యాపిల్ నుంచి గూగుల్ వరకు, 2017లో భారీ కొనుగోళ్లు ఇవే

|

టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కంపెనీ కొనుగోలుకు సంబంధించి చర్చలు సాగుతూనే ఉంటాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్కైప్, టంబ్లర్, యూట్యూబ్, పేపాల్ వంటి ఆన్‌లైన్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది నెటిజనులకు చేరువకావటంతో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, యాహూ వంటి సంస్థలు కొన్ని వందల కోట్లు గుమ్మరించి వీటిని సొంతం చేసుకున్నాయి. 2017కుగాను టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న ఖరీదైన కొనుగోళ్ల వివరాలను మీ ముందుంచుతున్నాం..

హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ చేతుల్లోకి సింప్లివిటీ, నింబిల్ స్టోరేజ్

హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ చేతుల్లోకి సింప్లివిటీ, నింబిల్ స్టోరేజ్

అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ కంపెనీ హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజెస్, డేటా సర్వీసెస్ కంపెనీ అయిన సింప్లివిటీని 650 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. జనవరి 2017లో ఈ డీల్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఈ డీల్ పూర్తి అయిన కొద్ది రోజులకే అమెరికాకు చెందిన ఫ్లాష్ స్టోరేజ్ టెక్నాలజీ కంపెనీ నింబిల్ స్టోరేజ్‌ను కూడా హెవ్లెట్ ప్యాకర్డ్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ డీల్ ఖరీదు 1.09 బిలియన్ డాలర్లు.

సిస్కో చేతుల్లోకి యాప్‌డైనమిక్స్

సిస్కో చేతుల్లోకి యాప్‌డైనమిక్స్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఇంకా నెట్‌వర్కింగ్ విభాగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన సిస్కో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన అప్లికేషన్ పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ యాప్‌డైనమిక్స్‌ను 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మార్చి 2017లో ఈ డీల్ క్లోజ్ అయ్యింది.

గూగుల్ చేతికి Kaggle

గూగుల్ చేతికి Kaggle

అమెరికాకు చెందిన డేటా సైంటిస్ట్స్ ఆన్‌లైన్ కమ్యూనిటీ Kaggleని భారీ మొత్తంలో వెచ్చించి సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ కొనుగోలు చేసింది. మార్చి 2017లో పూర్తి అయిన ఈ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. డేటా సైన్స్ అలానే మెచీన్ లెర్నింగ్ టాపిక్‌లకు సంబంధించి ఆన్‌లైన్ కాంపిటీషన్‌లను నిర్వహించటంలో Kaggle సంస్థక అపారమైన అనుభవం ఉంది. ఈ కమ్యూనిటీలో 6 లక్షలకు పైగా డైటా సైంటిస్టులు ఉన్నారు.

సీఏ టెక్నాలజీస్ చేతుల్లోకి విరాకోడ్

సీఏ టెక్నాలజీస్ చేతుల్లోకి విరాకోడ్

అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ అసోసియేట్స్ టెక్నాలజీ సంస్థ సీఏ టెక్నాలజీస్, సెక్యూరిటీ టెస్టింగ్ సంస్థ అయిన విరాకోడ్‌ను 614 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. డెవలపర్స్ తమ యాప్‌లకు సంబంధించి సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకునేందుకు విరాకోడ్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది.

నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?

గూగుల్ చేతుల్లోకి హెచ్‌టీసీ

గూగుల్ చేతుల్లోకి హెచ్‌టీసీ

హెచ్‌టీసీకి చెందిన స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం డీల్ విలువ 1.1 బిలియన్ డాలర్లు. ఈ కొనుగోలుతో గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం మరింతగా ఊపందుకుంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

యాపిల్ చేతుల్లోకి Lattice.io

యాపిల్ చేతుల్లోకి Lattice.io

తమ పరిధిలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అలానే మెచీన్ లెర్నింగ్ విభాగాలను మరింతగా విస్తరించుకనేందుకుగాను యాపిల్ సంస్థ అమెరికాకు చెందిన Lattice.ioను కొనుగోలు చేసింది. మే నెలలో పూర్తి అయిన ఈ డీల్ విలువ 175 మిలియన్ డాలర్ల నుంచి 200 మిలియన్ డాలర్ల మధ్య ఉంది.

వెరిజోన్ చేతుల్లోకి యాహూ

వెరిజోన్ చేతుల్లోకి యాహూ

అమెరికాకు ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థ వెరిజోన్, వెబ్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన యాహూను 4.5బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. యాహూ సర్వీసెస్‌ను తన ఏవోఎల్ బిజినెస్‌తో కలిపి సరికొత్త శకానికి నాంది పలకాలని వెరిజోన్ భావిస్తోంది.

ఇంటెల్ చేతుల్లోకి మొబైల్‌ఐ

ఇంటెల్ చేతుల్లోకి మొబైల్‌ఐ

అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్, ఇజ్రాయిల్‌కు చెందిన డ్రైవర్‌లెస్ కార్ల తయారీ కంపెనీ మొబైల్‌ఐని కొనుగోలు చేసింది. మొత్తం డీల్ విలువ 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్‌ఐ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 27 కార్ల తయారీ కంపెనీలతో కాంట్రాక్టులు ఉన్నాయి. ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టంకు సంబంధించి ఎక్కువ శాతం సాఫ్ట్‌వేర్‌లను కూడా ఈ సంస్థే కంట్రోల్ చేస్తోంది. అత్యాధునిక సెమీ అటానమస్ క్రూయిజ్ నియంత్రణ వ్యవస్థలు కూడా ఈ సంస్థ వద్ద ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Here we list the top tech acquisitions of this year made by Google, Apple, Cisco, CA Technologies, HP, Intel and others.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X