షాక్ : ఆకాశంలో 42 కిలోమీటర్లు పరిగెత్తాడు

Written By:

అంతరిక్షంలో పరుగుపందెం ఏంటీ అని అనుకుంటున్నారా..అవున మీరు విన్నది నిజమే. అంతరిక్షంలో ఈ మధ్య మారధాన్ పోటీ జరిగింది. అయితే అందులో పాల్గొన్నది ఒక్కరే. బ్రిటన్ కు చెందిన వ్యోమగామి ఈ మారధాన్ లో పాల్గొని గిన్నీస్ రికార్డు సృష్టించారు. మరి అంతరిక్షంలో ఎలా పరిగెడతారు అనే మీ డౌటు తీరాలంటే ఈ న్యూస్ చదవాల్సిందే.

Read more: మరీ ఇంతలా మాయ చేస్తారా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

బ్రిటన్ వ్యోమగామి టిమ్ పీక్ అంతరిక్షంలో 42 కిలోమీటర్ల మారథాన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డులకే ఎక్కాడు.

2

టిమ్ పీక్ చేసిన ఈ సాహసాన్ని లండన్లో పలువురు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ రికార్డు భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో నమోదైంది. బ్రిటిష్ యూరోపియన్ ఎజెన్సీకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది.

3

మొత్తం ఆరు నెలల కార్యక్రమం కోసం ఈ స్టేషన్‌కు వెళ్లిన టిమ్ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఒక ట్రెడ్ మిల్‌ను ఏర్పాటుచేసుకొని ఈ మారథాన్ ప్రారంభించాడు. టిమ్ పిక్ మొత్తం 3 గంటల 35 నిమిషాల్లో ఈ మారథాన్ పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

4

గతంలో ఈ రికార్డు భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరిట ఉంది. ఆమె బోస్టన్ మారథాన్ పేరిట 2007 లో ఇదే లక్ష్యాన్ని 4 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశారు.

5

కాగా, టిమ్ మాత్రం లండన్ మారథాన్ పేరిట ఈ పరుగును పూర్తి చేసి గిన్నిస్ కు చేరారు. అసలు గ్రావిటీ ఏమాత్రం ఉండని కక్షలో ఉండి ఇంత వేగంగా మారథాన్ పూర్తి చేయడం నిజంగా ఒక ప్రపంచ రికార్డు అని గిన్నిస్ వరల్డ్ తెలిపింది.

6

అయితే ఈ 44 ఏళ్ల మారథాన్ వీరుడు .. భూమిపై ఉన్న 39 వేలమంది మారథాన్ పోటీ దారుల్లో ఒకరు కూడా. మరి ఆకాశంలో పరుగులు పెట్టాలంటే మాములు విషయం కాదు కదా.

7

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write UK astronaut Tim Peake runs marathon aboard space station
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot