సేల్ అంటే ఇది, 51 సెకన్లలో 10 లక్షలు ఫోన్‌లు అమ్మేసారు

8జీబి ర్యామ్ ఫోన్ కోసం భారీగా ఎగబడిన చైనా యూజర్లు...

|

Nubia బ్రాండ్ నుంచి జూన్ 1న చైనా మార్కెట్లో లాంచ్ అయిన 8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ Nubia Z17 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫోన్ కు సంబంధించి మంగళవారం జరిగిన మొదటి ఫ్లాష్ సేల్‌ లో భాగంగా 51 సెకన్లలో 10 లక్షల Nubia Z17 యూనిట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

 

  నుబియా అఫీషియల్ స్టోర్‌లో అమ్మకాలు..

నుబియా అఫీషియల్ స్టోర్‌లో అమ్మకాలు..

చైనాలో ఈ ఫోన్‌లను నుబియా అఫీషియల్ స్టోర్‌తో పాటు చైనా రిటైలర్ అయిన జింగ్‌డాంగ్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. నుబియా జెడ్17 స్మార్ట్‌ఫోన్‌లో bezel-less డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 8జీబి ర్యామ్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఉన్నాయి.

మెటాలిక్ బ్యాక్ ప్యానల్‌

మెటాలిక్ బ్యాక్ ప్యానల్‌

మెటాలిక్ బ్యాక్ ప్యానల్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు రెడ్ సర్క్యులర్ కెపాసిటివ్ హోమ్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ ఇంకా సింగిల్ స్లిట్ యాంటెనా డిజైన్ ప్రొఫెషనల్ లుక్‌ను కలిగిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో చేతివేళ్లకు సులువుగా అందేవిధంగా సెటప్ చేసారు.

సామ్‌సంగ్ ఫోన్‌ల పై Amazon డిస్కౌంట్లుసామ్‌సంగ్ ఫోన్‌ల పై Amazon డిస్కౌంట్లు

 5.5 అంగుళాల డిస్‌‌ప్
 

5.5 అంగుళాల డిస్‌‌ప్

డిస్‌‌ప్లే విషయానికి వచ్చేసరికి నుబియా జెడ్17 ఫోన్, bezel-less 5.5 అంగుళాల 1080 పిక్సల్ ప్యానల్‌తో వస్తోంది. ఈ డిస్‌ప్లే పై అమర్చిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మరిత ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తుంది.

ర్యామ్, ప్రాసెసర్, స్టోరేజ్

ర్యామ్, ప్రాసెసర్, స్టోరేజ్

నుబియా జెడ్17 ఫోన్ శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. శక్తివంతమైన 2.4GHz ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై ఈ ఫోన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 8జీబి ఇంకా 6జీబి వేరియంట్‌లలో అందబాటులో ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128జీబి ఇంకా 64జీబి వేరియంట్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది. మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయం ఉండదు.

Moto C vs Redmi 4A, రూ.6000లో ఏది బెస్ట్ ఫోన్..?Moto C vs Redmi 4A, రూ.6000లో ఏది బెస్ట్ ఫోన్..?

కెమెరా

కెమెరా

నుబియా జెడ్17 ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 23 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఇన్‌డెప్త్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాలో సెటప్ చేసిన నియోవిజన్ 7.0 సాఫ్ట్‌వేర్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ వై-ఫై కెమెరా ఫీచర్‌తో ఇతర స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరాలను ఈ ఫోన్ నుంచే కంట్రోల్‌ ఆపరేట్ చేసే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరాతో హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు

సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు

డాల్బీ అట్మోస్, హై-ఫై+, ఎన్ఎఫ్ సీ, బ్లుటూత్ 4.1, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. నుబియా జెడ్17 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Nubia UI 5.0 లేయర్ పై రన్ అవుతుంది.

మోదీ దగ్గర నుంచి ట్రంప్ వరకు ఏ మోడల్ ఫోన్‌లు వాడుతున్నారు..?మోదీ దగ్గర నుంచి ట్రంప్ వరకు ఏ మోడల్ ఫోన్‌లు వాడుతున్నారు..?

 ఫాస్ట్ ఛార్జింగ్‌ బ్యాటరీ..

ఫాస్ట్ ఛార్జింగ్‌ బ్యాటరీ..

నుబియా జెడ్17 ఫోన్ 3200mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. 50శాతం బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ధరలు..

ధరలు..

నుబియా జెడ్17 8జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 587 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.37759). 6జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 500 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.32163), 6జీబి ర్యామ్ + 64 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 411 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.26438).

ఇక సంవత్సరం వ్యాలిడిటీతో ఇంటర్నెట్ ప్యాక్స్ఇక సంవత్సరం వ్యాలిడిటీతో ఇంటర్నెట్ ప్యాక్స్

Best Mobiles in India

English summary
1 million Nubia Z17 units sold in just 51 seconds in first sale. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X