యుఎస్ నేవీ ఘోస్ట్ హంటర్స్

Written By:

యుఎస్ సీక్రెట్ డ్రోన్లు వస్తున్నాయి. ఇవి క్షణాల్లో శత్రువుల బోట్లను అలాగే జలాంతర్గాములను నాశనం చేస్తాయి. నీటిలో అవి ఎక్కడ దాక్కున్నా పసిగట్టి వాటిని భస్మీపటలం చేస్తాయి ఈ సీక్రెట్ డ్రోన్లు..దాదాపు 132 అడుగుల పొడవున్న ఈ డ్రోన్లు సముద్రమంతా జల్లెడ పట్టి ఎక్కడ ఏ శత్రువు జలాంతర్గామి ఉన్నా దాన్ని అక్కడిక్కడే పేల్చేస్తుంది. ఎప్పటి నుంచో సీక్రెట్ గా దీన్ని తయారుచేస్తూ వస్తున్న యుఎస్ ఇప్పుడు దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిచేందుకు సిద్ధమయింది. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇవి మానవరహిత డ్రోన్ జలాంతర్గాములు.

Read more: కలకత్తాను శోకసంద్రంలో ముంచిన భయానక దృశ్యాల వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

సముద్రంలో రాడికల్ డ్రోన్ బోట్‌లతో శత్రువుల జలాంతర్గాములను ఎలా కనుక్కోవాలి వాటిని ఎలా ధ్వంసం చేయాలనే దానిపై టెస్టింగ్‌కు యుఎస్ నేవీ రెడీ అయింది. అమెరికా జలాల్లోకి ఏవైనా డీజిల్ ఆధారిత శత్రువుల జలాంతర్గాములు వస్తే వాటిని అక్కడికక్కడే సముద్రంలోనే మట్టు బెట్టే విధంగా ఈ మానవరహిత డ్రోన్లు తయారుకానున్నాయి.

2

ఈ మేరకు 132 అడుగుల పొడవైన షిప్‌ను జలాశయాల్లో ప్రవేశపెట్టి టెస్టింగ్ నిర్వహించారు. ఇది ఫస్ట్ హై స్పీడ్ టెస్టని, యాంటీ సబ్ మెరైన్ పేరుతో ఈ టెస్టింగ్ నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వీడియో బహిర్గతం అయింది.

3

పోర్ట్ ల్యాండ్ లో ఈ షిప్ పై ప్రయోగం జరిపారు. దీని వేగం 27 knots (31 mph/50 kph). ఇది అధికారికంగా ఏప్రిల్ 7న అమెరికన్ జలాశయాల్లోకి వెళ్లనుంది. కాలిఫోర్నియా తీర ప్రాంతంలో దీనిపై పూర్తి స్థాయి ప్రయోగం నిర్వహించనున్నారు.

4

ఈ ఘోస్ట్ హంటర్ సబ్ మెరైన్లను డార్పా రూపొందిస్తోంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ హారతి ప్రభాకర్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ స్టీవ్ వాకర్ దీన్ని బహర్గితపరిచారు. ఇవి అత్యాధునిక మానవరహిత జలాంతర్గాముల డ్రోన్లు. మానవ ప్రమేయం లేకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు.

5

సముద్రంలో శత్రువుల జలాంతర్గాములను గుర్తించి మానవ ప్రమేయం లేకుండానే వాటిని ధ్వంసం చేయగలవు. నీటి అడుగు భాగానికి వెళ్లి మరీ వాటిని గుర్తించి పేల్చేయగలవు. ఈ పేరులేని డ్రోన్లు అధికారులతో 3 నెలలకొకసారి సముద్రంలోకి వెళతాయని అక్కడ ఏవైనా శత్రువుల జలాంతర్గాములను గుర్తిస్తే వాటిని వెంటనే అధికారులకు తెలియకుండానే పేల్చేస్తాయని నేవి అధికారులు చెబుతున్నారు.

6

ఏప్రిల్ నెలలో పోర్ట్ ల్యాండ్ ,ఓరెజిన్ జలాశయాల్లో వీటిని ప్రవేశపెడతారు. అప్పుడే ఈ డ్రోన్లకు నామకరణం కూడా చేస్తారు. దాదాపు 18 నెలల పాటు దీని సామర్ధ్యంపై పరిశోధనలు నిర్వహించి ఆ తరువాత పూర్తి స్థాయిలో వీటిని ప్రవేశపెడతామని నావల్ రీ సెర్చ్ అండ్ స్పేస్ కార్యాలయం చెబుతోంది.

7

అయితే ఇవి మానవరహిత డ్రోన్లు కాబట్టి వీటిని సముద్రాల్లో ప్రవేశపెడితే వీటిని అత్యవసర సమయంలో ఆపరేట్ చేయాలంటే ఎలా అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవి శత్రువుల జలాంతర్గాములను ఎలా గుర్తిస్తాయి అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.వీటన్నింటికి కూడా త్వరలో సమాధానం ఇస్తామని డార్పా కంపెనీ చెబుతోంది.

7

ఈ ప్రాజెక్ట్ 2010లో ప్రారంభమైంది. 2010లోనే డాప్రా 132 అడుగుల పొడవైన మానవరహిత జలాంతర్గాముల డ్రోన్లను తయారుచేస్తున్నామని వెల్లడించింది. అయితే దీన్ని మొన్ననే దాదాపు కిలోమీటర్ దూరం వరకు ప్రయోగాత్మకంగా పరీక్షంచారు. కొంతమంది మిలిటరీ అధికారులు ఈ ప్రయోగాన్ని చూసి ఇది ఓ అత్యాధునిక టెక్నాలజీ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

9

ఇవి బ్యాటరీ పవర్‌తో అలాగే డీజిల్‌తోనూ నడిచే మానవరహిత సబ్ మెరైన్ డ్రోన్లు. ఇది పోతుంటే దీని శబ్ధం సింగిల్ కారు ఇంజిన్ పోతున్నట్లుగా ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఇంకా అత్యాధునిక న్యూక్లియర్ పవర్ సబ్ మెరైన్లను తయారుచేసేందేకు ప్రయత్నిస్తున్నామని వాటిని తయారుచేసే దిశగా గట్టి కృషి చేస్తున్నామని డార్పా కంపెనీ చెబుతోంది.

10

ఈ పేరులేని మానవరహిత జలాంతర్గాముల డ్రోన్లు నెలకొకసారి వేల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని చుట్టి రాగలవు. అంతే కాకుండా మానవరహితం కాబట్టి ఏ క్షణంలో మనుషులకు ఏం జరుగుతుందన్న భయం కూడా లేదు. ట్రాకింగ్ వ్యవస్థ కూడా అత్యంత కట్టుదిట్టంగా ఉంటుందని ఎవరూ ట్రాక్ చేసేందుకు వీలు ఉండదని తెలుస్తోంది.

11

200 నుంచి 300 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఈ డీజిల్ సబ్ మెరైన్స్ ను చిన్న దేశాలు కొనుక్కోవచ్చని అధికారులు చెబుతున్నారు. రష్యా ఇప్పటికే ఇటువంటి షిప్ యార్డ్ లను కొన్నది. వాటికి అండర్ సీ ఆర్మ్ రేస్ అని పేరు కూడా పెట్టింది.

12

ఇదిలా ఉంటే కొన్ని దేశాలు ఈ డ్రోన్ల కోసం ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాయి. వాటిల్లో అల్గేరియా 2, వెనిజులా 5 ( అంచనా) ,ఇండోనేషియా 6 డ్రోన్ల కోసం ఆర్డర్ ఇచ్చాయి. వీటిని 2020 కల్లా అందించాలని డాప్రాను కోరాయి . అయితే మనుషులతో కాంటాక్ట్ లేకుండా వేల కిలోమీటర్లు దూరం ఈ పేరులేని డ్రోన్ జలాంతర్గాములు ఎలా వెళతాయి. శత్రువుల స్థావరాలను ఎలా నాశనం చేస్తాయన్నదే ఇప్పుడు అంతు పట్టడం లేదు.

13

ఈ ప్రయోగం విజయవంతమయితే 1.8 ట్రిలయన్ డాలర్ల కమర్షియల్ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఇదే అత్యంత పెద్ద ఆపరేషన్ గా నిలుస్తుంది. అంతేకాకుండా అదే స్థాయిలో పెను ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా యుఎస్ నేవి ప్రపంచదేశాలకు ఈ అధునాతన టెక్నాలజీతో సవాల్ విసిరే ప్రమాదం కూడా లేకపోలేదు.

14

దీనికి సంబంధించిన వీడియో 

15

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

source : Darpa

English summary
Here Write Watch the US Navy's 'ghost hunter' set sail: 132 foot long drone boat will scour seas for months at a time looking for enemy submarines
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot