2018లో లాంచ్ అయిన 10 ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు

2018కిగాను ఆపిల్, గూగుల్, సామ్‌సంగ్, హువావే ఎల్‌జీ, వ‌న్‌ప్లస్, అసూస్, ఒప్పో, వివో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు 10 ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి.

|

2018కిగాను ఆపిల్, గూగుల్, సామ్‌సంగ్, హువావే ఎల్‌జీ, వ‌న్‌ప్లస్, అసూస్, ఒప్పో, వివో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు 10 ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి. ఆ వివరాలు మీకోసం...

 

ఈ ఏడాది వైరల్ అయిన వీడియోలు ఇవేఈ ఏడాది వైరల్ అయిన వీడియోలు ఇవే

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ మాక్స్ (Apple iPhone XS/XS Max)

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ మాక్స్ (Apple iPhone XS/XS Max)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఐఫోన్ ఎక్స్ఎస్/ఎక్స్ఎస్ మాక్స్‌లు ప్రముఖ స్థానాలను సొంతం చేసుకున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా సెటప్‌లతో ప్యాక్ అయి ఉన్నాయి. ఇదే సమయంలో ఈ ఫోన్‌లలో పొందుపరిచిన ఐకానిక్ ఏ12 చిప్‌సెట్ వేగవంతమైన పనితీరును ఆఫర్ చేస్తుంది. వీటిలో మొదటి మోడల్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ 5.8 అంగుళాల డిస్‌ప్లే ప్యానల్‌ను కలిగి ఉంటే, రెండవ మోడల్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ 6.5 అంగుళాల డిస్‌ప్లే ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఎస్ ధర రూ.99,990. ఎక్స్ఎస్ మాక్స్ ధర రూ.1,04,990.

గూగుల్ పిక్సల్ 3/ పిక్సల్ 3 ఎక్స్ఎల్ (Google Pixel 3/ Pixel 3 XL)
 

గూగుల్ పిక్సల్ 3/ పిక్సల్ 3 ఎక్స్ఎల్ (Google Pixel 3/ Pixel 3 XL)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గూగుల్ పిక్సల్ 3/ పిక్సల్ 3 ఎక్స్ఎల్ డివైస్ లు యాపిల్ తరువాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. హై-ఎండ్ ఫీచర్లతో లోడై ఉన్న ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ కారణంగా స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్‌లలో లోడ్ చేసిన సింగిల్ లెన్స్ రేర్ కరెమెరా సెటప్ అద్భుతమైన పిక్షర్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిలో మొదటి మోడల్ అయిన గూగుల్ పిక్సల్ 3 5.5 ఇంచ్ P-OLED డిస్‌ప్లే ప్యానల్‌తో ఎక్విప్ అయి ఉంటుంది. ఖరీదు రూ.66.500. రెండవ మోడల్ అయిన గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ 6.3 అంగుళాల P-OLED డిస్‌ప్లే ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ఖరీదు రూ.78,500.

 

 

హువావే మేట్ 20 ప్రో (Huawei Mate 20 Pro)

హువావే మేట్ 20 ప్రో (Huawei Mate 20 Pro)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో హువావే మేట్ 20 ప్రో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. నెల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ శక్తివంతమైన Kirin 980 చిప్‌సెట్ పై రన్ అవుతోంది. ఆపిల్ ఏ12 బయోనిక్ చిప్‌‍సెట్ తరహాలోనే 7ఎన్ఎమ్ ఆర్కిటెక్షర్ పై ఈ చిప్‌‌సెట్‌ను బిల్డ్ చేయటం విశేషం. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏకంగా మూడు కెమెరాలు ఎక్విప్ అయి ఉంటాయి.40 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో ఈ సెటప్ ఏర్పాటై ఉంటుంది. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు రూ.69,990.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 (Samsung Galaxy Note 9)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 (Samsung Galaxy Note 9)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 ఈ జాబితాలో నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది. స్టైలస్-పెన్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 845/ ఎక్సినోస్ 9810 సాక్, 6జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ ఖరీదు రూ.67,900. మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లు వంటి కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9/ఎస్9 ప్లస్ (Samsung Galaxy S9/S9 Plus)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9/ఎస్9 ప్లస్ (Samsung Galaxy S9/S9 Plus)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9/ఎస్9 ప్లస్‌లు ఐదవ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. శక్తివంతమైన ఫీచర్లతో ప్యాక్ అయి ఉన్న ఈ ఫోన్ లు ప్రీమియమ్ రేంజ్ పనితీరును కనబరుస్తాయి. వీటిలో గెలాక్సీ ఎస్9 మోడల్ 5.8 ఇంచ్ డిస్‌ప్లే ప్యానల్‌తో ఎక్విప్ అయి ఉంటుంది. ఖరీదు రూ.66.500. రెండవ మోడల్ అయిన గెలాక్సీ ఎస్9 ప్లస్ మోడల్ 6.2 ఇంచ్ డిస్‌ప్లే ప్యానల్‌తో లోడై ఉంటుంది.

 

 

OnePlus 6T (వన్‌ప్లస్ 6టీ)

OnePlus 6T (వన్‌ప్లస్ 6టీ)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్ 6టీ 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 6.4 ఇంచ్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్), ఆండ్రాయిడ్ పీ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి, 20 + 16 మెగా పిక్సల్ డ్యుయలర్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సూపర్ స్లో మోషన్, ఇంటెలిజెంట్ సీన్ రికగ్నిషన్, నైట్ స్కేప్ మోడ్, స్టూడియో లైటింగ్, 16 మా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ నానో సిమ్ విత్ డ్యుయట్ స్టాండ్ బై (4జీ + 4జీ), 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ (Asus ROG Phone)

ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ (Asus ROG Phone)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ నెల రోజల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఖరీదు రూ.69,990. డీ వేపర్ - ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీతో విడుదలైన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైస్ చరిత్ర సృష్టించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా యాడ్ చేసిన కార్బన్ ప్యాడ్ ఇంకా కాపర్ స్ప్రెడర్‌లు అదనపు కూలింగ్‌ను ఆఫర్ చేస్తాయి. ఈ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఎయిర్‌ట్రిగ్గర్ టచ్ సెన్సార్స్, సైడ్ మౌంటెడ్ పోర్ట్స్ (ల్యాండ్‌స్కేప్ మోడ్ కోసం), AMOLED డిస్‌ప్లే విత్‌హెచ్ డిఆర్ విజువల్స్ (90Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 1ఎమ్ఎస్ రెస్పాన్స్ టైమ్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ అప్ టు 2.96GHz), అడ్రినో 630 జీపీయూ వంటి విప్లవాత్మక నిక్షిప్తమై ఉన్నాయి.

ఎల్‌జీ వీ40 థింక్ (LG V40 ThinQ)

ఎల్‌జీ వీ40 థింక్ (LG V40 ThinQ)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఎల్‌జీ వీ40 థింక్ 8వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు రూ.72,490గా ఉండొచ్చని అంచనా. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, అడ్రినో 630 జీపీయూ, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన ఈ ఫోన్‌లో ఉన్నాయి.

వివో నెక్స్ (Vivo Nex)

వివో నెక్స్ (Vivo Nex)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వివో నెక్స్ (Vivo Nex) 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు రూ.44,990. పాప్-అప్ స్లైడర్ కెమెరా, బిజెల్-లెస్ డిజైన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, 8జీబి వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

 

 

ఒప్పో ఫైండ్ ఎక్స్ (Oppo Find X)

ఒప్పో ఫైండ్ ఎక్స్ (Oppo Find X)

2018లో లాంచ్ అయిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒప్పో ఫైండ్ ఎక్స్ (Oppo Find X) 10వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు రూ.58,000గా ఉంది. బెజిల్-లెస్ డిజైన్, 93.8% బాడీ రేషియో, గ్లాస్ బ్యాక్ బాడీ, అల్యూమినియమ్ ఫ్రేమ్, డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్, 8జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
10 best ultra-premium smartphones of 2018.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X