మాట్లాడలేని వారికి ఈ టెక్నాలజీ మరో జన్మ లాంటిది!

|

ప్రాంతమేదైనా, భాష ఏదైనా మదిలోమెదిలే భావ ప్రకటనల రూపమే 'మాట’. తరాలు మారినా యుగాలు గడిచినా నోటి మాటకున్న విలువ మాత్రం తగ్గదు. ప్రతి వ్యక్తి జీవితంలో నోటి మాట అనేది ఎంతో విలువైనది. అంతటి అపురూమైన నోట వాక్కును క్యాన్సర్ కారణంగా పోగొట్టుకుంటే..?

మాట్లాడలేని వారి కోసం కస్టమ్ డిజిటైజిడ్ వాయిస్‌

మాట్లాడలేని వారి కోసం కస్టమ్ డిజిటైజిడ్ వాయిస్‌

నోటిమాట కోల్పోయి నరక యాతన అనుభవిస్తోన్న వారికి ఓ టెక్నాలజీ నేనున్నానంటూ అభయహస్తం అందిస్తోంది. బోస్టన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ VocaliD మాట్లాడలేని వారి కోసం కస్టమ్ డిజిటైజిడ్ వాయిస్‌లను అభివృద్ధి చేస్తోంది. ఈ టెక్నాలజీతో ముందుగా రికార్డ్ చేయబడిన వాయస్‌ను తీసుకుని దాని ఆధారంగా యూజర్ సొంత వాయిస్‌ను కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేయటం జరుగుతుంది. ఈ టెక్నాలజీ స్పూర్తితో తిరిగి మాట్లాడతోన్న వ్యక్తులు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరి గరించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం..

అది గాయం కాదు క్యాన్సర్..

అది గాయం కాదు క్యాన్సర్..

లండన్‌కు చెందిన జో మోరిస్ అనే 31 సంవత్సరాల ఫిల్మ్ మేకర్ తన నాలుక మీద ఆకస్మాత్తుగా ఏర్పడిన ఓ చిన్న గాయాన్ని గుర్తించారు. అయితే అది నిద్రలో నాలుక కరుచుకోవటం కారణంగా ఏర్పడి ఉండొచ్చని ఆయన భావించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఆ గాయం మానకపోవటంతో దానికి సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేయటం మొదలుపెట్టారు.

క్యాన్సర్ పరీక్షలో పాజిటివ్ రిజల్ట్స్..

క్యాన్సర్ పరీక్షలో పాజిటివ్ రిజల్ట్స్..

ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్న ఆయనకు ఓరల్ క్యాన్సర్ లక్షణాలు కనిపించటంతో వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ను కన్సల్ట్ చేసారు. డాక్టర్ సూచనల మేరకు జో మోరిస్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోగా అవి పాజిటివ్ అని తేలింది. జో మోరిస్‌కు మెరుగైన చికిత్స అవసరమని భావించిన అతని ఫ్యామిలీ డాక్టర్, బ్రిటన్‌లోని గయ్స్ హాస్పటల్‌కు కేసును రిఫర్ చేసారు. మోరిస్‌ను పరీక్షించిన గయ్స్ హాస్పటల్ వైద్యులు సర్జరీ చేయవల్సి ఉంటుందని తెలిపారు.

OPPO A71పై రూ.3వేలు తగ్గింపు, ఫోన్ ఫీచర్లు, టాప్ 6 ఒప్పో ఫోన్లు మీ కోసంOPPO A71పై రూ.3వేలు తగ్గింపు, ఫోన్ ఫీచర్లు, టాప్ 6 ఒప్పో ఫోన్లు మీ కోసం

అతనిలో ఓ చిన్న ఆశ మొదలైంది..

అతనిలో ఓ చిన్న ఆశ మొదలైంది..

నాలుకను తొలగించటం వల్ల ఇక మాట్లాడే అవకాశం ఉండదని డాక్టర్లు తెలపటంతో తీవ్ర భయాందోళణకు గురైన మోరిస్ ఇంతటితో తన పనైపోయిందని అనుకున్నారు. సర్జరీకి కొద్ది రోజుల ముందు జో మోరిస్‌కు తన మిత్రుని ద్వారా ఓ తియ్యటి కబురు అందింది. బోస్టన్‌కు చెందిన వోకల్‌ఐడీ అనే కంపెనీ మాట్లాడలేని వారి కోసం కస్టమ్ డిజిటైజిడ్ వాయిస్‌లను అభివృద్ధి చేస్తోందని అతని మిత్రుడు తెలపటంతో మోరిస్‌లో ఓ చిన్నఆశ మొదలైంది.

సర్జరీకి ముందే కొన్ని వేల రికార్డింగ్స్..

సర్జరీకి ముందే కొన్ని వేల రికార్డింగ్స్..

ఈ కంపెనీని వారు కన్సల్ట్ చేసిన తరువాత జో మాటలను రీక్రియేట్ చేస్తామని వోకల్‌ఐడీ ఫౌండర్ రూపాల్ పటేల్ హామీ ఇవ్వటంతో జో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే జో వాయిస్‌ను డిజిటల్‌గా రీకనస్ట్రక్ట్ చేయటానికి అవసరమైన రికార్డింగ్స్ సర్జరీకి ముందే తమకు అందించాలని రూపాల్ పటేల్ ప్రతిపాదించారు.

దీనికి అంగీకరించిన జో సర్జరీలోపు కొన్నివేల వాక్యాలను రికార్డ్ చేసి వోకల్‌ఐడీకి అందించారు. దీంతో క్యాన్సర్ భారినపడి తన నాలుకును కోల్పోయినప్పటికి వాయిస్ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీ ద్వారా తన గొంతను ప్రపంచానికి జో మోరిస్ వినిపిస్తూనే ఉన్నారు.

Best Mobiles in India

English summary
VocaliD crafts custom synthetic voices that make communication more human. So every voice can be heard.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X