WhatsApp చాట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయాలు

|

ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా యాప్ లలో చాటింగ్ కోసం అధికంగా ఉపయోగించే వాటిలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ చాట్‌లను బ్యాకప్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. కాని ఇవి ఎలా పని చేస్తాయో తెలియకుండా చాట్ బ్యాకప్‌లను తీయడం మంచిది కాదు. అలాగే మీకు చాలా పాత మరియు అసంబద్ధమైన కొన్ని వ్యక్తిగత చాట్‌లు ఉంటే కనుక వాటిని వాట్సాప్ చాట్ డేటాబేస్ నుండి వెంటనే తొలగించడం చాలా మంచిది. మీ వాట్సాప్ అకౌంట్ విషయానికొస్తే దాన్ని రెండు-కారకాల యాక్సిస్ లతో భద్రపరచడం మంచిదే కాని చిన్న చిన్న పొరపాటులు మిమ్మల్ని ఎప్పటికీ లాక్ చేస్తుంది. వాట్సాప్ చాట్స్ బ్యాకప్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

గూగుల్ డ్రైవ్ లేదా ఆపిల్ ఐక్లౌడ్‌లో వాట్సాప్ బ్యాకప్ చాట్‌లు

గూగుల్ డ్రైవ్ లేదా ఆపిల్ ఐక్లౌడ్‌లో వాట్సాప్ బ్యాకప్ చాట్‌లు

వాట్సాప్ దాని ప్లాట్‌ఫారమ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ను మాత్రమే అందించగలదు. మీరు ఎవరితో అయిన చాటింగ్ చేసిన తరువాత వాట్సాప్‌ను విడిచిపెట్టిన క్షణం మీరు ప్రైవసీను కోల్పోతారు. దీని అర్థం గూగుల్ డ్రైవ్ మరియు ఐక్లౌడ్‌లో సేవ్ చేయబడిన అన్ని చాట్‌లు గుప్తీకరించబడవు. ఇతరులు ఎవరైనా ఆ చాట్ బ్యాకప్‌లను పొందగలిగితే వాటిని సులభంగా చదవవచ్చు.

Also Read:Realme SLED 4K కొత్త స్మార్ట్‌టీవీ!! అద్భుతమైన ఫీచర్లతో త్వరలోనే లాంచ్Also Read:Realme SLED 4K కొత్త స్మార్ట్‌టీవీ!! అద్భుతమైన ఫీచర్లతో త్వరలోనే లాంచ్

వాట్సాప్ అకౌంటును వేరొకరు ఉపయోగించకుండా బలమైన వాట్సాప్ పిన్
 

వాట్సాప్ అకౌంటును వేరొకరు ఉపయోగించకుండా బలమైన వాట్సాప్ పిన్

వాట్సాప్ తన వినియోగదారులకు రెండు-కారకాల అతంటీకేషన్ ను అందిస్తుంది. ఇందులో ఆరు-అంకెల కోడ్ గల పిన్ మీ యొక్క అకౌంటును మూడవ వ్యక్తి యొక్క జోక్యం నుండి రక్షించుకోవడానికి మీకు సహాయపడుతుంది. హ్యాకర్ లేదా ఏదైనా ఏజెన్సీ మీ మొబైల్ ఫోన్ మరియు సిమ్‌ను క్లోన్ చేయగలిగినప్పటికీ మీ వాట్సాప్ అకౌంటులోకి రావడానికి వారికి 2FA కోడ్ అవసరం అవుతుంది.

వాట్సాప్ పిన్‌తో తప్పు ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తే?

వాట్సాప్ పిన్‌తో తప్పు ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తే?

వాట్సాప్ వినియోగదారులు తమ 2FA పిన్ను మరచిపోయినట్లయితే వాటిని తిరిగి పొందడానికి ఇమెయిల్ ఐడిని అందించడానికి అనుమతిస్తుంది. అయితే మీ ఇమెయిల్ ఐడిని అందించని ఎంపిక ఉంది. అలాగే వాట్సాప్ ఇమెయిల్ ఐడిని ధృవీకరించదు మీరు తప్పుగా టైప్ చేస్తే మీరు వాట్సాప్ పిన్ను మరచిపోతే మీ వాట్సాప్ అకౌంట్ పునరుద్ధరించబడదు.

Also Read:ల్యాప్‌టాప్ లపై భారీ ఆఫర్లు! కొనాలంటే ఇదే సమయం!Also Read:ల్యాప్‌టాప్ లపై భారీ ఆఫర్లు! కొనాలంటే ఇదే సమయం!

 

వాట్సాప్ చాట్‌లను ఎక్సపోర్ట్ చేస్తే E2E ఎన్క్రిప్షన్?

వాట్సాప్ చాట్‌లను ఎక్సపోర్ట్ చేస్తే E2E ఎన్క్రిప్షన్?

మీరు మీ యొక్క ఇమెయిల్ ఐడిలో వాట్సాప్ చాట్‌లను సేవ్ చేయాలనుకుంటే కనుక ఈ చాట్‌లు ఎన్క్రిప్షన్ చేయబడదు మరియు ఎవరైనా వాటిని సులభంగా చదవగలరని గమనించండి.

వాట్సాప్ చాట్‌లను మైక్రో SD కార్డ్ లేదా పెన్ డ్రైవ్‌కు బదిలీ

వాట్సాప్ చాట్‌లను మైక్రో SD కార్డ్ లేదా పెన్ డ్రైవ్‌కు బదిలీ

మైక్రో SD కార్డ్ లేదా పెన్ డ్రైవ్ వంటి స్థానిక స్టోరేజ్ లకు వాట్సాప్ యొక్క చాట్ బ్యాకప్‌లను బదిలీ చేయడానికి వాట్సాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఫోన్‌లోని వాట్సాప్ ఫోల్డర్ నుండి డేటాబేస్ ఫైళ్ళను కాపీ-పేస్ట్ చేయడం ద్వారా మీరు దీన్ని సులభంగా చేయవచ్చు.

ఫోన్ లేదా గూగుల్ డ్రైవ్ నుండి వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను తొలగించడం

ఫోన్ లేదా గూగుల్ డ్రైవ్ నుండి వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను తొలగించడం

మీరు వాట్సాప్ చాట్ బ్యాకప్‌లను పూర్తిగా తొలగించాలనుకుంటే కనుక మీరు మీ ఫోన్‌లోని వాట్సాప్ ఫోల్డర్ నుండి డేటాబేస్ ఫైల్‌లను తొలగించవచ్చు. ఈ బ్యాకప్ ఫైళ్ళను కనుగొనడానికి ఏదైనా ఫైల్ మేనేజర్‌ను ఉపయోగించండి. అలాగే డెస్క్‌టాప్‌లో గూగుల్ డ్రైవ్‌ను యాక్సెస్ చేయడం ద్వారా మీరు అన్ని వాట్సాప్ బ్యాకప్ ఫైల్‌లను కనుగొని వాటిని తొలగించవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Things to Remember Chatting on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X