Home
Miscellaneous

మోదీ దగ్గర నుంచి ట్రంప్ వరకు ఏ మోడల్ ఫోన్‌లు వాడుతున్నారు..?

మోదీ దగ్గర నుంచి ట్రంప్ వరకు వినియోగిస్తోన్న ఫోన్ల పై స్పెషల్ స్టోరీ...

By Sivanjaneyulu Bommu

దేశాధినేతలు వాడుతోన్న టెక్నాలజీ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం టెక్నాలజీని ప్రేమించే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేశాధినేతలు తరచూ ప్రపంచదేశాలు తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో వీరి పర్సనల్ సమాచారాన్ని సేకరించడానికి ఎన్నో ఎత్తులకు శత్రువులు తెరలేపుతుంటారు..వారి ఏ చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా వారి ఫోన్‌ని హ్యాక్ చేస్తారు...ఇటువంటి పరిస్థితుల్లో లీడర్లు అత్యంత శక్తివంతమైన ఫోన్లను వాడుతుంటారు. మోదీ దగ్గర నుంచి ట్రంప్ వరకు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారు అనే దానిపై ఓ స్పెషల్ స్టోరీ...

డొనాల్డ్ ట్రంప్ వాడుతున్న ఫోన్ ఏంటి.?

డొనాల్డ్ ట్రంప్ వాడుతున్న ఫోన్ ఏంటి.?

అమెరికా 45వ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీతో మమేకమవుతోన్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈయనకు టెక్నాలజీ అంటే అంతగా ఆసక్తి ఉండదట. మొన్నటి వరకు ఏమాత్రం సురక్షితం కాని గెలాక్సీ ఎస్3 ఫోన్‌ను వినియోగించిన ట్రంప్ తాజాగా యాపిల్ ఐఫోన్‌కు స్విచ్ అయ్యారట. అయితే, ఈ ఫోన్‌లో ఒక్క అప్లికేషన్ మాత్రమే ఇన్‌స్టాల్ అయి ఉందట.

రష్యా అధినేత పుతిన్

రష్యా అధినేత పుతిన్

రష్యా అధినేత పుతిన్ తనకు మాత్రం అత్యంత ఇష్టమైనది ఐఫోన్ అని చెబుతారు. అయితే ఇంతకుముందు రష్యా ఏలిన నేతలకు కూడా ఆపిల్ పైనే మోజు ఉండేది. అయితే పుతిన్‌కు ఇంటర్నెట్ వాడటం అసలు ఇష్టం ఉండదని అక్కడి అధికారులు చెబుతుంటారు.

ఐఫోన్4 మొదటి యూజర్ రష్యా మాజీ అధ్యక్షుడే..

ఐఫోన్4 మొదటి యూజర్ రష్యా మాజీ అధ్యక్షుడే..

స్టీవ్ జాబ్స్ తొలిసారిగా ఐఫోన్ 4 రిలీజ్ కాకముందే రష్యా మాజీ అధ్యక్షునికి దాన్ని గిప్ట్‌గా బహుకరించారు. సిలికాన్ వ్యాలీలో స్టీవ్ జాబ్స్ రష్యా మాజీ అధ్యక్షుడు మెడ్‌వెదేవ్‌కు ఈ ఫోన్‌ను బహుకరించారు. ఐఫోన్ 4 ఫస్ట్ యూజర్ కూడా ఆయనే.

మోదీకి ఇష్టమైన ఫోన్ ఐఫోన్6

మోదీకి ఇష్టమైన ఫోన్ ఐఫోన్6

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ లేటెస్ట్ ఐఫోన్ వాడుతారు. అది అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఎక్కడికి వెళ్లినా దాంతో సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

ఆఫీసులో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ ఫోన్

ఆఫీసులో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ ఫోన్

నరేంద్ర మోదీ ఆఫీసులో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ ఫోన్ వాడుతారు. దాంట్లో తనకి కావలిసినవి వెతుక్కుంటారు. అయితే బయట దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఐ ఫోన్ చేతిలో ఉండాల్సిందే.

నార్త్ కొరియా అధ్యక్షుడికి ఇష్టమైన ఫోన్ హెచ్‌టీసీ

నార్త్ కొరియా అధ్యక్షుడికి ఇష్టమైన ఫోన్ హెచ్‌టీసీ

హైడ్రోజన్ బాంబు ప్రయోగాలతో అటు ప్రపంచానికి ఇటు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు మాత్రం హెచ్‌టీసీ ఫోన్ అంటే చెప్పలేనంత ఇష్టమని చెబుతారు.

ఆయన కూడా ఐఫోన్ ప్రేమికుడే..

ఆయన కూడా ఐఫోన్ ప్రేమికుడే..

ఇటలీ మాజీ ప్రధాని మట్టియో రేంజీ కూడా ఐఫోన్ ప్రేమికుడే. స్టీవ్‌జాబ్స్ చనిపోయినప్పుడు కూడా తన పేస్‌బుక్ పేజీలో స్టీవ్‌జాబ్స్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రాశారు.

పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్

పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్

దాయాది దేశం పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీప్ ఎప్పుడూ తన చేతిలో రెండు ఫోన్లను ఉంచుకుంటారు. వాటిలో ఒకటి ఐఫోన్ కాగా రెండోది శాంసంగ్. అనేక దేశాలను చుడుతున్న ఈ లీడర్ తన సెక్యూరిటీకోసం ఈ రెండు ఫోన్లను ఎంచుకున్నారు.

ఆమెకు నోకియా అంటే ప్రాణం..

ఆమెకు నోకియా అంటే ప్రాణం..

జర్మనీ చాన్సలర్ ఏంజెలో మోర్కెల్ ఫేవరేట్ ఫోన్ మాత్రం నోకియానే. ఎప్పుడూ ఆమె చేతిలో రెండు ఫోన్లు ఉంటాయి. ఒకటి నోకియా 6260 స్లైడర్ కాగా మరొకటి బ్లాక్‌బెర్రీ జడ్ 10. అత్యంత సేఫ్టీ కోసం ఆమె ఈ రెండు ఫోన్లను ఎంచుకున్నారు.

ఒబామాకు బ్లాక్‌బెర్రీ అంటే ఇష్టం..

ఒబామాకు బ్లాక్‌బెర్రీ అంటే ఇష్టం..

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎప్పుడూ తన చేతిలో బ్లాక్‌బెర్రీ ఫోన్‌నే ఉంచుకుంటారు. ఆన్‌లైన్‌లో ఏ పని చేయాలన్నా కాని బ్లాక్‌బెర్రీతోనే చేస్తారు. ఇది ఐ ఫోన్ కన్నా చాలా శక్తివంతమైనదని ఒబామా విశ్వసిస్తారు.

Best Mobiles in India

English summary
World Leaders Around The Globe Use These Smartphones. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X