ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌ల కోసం కొన్ని లక్షల అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. స్మార్ట్ మొబైలింగ్ కార్యకలాపాలకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో రోజుకో కొత్త యాప్ పుట్టుకొస్తోంది. ఐఫోన్ యాప్‌లతో పోలీస్తే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు మరింత స్వేచ్చనిస్తాయాన్నది పలువురి వాదన. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్‌లను మీతో షేర్ చేుసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Muzei

ఈ ప్రత్యేకమైన యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్ర్కీన్‌ను " నివసిస్తున్న మ్యూజియం"గా మార్చేస్తుంది. ఈ లైవ్ వాల్ పేపర్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రతిరోజు కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

HoverChat

ఈ ప్రత్యేకమైన మెసేజింగ్ యాప్ ద్వారా నిరంతరాయంగా చాటింగ్ నిర్వహించుకోవచ్చు. ఫోన్‌లో వేరొక యాప్‌ను వినియోగస్తున్నప్పటికి హోవర్‌చాట్ యాప్‌ను స్ర్కీన్ పై రీసైజ్ చేసుకుని ఒకే సమయంలో రెండు పనులను నిర్వహించుకోవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Google Keep

ఈ ఫ్లెక్సిబుల్ రిమైండర్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మీ రోజు వారి టైమ్ టేబుల్‌ను పూచా తప్పకుండా పాటించవచ్చు. మీరు చేయవల్సిన కార్యకలాపాలను వాయిస్ మెమోల రూపంలో రికార్డ్ చేయటం ద్వారా ప్రతి పనిని ఈ యాప్ మీకు గుర్తు చేస్తుంది.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Cover

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న కవర్ యాప్ మీరు ఏఏ సందర్భాల్లో ఏఏ యాప్‌లను వినియోగిస్తారా విశ్లేషణ చేసుకుని ఆయా సందర్భాల్లో ఆయా యాప్ లను స్ర్కీన్ పైకి తెస్తుంది. తద్వారా మీ సమయం మరింత ఆదా అవుతుంది.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Light Flow

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎల్ఈడి లైట్ ఫర్ నోటిఫికేషన్ ఫీచర్‌ను కలిగి ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా టెక్స్ట్, ఈమెయిల్, ఫోన్ కాల్, క్యాలెండర్ రిమైండర్, లో బ్యాటరీ తదితర నోటిఫికేషన్‌లకు సంబంధించి ఒక్కో నోటిఫికేషన్‌కు ఒక్కో రకమైన కస్టమ్ కలర్‌ను సెట్ చేసుకోవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Cerberus Anti-theft

ఈ ఆండ్రాయిడ్ యాప్ మీరు పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి డేటాను ట్రాక్ చేస్తుంది. ఈ యాప్‌ను వెబ్‌సైట్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. కోడ్ ఆధారంగా పోగొట్టుకున్న డివైస్‌ను పూర్తిగా లాక్ చేయవచ్చు. ఆడియోను రికార్డ్ చేయవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Lux Auto Brightness

ఈ లక్స్ ఆటో బ్రైట్నెస్ ఆండ్రాయిడ్ యాప్ మీ ఫోన్ బ్రైట్నెస్ సెట్టింగ్స్‌ను ఆటోమెటిక్‌గా కంట్రోల్ చేస్తూ వాతావరణాన్ని బట్టి స్ర్కీన్ కాంతిని సర్దుబాటు చేస్తుంది.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Locale

ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మీ డివైస్‌ను నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Google's Sky Map

ఈ స్కై మ్యాప్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆకాశంలోని నక్షత్రాలకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.

 

ఐఫోన్ యూజర్లను ఊరిస్తోన్న 10 ఆండ్రాయిడ్ యాప్స్

Link Bubble Browser

లింక్ బుబుల్ బ్రౌజర్ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సమయాన్ని మరింతగా ఆదా చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా లింక్ పై క్లిక్ చేసినట్లయితే, లింక్ బుబుల్ బ్రౌజర్ యాప్ ఆ పేజీని పూర్తిగా లోడ్ చేసి మీ ముందుకు తీసుకువస్తుంది. తద్వారా సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 Android apps to make iPhone owners jealous. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot