కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో వాడుతున్న అద్భుతమైన టెక్నాలిజీలు ఇవే!!!

|

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ యొక్క బ్రాండ్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎల్లప్పుడూ తమ ఉత్పత్తులను వినూత్నంగా కనిపించేలా కొత్త ఫీచర్లతో తయారుచేస్తున్నారు. ఇవి మిగిలిన బ్రాండ్లతో బిన్నంగా ఉండడానికి వినూత్నంగా తమ ప్రయత్నాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫోల్డబుల్ డిస్ప్లేలు, LiFi, బటన్‌లెస్ ఫోన్లు లేదా అంతర్నిర్మిత ఇయర్‌బడ్‌ వంటి కొత్తరకం ఫీచర్లతో కొత్త ఫోన్‌లను తయారుచేస్తున్నారు. భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మనం ఉహించలేనంత ఫీచర్లు మరియు సౌలభ్యాన్ని అందించే ఆలోచనలో ఉన్నాయి. మొబైల్ కంపెనీలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలిజీల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కలర్ ఛేంజింగ్ గ్లాస్‌ ప్యానెల్ స్మార్ట్‌ఫోన్
 

కలర్ ఛేంజింగ్ గ్లాస్‌ ప్యానెల్ స్మార్ట్‌ఫోన్

వివో బ్రాండ్ ఇప్పుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్‌యొక్క వెనుకవైపు ప్యానెల్ ను కలర్ ఛేంజింగ్ గ్లాస్‌తో తయారుచేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ వెనుక భాగంలో ఎలెక్ట్రోక్రోమిక్ గ్లాస్‌ను కలిగి ఉండి ఒక బటన్ ను నొక్కినప్పుడు కలర్ మారే విధంగా తయారు చేస్తున్నారు. ఎలెక్ట్రోక్రోమిక్ గ్లాస్లను ఇప్పటికే విమానాలు, హోటళ్ళు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ గాజు యొక్క కలర్ ఎలక్ట్రానిక్ గా మార్చబడుతుంది. వివో ఇందులో ఎన్ని రకాల కలర్ లను పరిచయం చేయనున్నదో ముందు ముందు చూడాలి.

Also Read:JioFiber Vs Airtel Xstream Fiber: తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే!!!Also Read:JioFiber Vs Airtel Xstream Fiber: తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే!!!

ఇయర్‌బడ్‌లు లోపలే ఉన్న ఫోన్‌లు

ఇయర్‌బడ్‌లు లోపలే ఉన్న ఫోన్‌లు

షియోమి సంస్థ తన భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇయర్‌బడ్స్ స్లాట్‌లను కూడా కలిపి తీసుకురావడానికి షియోమి రెండు పేటెంట్లను ఇప్పటికే దాఖలు చేసింది. ఇయర్‌బడ్స్‌లను ఫోన్ తో పాటుగా తీసుకెళ్లే బదులు మీరు స్టైలస్ లాగా నేరుగా ఇయర్‌బడ్స్‌ను ఫోన్ లోపల ఉంచవచ్చు. ఫోన్ పైభాగంలో ఆయా స్లాట్‌లలో ఉంచినప్పుడు ఇయర్‌బడ్‌లు స్పీకర్లుగా కూడా ఉపయోగపడతాయి.

పవర్ బటన్లు మరియు పోర్టులు లేని కొత్తరకం స్మార్ట్‌ఫోన్‌లు

పవర్ బటన్లు మరియు పోర్టులు లేని కొత్తరకం స్మార్ట్‌ఫోన్‌లు

వివో సంస్థ ఇప్పటికే తన కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను నెక్స్ సిరీస్ లో విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇది ఎటువంటి బటన్ మరియు పోర్ట్‌లు లేకుండా వస్తున్నట్లు సమాచారం. ముందు ముందు భవిష్యత్ ఫోన్‌లు బటన్‌లెస్ మరియు పోర్ట్‌లెస్ డిజైన్‌ను అనుసరించవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో డేటా పోర్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల తరువాత అన్ని ఫోన్‌లలో నెమ్మదిగా అదృశ్యమవవచ్చు.

ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లు
 

ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లు

చాలా రకాల స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు ఇప్పటికే సూపర్-ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీని తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ బ్రాండ్లు అన్ని కూడా ఇప్పుడు ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వైర్‌లెస్ ఛార్జింగ్ విధానం ద్వారా అందించాలని చూస్తున్నాయి. వీరు కేవలం 30 నిమిషాల్లో మీ ఫోన్‌ను వైర్‌లెస్ విధానం ద్వారా పూర్తిగా ఛార్జ్ చేసే టెక్నాలజీని తీసుకురానున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
UpComing Smartphones Using Different Technologies: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X