ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ వాడుతున్నారా..ఈ న్యూస్ తప్పక చదవండి

By Gizbot Bureau
|

దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ తన కస్టమర్లు వెంటనే మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది.

ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు
 

మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి కస్టమర్లు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్‌బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో

2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టినట్టు చెప్పింది. ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని.. లేదంటే ఇప్పుడు ఉన్న కార్డులు బ్లాక్ అవుతాయని కస్టమర్లకు తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది.

గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు

ఇదిలా ఉంటే కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ 8 నుంచి 7.90 శాతానికి తగ్గనుంది. ఈ వడ్డీతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధామై ఉండే కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గతాయని ఎస్‌బీఐ తెలిపింది.

ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం 8వ సారి 
 

కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఎస్‌బీఐకి ఇది 8వ సారి. ఇక బ్యాంకులకు నిధులు లభించే రేటునే ఎంసీఎల్‌ఆర్ అంటారు. ఈ క్రమంలోనే తాము దేశంలోనే అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
These SBI debit cards will get deactivated by December 31

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X