విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

Written By:

ఆకాశంలో విమానంలో ఎగురుకుంటూ వెళ్లినప్పుడు కిటికీలో నుంచి, బయటి వాతవారణాన్ని చూడాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. అయితే, ప్రస్తత తరం విమానాల్లో కిటికీలు చిన్నవిగా ఉండటం వలన విండో సీట్ వద్ద కూర్చునే ప్యాసింజర్‌కు మాత్రమే ఈ అనుభూతి పొందటం సాధ్యమవుతోంది. కానీ, అది కూడా పూర్తిస్థాయిలో చూడటం సాధ్యం కాదు.

 విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

అయితే, భవిష్యత్ విమానాల్లో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇప్పుడు మనం ఈ ఫొటోలలో చూస్తున్న కాన్సెప్ట్ విమానం అలాంటిదే. ఇదొక విండోలెస్ ప్లేన్. అంటే, ఈ విమానంలో కిటికీలు ఉండవని అర్థం కాదు, ప్రతి సీటులో కూర్చునే ప్రయాణీకుడు కూడా విండో సీట్‌లో కూర్చుని పొందే అనుభూతిని పొందవచ్చన్నమాట.

Read More : షాకింగ్ : మొదటి వెబ్‌క్యామ్ ఆ పనికి వాడారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పైక్ ఏరోస్పేస్

విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

విండోలెస్ సూపర్‌సోనిక్ బిజినెస్ జెట్ రూపకల్పనకు సంబంధించి స్పైక్ ఏరోస్పేస్ సంస్థ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది.

ఇంటీరియర్ మొత్తం

విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

ఈ విమానం లోపలి ఇంటీరియర్ మొత్తం వీడియో డిస్‌‍ప్లేలతో అమర్చబడి ఉంటుంది.

లైవ్ వీడియో ఫీడ్‌

విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

ఎయిర్‌క్రాఫ్ట్ అవుటర్ భాగంలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కెమెరాలు లైవ్ వీడియో ఫీడ్‌ను ఇంటీరియర్ వాల్ స్ర్కీన్‌ల పై డిస్‌ప్లే చేస్తుంటాయి.

స్క్రీన్లపై ప్రొజెక్ట్ చేస్తాయి

విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

విమానం బయట అమర్చిన కెమరాలు ఫ్లైట్ టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ పనిచేస్తూ, బయట జరుగుతున్న పరిణామాలను, వాతావరణాన్ని యధాతథంగా క్యాప్చూర్ చేస్తూ విమానం లోపలి వైపు ఉన్న హెచ్‌డి స్క్రీన్లపై ప్రొజెక్ట్ చేస్తాయి.

 

 

మరో పదేళ్ల సమయం

విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

అయితే, ఈ కాన్సెప్ట్‌లు ఉత్పత్తి దశకు చేరుకొని పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరో పదేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది. అప్పటి వరకూ మీరు ఇలాంటి అనుభూతిని పొందాలంటే, వీలైనంతగా ముందుగా మీ విండో సీట్‌ను బుక్ చేసుకోవాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Windowless Jet Will Let You Virtually Ride. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot