ఇండియాలో పుట్టి ప్రపంచానికి వెలుగునిస్తున్న ఆవిష్కరణలు

By Hazarath
|

ఇండియా ప్రపంచానికి ఎన్నో గొప్ప ఆవిష్కరణలను అందించింది. ఇండియాలో పుట్టిన అనేక మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో, సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారు. ఇప్పుడు పురాతన కాలానికి సంబంధించి పరిశోధనలు చేయాలన్నా అలాగే సైన్స్ రంగానికి సంబంధించి మరేవైనా ప్రయోగాలు చేయాలన్నా అందరూ ఇండియానే అత్యుత్తమమైనదిగా భావిస్తారంటే ఇండియా గొప్పతనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అందువల్లనే ఇండియా నుంచి ఎన్నో ఆవిష్కరణలు బయటి ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని మీకోసం.

Read more: మీకు తెలియకుండా గూగుల్ ఫోటో చేసే పనులు

1

1

పత్తి విత్తనాల నుండి పత్తిని తీసే మిషన్ ఇది. ఈ మిషన్ ను పురాతన కాలంలోనే తయారుచేశారు. అజంతా గుహల్లో దీన్ని కనుగొన్నారు. దీన్నే చక్ర అని పిలుస్తారు.

2

2

బటన్స్ అనేది ఇప్పుడు బట్టలకు కామన్ అయిపోయింది. అయితే వీటిని ఇండియన్లే తయారుచేశారని చాలామందికి తెలియదు. వీటిని సింధు లోయ నాగరికతలోనే వినియోగించారు.

3

3

దీన్ని కూడా సింధు లోయ నాగరికతలోనే వాడారని తెలుస్తోంది. అప్పటి నుంచి అది కొత్త రంగు పులుముకుంటూ ప్రపంచమంతా పాకింది.

4

4

ఈ సర్జరీలు 2000 సంవత్సరాల క్రితమే మనకు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లోనే శుశ్రుత వైద్యుడు దీన్ని కనుగొన్నారు. తదనంతరం ఇది ప్రపంచానికి పరిచయమైంది.

5

5

ఎన్నో మందులు ఇప్పుడు అందర్నీ కాపాడుతున్నాయంటే వాటికి మూలం ఎక్కడో లేదు. ఇండియాలోనే వీటికి పునాది పడింది. అదర్వన వేదంలో ఈ మందులు గురించి స్పష్టంగా చెప్పబడింది కూడా.

6

6

డైమండ్స్ ఇండియా యెక్క ప్రధమ ఖనిజం. 18వ శతాబ్దంలోనే ఇండియాలో డైమండ్స్ ని కనుగొన్నారు. ఆతరువాతనే విదేశాలకు వాటిని ఎగుమతి చేశారు.

7

7

2400 బిసిలోనే ఈ వంతెనలకు పునాది పడింది. హరప్పా నాగరికతా సమయంలో లోథాల్ లో ఈ ఆవిష్కరణను తయారుచేశారు. అవే తదనంతరం కొత్త రూపును సంతరించుకుని నేడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

8

8

పురాతన కాలంలోనే దక్షిణ భారతదేశంలో ఎంతో ధృడమైన ఇనుమును వినియోగించారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అదే రకరకాలు ఆకారాల్లో పురుడుపోసుకుని ఇప్పుడు మనకు లభిస్తోంది.

9

9

ఇది కూడా ఇండియానుంచే పుట్టి ప్రపంచానికి పాకింది. ఇండియాలోని ఇంక్ ను తారుతో అలాగే ఎముకలతో నాడు తయారుచేశారు.

10

10

గణిత శాస్త్రానికి ఇది వెన్నెముక లాంటిది. దీని విలువ శూన్యమైనా అన్ని నంబర్లను శాసించగల నంబర్ ఇది. దీన్ని కూడా ఇండియాలోనే కనుగొన్నారు. ఆర్యభట్ట తొలిసారిగా దీన్ని కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది.

Best Mobiles in India

English summary
Here Write Top 10 Biggest Inventions by Indian People

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X