సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

Posted By:

ప్రీమియర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన సోనీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లకు దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ సాంకేతికతను ప్రపంచానికి చేరువ చేసే విషయంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే జపాన్ టెక్నాలజీ దిగ్గజం సోనీ, ఆరంభంలో విడుదల చేసిన మ్యూజిక్ ప్లేయర్‌లు మొదలుకుని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్లే స్టేషన్ 4 వరకు అన్నీ ఉత్పత్తులు మార్కెట్లో ఘన విజయాలను అందుకున్నాయి.

ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన సోనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌‍ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్3' అన్ని విభాగాల్లోనూ పై చేయిని సాధించి మార్కెట్లోని పోటీ బ్రాండ్‌లకు సవాళ్లను విసురుతోంది. రిటైలింగ్ మార్కెట్లో సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.48,000.

5.2 అంగుళాల ఆకట్టుకునే హైడెఫినిషన్ రిసల్యూషన్ (1920x1080 పిక్సల్స్) డిస్‌ప్లే క్వాలిటీతో ఎక్స్‌పీరియా జెడ్3 మైమరిపిస్తోంది. ట్రైలూమిస్ డిస్‌ప్లే, ఎక్స్-రియాల్టీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్స్‌పీరియా జెడ్3 డిస్‌ప్లే రూపకల్పనలో సోనీ వినియోగించింది. 2.5గిగాహెట్జ్ సామర్థ్యం కలిగిన శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సాక్‌క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఎక్స్‌పీరియా జెడ్3 కలిగి ఉంది.

4జీ ఎల్టీఈ మోడెమ్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఫీచర్లు ఎక్స్‌పీరియా జెడ్3 సామర్థ్యాన్ని కమ్యూనికేషన్ నెట్‌‍వర్కింగ్, మల్టీ మీడియా విభాగాల్లో మరింత బలోపేతం చేసాయి. ఏర్పాటు చేసిన 3జీ ర్యామ్ ఎక్స్‌పీరియా జెడ్3 మల్టీ టాస్కింగ్ ఆపరేషన్‌లను మరింత వేగవంతం చేస్తాయి. గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 రన్ అవుతుంది.

ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ఎక్స్‌పీరియా జెడ్3 హ్యాండ్‌సెట్‌లోని కెమెరా ఇతర ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లలో అమర్చిన కెమెరాలతో పోలిస్తే అత్యుత్తమమైన ప్రొఫెషనల్ క్వాలిటీ పనితీరును కనబరుస్తుంది. ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కెమెరాలో దాగి ఉన్న 10 అద్భుతమైన అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

కెమెరా సెన్సార్, ISO టెస్ట్

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 20.7 మెగా పిక్సల్ కెమెరా మరే స్మార్టో‌ఫోన్ కెమెరాలో లేనంతగా ISO 12800 సెన్సిటివిటీని కలిగి ఉంది. అంటే రాత్రి వేళల్లోనూ ఎక్స్‌పీరియా జెడ్3 ద్వారా అత్యుత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఏర్పాటు చేసిన 25 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా ఎక్కువ ప్రదేశాన్ని ఒక ఫ్రేమ్‌లో చిత్రీకరించవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

కెమెరా అలానే హ్యాండీక్యామ్

సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్‌3 స్మార్ట్‌ఫోన్‍‌లో సుపరిచితమైన హ్యాండీక్యామ్ రికార్డింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. ఈ సదుపాయంతో వీడియోలను అత్యుత్తమంగా 4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో చిత్రీకరించుకుని అత్యుత్తమ వీడియో అవుట్‌పుట్‌ను పొందవచ్చు. నిజంగా ఇదొక అద్భతం.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

స్టెడీషాట్ టెక్నాలజీ

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఏర్పాటు చేసిన స్టెడీషాట్ టెక్నాలజీ, ఫోటోలు లేదా వీడియోలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆకస్మిక కదుపులు లేదా కదలికలు సంభవించినప్పటికి వాటి ప్రభావం చిత్రీకరణ పై ఏ మాత్రం పడకుండా అత్యుత్తమ అవుట్ పుట్‌ను అందించే ప్రయత్నం చేస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

వాటర్‌ప్రూఫ్ టెస్ట్

ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో వినియోగించిన అత్యాధునిక కెమెరా లెన్స్ నీటి అడుగు భాగంలోనూ సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. శక్తివంతమైన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను ఎక్స్‌పీరియా జెడ్3 కలిగి ఉండటం చేత ఫోన్‌లోకి నీరు ప్రవేశించేందుకు ఏ మాత్రం ఆస్కారం లేదు. నీటి అడుగు భాగంలో చోటు చేసుకునే సాహాసోపేత సన్నివేశాలను ఎక్స్‌పీరియా జెడ్3 ఖచ్చితమైన వివరణలతో చిత్రీకరిస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

పెద్దవైన లెన్స్

ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఏర్పాటు చేసిన 25 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా ఎక్కువ ప్రదేశాన్ని ఒక  ఫ్రేమ్‌లో చిత్రీకరించవచ్చు. అలానే జెడ్3లో వినియోగించిన అవార్డ్ విన్నింగ్ జీ లెన్స్ ఎక్కువ వెళుతురును బంధించగలవు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్

1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ ఇమేజ్ క్వాలిటీతో పోలిస్తే 4 రెట్లు అధిక నాణ్యతను కలిగి ఉండే 4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. తద్వారా వీడియోలను 4కే రిసల్యూషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

ఈవెంట్స్ అన్ని సినిమాగా

సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కోసం ‘మూవీ క్రియేటర్' పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రియేటివ్ యాప్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు చిత్రీకరించిన ఫోటోలను వీడియోలను ఒకే చోటుకు సమీకరించి ఓ బ్లాక్ బస్టర్ సినిమాగా మలచవచ్చు. ఈ మూవీ క్రియేటర్ ఫీచర్ మీ ఈవెంట్‌ను నిర్థిష్టమైన సమయపాలనతో విశ్లేషించి మీ  జ్ఞాపకాలను అద్భుత కావ్యంగా మలుస్తుంది.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

ఫోటోల కోసం ఏఆర్ అడ్జస్ట్‌మెంట్

సాధారణంగా మనం చిత్రీకరించిన ఫోటోలను కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకుంటుంటాం. సోనీ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తన ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లో ఏఆర్ ఫన్ (AR fun) పేరుతో సరికొత్త కెమెరా యాప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆకర్షణీమయైన యాప్‌తో ఫోటోలను మీ ఆలోచనలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

ఎక్స్‌పీరియా జెడ్3లో మరిన్ని కెమెరా అప్లికేషన్‌లు

సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కోసం విభిన్నమనై కెమెరా అప్లికేషన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేసింది. వీటిని ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరా యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లను పరీక్షించినట్లయితే ప్రతీ అప్లికేషన్ ఓ సృజనాత్మకైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటైన మల్టీ కెమెరా ఫీచర్ ద్వారా ఫోన్‌ను వై-ఫై కనెక్షన్ ద్వారా ఇతర  ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లకు అనుసంధానించుకుని ఫోటోలు ఇంకా వీడియోలను ఏకకాలంలో ఒకేసారి వివిధ యాంగిల్స్‌లో చిత్రీకరించుకోవచ్చు.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరాలో 10 అద్భుతాలు

ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరా యాప్‌లో బోలెడన్ని ప్రత్యేకతలు

ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరా యాప్ బోలెడన్ని కెమెరా ఫీచర్లతో పాటు కెమెరా ఆప్షన్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఇంటర్నెట్‌లోకి లాగిన్ అవటం ద్వారా ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ కెమెరా పనితీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎక్స్‌పీరియా జెడ్3 కెమెరా యాప్‌‌లోని ఆకట్టుకునే ఫీచర్లలో ‘సౌండ్ ఫోటో ఫీచర్' ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సౌండ్ ఫోటో ఫీచర్ ఫోటో చిత్రీకరించిన సమయంలో ఆ ఫోటోకు సంబంధించిన శబ్థాలను కూడా రికార్డ్ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Amazing Things Sony Xperia Z3 Camera Can Do for You. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot