విడిభాగాలు..

Raspberry Pi Zero కంప్యూటర్ బోర్డ్, SIM800 మాడ్యుల్స్ వై-ఫై నిమిత్తం ESP8266-12E 2-లేయర్ పీసీబీ ATMega328P ఎల్ సీడీ స్ర్కీన్, బ్యాటరీ, TP4056 బ్యాటరీ ఛార్జర్, కీప్యాడ్ బటన్స్, 2.54 హెడర్స్.

ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు

ఈ ఫోన్‌ను అసెంబుల్ చేసే విధానంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Raspberry Pi Zero W Is a Wireless Computer for $10. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot