స్మార్ట్‌ఫోన్‌లో స్మార్ట్ ఫీచర్స్

Written By:

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న చాలామందికి ఆ ఫోన్ గురించి పూర్తిగా తెలియదు.మాములుగా కాల్ కోసం మేసేజ్ లకు ఫోన్ ను వాడేవారు చాలామందే ఉంటారు. అయితే ఆ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. మాములుగా అయితే ఆండ్రాయిడ్ ఫోన్‌ను మెయిల్స్ చెకింగ్ ,బ్రౌజింగ్, సోషల్ మీడియా ఇలా అనేక రకాలైన పనులకు వాడుకోవచ్చు. ప్రతిరోజు వీటికే ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తుంటారు. మీ ఫోన్ లో ఉన్న ఓ 10 స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Read more: మీ స్మార్ట్‌ఫోన్‌ సేప్టీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్కాన్ బార్ కోడ్

మీరు మీ కెమెరాతో ఫోటోలు అలాగే వీడియోస్ తీస్తుంటారు.అయితే దీంతో పాటు స్కాన్ బార్ కోడ్ కూడా ఉంటుందనే విషయం తెలియదు. దీంతో మీరు అనేక పనులు చేసుకోవచ్చు. అలాగే బార్ కోడ్ కి సంబంధించి ప్లే స్టోర్ లో అనేక యాప్స్ ఉన్నాయి. ఓ సారి ట్రై చేయండి.

పోన్ కోల్పోతే

మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే అందులో డేటా గురించి తెగ బాధపడుతుంటారు కదా..అయితే మీ ఫోన్ పోయిన వెంటనే మీ డేటాను చెరిపేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ని వాడుకోవచ్చు. దీన్నించి మీరు మీ ఫోన్ రీ సెట్ చేయవచ్చు.

వాయిస్ కమాండ్స్

మీరు గూగుల్ వాడుతున్నారా..అయితే అందులో వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. మీరు వాయిస్ తో మీకు కావలిసింది నేరుగా సెర్చ్ చేయవచ్చు.

గూగుల్ క్రోమ్

ఆండ్రాయిడ్‌లో ఎక్కువగా గూగుల్‌నే వాడుతుంటారు కాబట్టి బ్రౌజర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం ఎక్కువగా గూగుల్ క్రోమ్ నే ఉపయోగించండి.

కలర్స్ బ్రైట్ నెస్

మీరు ఎక్కువగా బ్రైట్ నెస్ పెట్టుకుంటారు.కాని అలా చేయడం కన్నా తక్కువగా బ్రైట్ నెస్ పెట్టుకుంటే మీకు చార్జింగ్ కూడా కలిసివస్తుంది.

మీ ఫోన్ ఓనర్

మీ ఫోన్ కు మీరే ఓనర్ అనే విషయం తెలుసు గాని అది ఫోన్ లో ఎలా తెలుసుకోవాలి.ఇందుకోసం ఓనర్ ఇన్పరమేషన్ ఉపయోగించండి.

వైఫై హాట్ స్పాట్

ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ఫోన్ నుంచి ల్యాప్ టాప్ కు నెట్ తో కనెక్ట్ కావచ్చు.

మల్టిపుల్ లాంచర్స్

మీ ఫోన్ లో అనేక రకాలైన లాంచర్స్ ఉంటాయి. ధీమ్స్ అలాగే ఐకాన్స్ ఇవి మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి.

హిడెన్ డెవలపర్

మీకు కావలిసిన విధంగా దీన్ని మీ ఫోన్ లో సెట్ చేసుకోవచ్చు.

ఇతర యాప్స్

షాపింగ్ కోసం మీకు అనేక రకాలైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Android Smartphone Tweaks that you probably didn’t know about!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot