ఇండియాలో గ్రహాంతరవాసుల స్థావరాలు,జవాన్లు చెబుతున్న రహస్య ప్రదేశం ఇదే !

|

గ్రహాంతర వాసులు ఉన్నారా..ఉంటే ప్రపంచంలో ఎక్కడ జీవిస్తున్నారు.. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. కొంతమంది ధియరిస్టులు గ్రహాంతర వాసులు ఉన్నారని వారి జీవన విధానం చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా దీనిపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇండియాలో గ్రహాంతర వాసులు ఉన్నారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. మరి అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేయండి.

 

ఇండియా సరిహద్దులో ఏలియన్స్ కలకలంఇండియా సరిహద్దులో ఏలియన్స్ కలకలం

రాత్రి పూట ఉన్నట్టుండీ ఆకాశం లోంచి రంగురంగుల లైట్లు

రాత్రి పూట ఉన్నట్టుండీ ఆకాశం లోంచి రంగురంగుల లైట్లు

అక్కడ కొన్ని సార్లు రాత్రి పూట ఉన్నట్టుండీ ఆకాశం లోంచి రంగురంగుల లైట్లు వెలుగుతూ కొన్ని వస్తువులు కనిపిస్తాయి.అవి భూమివైపు దూసుకు వచ్చి మంచు కొండల మధ్య అదృశ్యమౌతాయి.

అవి దిగినట్టుగా భావించే స్థలంలో..

అవి దిగినట్టుగా భావించే స్థలంలో..

పొద్దున్న చూస్తే అవి దిగినట్టుగా భావించే స్థలంలో ఏదొ బరువైన గుండ్రని వాహనం దిగిన గుర్తులూ కనిపిస్తాయి.

కాంగ్కలా పాస్ ని..

కాంగ్కలా పాస్ ని..

ఇండో చైనా బోర్డర్ లో ఉండే కాంగ్కలా పాస్ ని గ్రహాంతర వాసుల విడిది అని పిలుస్తారు స్థానికులు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకోనట్టే వ్యవహరిస్తోంది...

దీని వెనక ఉన్న మిస్టరీ ఏమిటో..
 

దీని వెనక ఉన్న మిస్టరీ ఏమిటో..

అయితే దీని వెనక ఉన్న మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఇదిలా ఉంటే గత రెండేళ్లనుంచి భారత్‌ - చైనా సరిహద్దులోని హిమాలయ పర్వత శ్రేణుల్లో.. సరిహద్దు సైనికులు యూఎఫ్‌వోలను చూశామని చెబుతున్నారు.

పసుపు రంగులో వింత గోళాకారంలో..

పసుపు రంగులో వింత గోళాకారంలో..

పసుపు రంగులో వింత గోళాకారంలో ఉన్నాయని అంటున్నారు. స్కై రాకెట్‌ను మోసుకుపోతున్నట్టుగా ఉన్న వళయాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి చైనా వైపు ప్రయాణించాయని చూసిన వారు చెబుతున్నారు.

గత ఆగస్టు నుంచి కనీసం వంద యూఎఫ్‌వోలను

గత ఆగస్టు నుంచి కనీసం వంద యూఎఫ్‌వోలను

గత ఆగస్టు నుంచి కనీసం వంద యూఎఫ్‌వోలను చూశామని చెబుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌కు పంపించామని చెప్పారు సైనికులు. అయితే ఇటీవల ఇది చైనా తయారు డ్రోన్‌ అయి ఉండొచ్చని ఆర్మీ అఫీషియల్‌ అంటుంటే అది డ్రోన్‌ గాని, చైనా పంపించిన శాటిలైట్‌లు అయ్యే అవకాశం లేదని స్వయంగా ఆర్మీ అధికారులే చెబుతున్నారు.

అవేంటో కనిపెట్టడానికి రాడార్లను..

అవేంటో కనిపెట్టడానికి రాడార్లను..

ఈ వింత వస్తువులు కనిపిస్తుండడంతో అవేంటో కనిపెట్టడానికి రాడార్లను ప్రయోగించారు. కానీ అవేంటో కనిపెట్టలేకపోయారు. నాన్‌ మెటలిక్‌తో తయారు చేసిన వాహనాలు కావటం వల్లే రాడార్‌లు గుర్తించలేకపోయాయని చెబుతున్నారు.

ఐదారేళ్ల క్రితం..

ఐదారేళ్ల క్రితం..

ఐదారేళ్ల క్రితం కూడా ఇటువంటివి కనిపించాయని హయ్యార్‌ అఫీషియల్స్‌కు వీటికి సంబంధించిన వివరాలు చెప్పినా పట్టించుకోలేదని ఆర్మీ సైనికులు చెబుతున్నారు. పర్వతారోహకులు కూడా 2004లోనే వీటిని చూసినట్లు రిపోర్టులు ఉన్నాయి.

లగన్ ఖేల్ ప్రాంతంలో

లగన్ ఖేల్ ప్రాంతంలో

లగన్ ఖేల్ ప్రాంతంలో వీటిని చూసినట్లు సైన్యం పైఅధికారులకు నివేదిక పంపింది. గత కొన్ని నెలల్లో దాదాపు వంద సార్లు యూఎఫ్ఓలు కన్పించాయని, అయితే చాలా కాలం తర్వాత మళ్లీ కన్పించాయని సైన్యం ఆ నివేదికలో పేర్కొంది.

గ్రహాంతర వాసుల జాడ వేరే గ్రహాల మీద వెతుకుతున్న మనం..

గ్రహాంతర వాసుల జాడ వేరే గ్రహాల మీద వెతుకుతున్న మనం..

గ్రహాంతర వాసుల జాడ వేరే గ్రహాల మీద వెతుకుతున్న మనం.. ఈ భూమి మీద కనిపిస్తున్న వాడి జాడలను మాత్రం పట్టించుకోవడం లేదు.అసలు అవి ఎక్కడున్నాయో తెలిస్తే ఓ పరిశోధన అంటూ చేయొచ్చంటున్నారు పరిశోధకులు.

Best Mobiles in India

English summary
What is the truth behind the Kongka La Pass UFO base mystery Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X