మొదటి రాకెట్ టిప్పు సుల్తాన్‌దే

Written By:

ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేకమైన గుర్తింపే ఉంది. ఇక్కడ, అన్ని రంగాల్లో రాణిస్తోన్న అపర మేధావులు ఉన్నారు. దశాబ్థాల కాలంగా అత్యుత్తమ శాస్త్రవేత్తలను భారత్ అందిస్తూవస్తోంది. టెక్నాలజీ రంగంలోనూ భారతీయలు సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

Read More : ఆధార్ కార్డుతో ఏం పనులు చేయొచ్చంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త శివా అయ్యదురై 1979లో ఎలక్ట్రానిక్ వర్షన్ ఇంటర్ ఆఫీస్ మెయిల్ సిస్టంను అభివృద్థి చేసారు. దీని పేరే "EMAIL".

 

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

బెంగాల్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్ర బోస్ 1895లో ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాల గురించి మొదటి ప్రజా ప్రదర్శనను ఇచ్చారు. చంద్రబోస్ అభివృద్ధి చేసిన Mercury Cohererను మార్కోనీ ఉపయోగించుకుని రేడియో సిగ్నల్స్ ను రాబట్టగలిగారు.

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

కంప్యూటర్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తోన్న ఇంటెల్ పెంటియమ్ చిప్‌ను అభివృద్థి చేసిన వారు వినోద్ దామ్. ఈయన్నే 'Father of Pentium Chip'గా కూడా పిలుస్తారు.

 

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

యూఎస్బీ స్టిక్ మనందరి ఆధునిక జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. డేటా స్టోరేజ్ ఇంకా షేరింగ్ కు ఉపయోగపడుతున్న ఈ యూఎస్బీ స్టిక్ ను కనుగొన్నది ఇండియన్ - అమెరికన్ శాస్త్రవేత్త అజయ్ భట్.

 

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

ఫార్చ్యూన్ పత్రిక ప్రచురించిన ఏడుగురు అన్‌ సంగ్ హీరోలలో డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ ఒకరు. ఫైబర్ ఆప్టిక్స్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించిన ఈయనకు ‘Father of Fiber Optics'గా గుర్తింపు ఉంది.

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

‘చరిత్రలో మొదటిసారి బ్రిటీషు సైన్యం పైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించాడు. అది చూసిన బ్రిటీష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లను నిర్మాణానికి అంకురార్పణచ చేసారు' - వికీపీడియా

 

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

గింజల నుంచి దూదిని వేరు చేసే కాటన్ జిన్ మెచీన్‌ను భారతీయులు 500 ADలోనే అభివృద్ది చేసినట్లు పురావస్తు శాఖ చెబుతోంది.

 

భారతీయ శాస్త్రవేత్తల సాధించిన టెక్నాలజీ ఆవిష్కరణలు

డెస్క్స్‌గా మారిపోయే కార్డ్‌బోర్డ్ బాక్సులను గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం DDB India అనే స్వచ్ఛంద సంస్థ  తయారు చేసి పంపిణీ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 10 Important Technological Inventions Were Actually Made By Indians. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot