దాయాదుల పోరుపై ఫేస్‌బుక్ సీఈఓ షాకింగ్ కామెంట్లు

Written By:

టీం 20 ఫీవర్ స్టార్టయింది. అసలు సిసలైన మజాకు కూడా తెరలేచింది. ఓ వైపు గేల్ విశ్వరూపం మరోవైపు న్యూజిలాండ్ దూకుడు..అబ్బో సునామి వచ్చినట్లుగా ఉందంటే నమ్మాల్సిందే..అయితే అసలు సిసలు మ్యాచ్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మధ్యనే జరుగుతుంది...ఈ మ్యాచ్ కోసం అందరూ ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు కూడా అయితే ఈ మ్యాచ్‌పై జుకర్ బర్గ్ కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

Read more: పనికిరాని వస్తువులతో సరికొత్త టెక్నాలజీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

టీం 20 వరల్డ్ కప్ సంధర్భంగా ఫేస్‌బుక్ ఎవరి టీంలకు వారు సపోర్ట్ చేయమంటూ ఓ డిజైన్ క్రియేట్ చేసింది. ఈ డిజైన్‌ తో మీ ప్రొపైల్ పిక్చర్ ను మార్చుకుని మీ దేశానికి సపోర్ట్ చేయడంటంటూ డిజైన్ ప్రవేశ పెట్టారు. అది అందరికీ తెలిసిందే..

2

దీనిపై జుకర్ బర్గ్ స్పందిస్తూ రెండు దేశాల మధ్య శాంతిని తయారుచేయండి యుద్ధాన్ని కాదంటూ ట్వీట్ చేశారు. ఇదే రెండు దేశాల ఫ్యాన్స్ కోరుకుంటున్నారంటూ తన వాల్ లో ట్వీట్ చేశారు.

3

అయితే ఈ డిజైన్ లో ఇండియా లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా వారి ప్రొపైల్ పిక్చర్ మార్చుకున్నారట. అలాగే పాకిస్తాన్ లో కొంతమంది ఇండియాకు సపోర్ట్ చేస్తున్నట్లుగా తమ ప్రొపైల్ పిక్చర్ ను మార్చుకున్నారట.

4

ముంబైకి చెందిన ఆరిస్ట్ రామ్ సుబ్రమణ్యన్ తన ప్రొపైల్ ను పాకిస్తాన్ సపోర్ట్ చేసేలా మార్చుకున్నారు..నేను పాకిస్తాన్ ను ద్వేషించడం లేదంటూ ఆయన తన వాల్ లో రాసుకున్నారు.

5

అలాగే పాకిస్తాన్ లోని లాహోర్ కి చెందిన లాయర్ ఇసానుల్లా షా కూడా తన ప్రొపైల్ పిక్చర్ ను ఇండియాకి సపోర్ట్ చేసే విధంగా మార్చుకున్నారు. నాకు ఇండియాలో చాలామంది స్నేహితులు ఉన్నారు. నేను వారిని ప్రేమిస్తాను రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటూ రాసుకున్నారు.

6

వీరు ఎందుకు ఇలా మార్చుకున్నారంటే అది క్రికెట్ కోసం కాదట. రెండు దేశాలు శాంతితో విరజిల్లాలని వారు అలా తమ ప్రొపైల్స్ ను మార్చుకున్నారట..ఇది చాలా సంతోషించదగ్గ పరిణామమని జుకర్ బర్గ్ అంటున్నారు.

7

సో వీరు రెండు దేశాల మధ్య యుద్ధానికి స్వస్తీ పలికి శాంతి సందేశం రావాలనే వీరి తపన బాగానే ఉంది. అయితే అది ముందు ముందు జరుగుతుందా లేదా అన్నదే చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Zuckerberg Says Indian and Pakistani Cricket Fans Are Friends on Facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot