‘లీ’ సూపర్ కార్..

Written By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లీఇకో (ఎల్ఈటీవీ) తన మొదటి సూపర్ కార్‌ను బీజింగ్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేకమైన ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును వచ్చే వారం జరిగే బీజింగ్ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ కారు గురించి పలు ఆసక్తికర విషయాలు...

Read More : 6జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, త్వరలో భారత్‌కు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘లీ’ సూపర్ కార్.. LeSee car

తన సూపర్ కార్ LeSee car తయారీకి సంబంధించి అస్టోన్ మార్టిన్, ఫారాడే ఫ్యూచర్‌లతో లీఇకో ఒప్పందం కుదుర్చుకుంది.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

LeSee car డ్రైవింగ్ కాబిన్ భాగంలో పెద్ద ఎల్ఈడి డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఈ వెహికల్ స్వతహాగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

ఈ కారు పూర్తి ఆటోమెటిక్ డ్రైవింగ్ ఫంక్షన్స్‌ను ఆఫర్ చేస్తోంది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా సెల్ఫ్ పార్కింగ్, ఫేషియల్ రికగ్నిషన్, పాత్ రికగ్నిషన్, ఎమోషన్ రికగ్నిషన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కారులో పొందుపరిచారు.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

ఈ సూపర్ కారులో ఫోల్డబుల్ స్టీరింగ్ వీల్ డిజైన్‌ను ఏర్పాటు చేసారు. స్టీరింగ్ వీల్ ఫోల్డ్ అయినట్లయితే కారు ఆటోమెటిక్ గా సెల్ఫ్ - డ్రైవింగ్ మోడ్‌లోకి వెళ్లిపోతోంది.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

ఎలక్ట్రిక్ బ్యాటరీ కాన్సెప్ట్ పై పనిచేసే తమ LeSee car టెస్లా మోటార్ ఇంక్ మోడల్ ఎస్‌తో పోటీపడగలదని లీఇకో ధీమావ్యక్తం చేస్తోంది.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

ఈ కారులో ప్రయాణించే ప్రతి పాసెంజర్ విడివిడిగా మ్యాజిక్ అలానే వీడియోలను వీక్షించే వెసలుబాటు కల్పించారు.

‘లీ’ సూపర్ కార్.. LeSee car

ఈ కారు సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలా కూడా ఉపయోగపడగలదని లీఇకో చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things to know about LeEco's first driverless car. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot